Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలి

$
0
0

సంగారెడ్డి, మే 16: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఈ నెల 25లోపు చెల్లించాలని ల కలెక్టర్ ఎ.దినకర్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో డ్వామా ఎపిడి, ఎపిఓ, విద్యుత్, ఆర్‌డబ్ల్యుఎస్, పిఆర్, ఎపిఎంఐపి, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జివో నంబర్ 103 ప్రకారం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 4500రూపాయల చొప్పున ఎంత మందికి చెల్లింపులు చేయాలో ఈ నెల 18లోగా మండల,గ్రామాల వారిగా జాబితాను సమర్పించాలని,25లోగా పూర్తి చెల్లింపులు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ జాబిత తయారిలో పొరపాట్లు జరగకుండా సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని,లేని పక్షంలో ఒక్కొక్కరి పేరుకు 20రూపాయలను వారి జీతభత్యము నుండి రికవరి చేయడం జరుగుతుందని హెచ్చరించారు.నిర్మల్ అభియాన్ కింద నిర్మించుకునే వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారుల జాబితాల్లో డిఆర్‌డిఎకు అందజేసిన జాబితాలు,డ్వామా అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టిన జాబితాకు చాల వ్యత్యాసం ఉందని అధికారులు సరిచూసుకొని సరైన విధంగా అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను విధిగా చేపట్టాలని, పని అడిగిన ప్రతి కూలీకి పని కల్పించాలని సూచించారు.ఇందిర జలప్రభలో బోర్లు వేసిన వాటికి వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
సమావేశంలో డ్వామా పిడి శ్రీ్ధర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ విజయ్‌ప్రకాష్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాములు, పిఆర్ ఎస్‌ఈ వెంకటేశ్వర్‌రావు, ఎపిఎంఐపి పిడి రామలక్ష్మి, ఉద్యాన శాఖ ఎడి శేఖర్, డ్వామా ఎపిడి, ఎపిఓలు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులో వచ్చిన
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
* వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి రఘువీరారెడ్డి
సంగారెడ్డిరూరల్, మే 16: రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్వాలిటీగా పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి సూచించారు.గురువారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చేయాలన్నారు.గ్రామ రెవెన్యూ అధికారులు కార్యాలయాలను ప్రారంభించాలని,ప్రారంభించిన కార్యాలయాల్లో ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు ఉండే విధంగా చూడాలన్నారు.గ్రామాల్లో కార్యాలయాలు ప్రారంభించేందుకు గ్రామ రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.కౌలు రైతుల జాబితాను గ్రామాల వారిగా సిద్ధ్దం చేయాలని అధికారులకు సూచించారు. రుణ అర్హత కార్డుల జాబితా రూపొందించి బ్యాంకులకు అందజేయాలని ఆదేశించారు.కౌలు రైతులు రుణ అర్హత కార్డుల కోసం మీసేవలో దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తులు చేసుకున్న 15రోజుల్లో రుణ అర్హత కార్డులను జారీ చేయడం జరుగుతుందన్నారు.త్వరలో పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డిడ్‌లు కూడా మీసేవ ద్వారా అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఓ ప్రకాష్‌కుమార్, మెదక్ సబ్ కలెక్టర్ భారతి హోళికేరి, ఆర్డీఓ రాంచంద్రారావు, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ లక్ష్మికాంత్ పాల్గొన్నారు.

పుట్టిన పది రోజులకే ఆడపిల్లను
ప్రభుత్వానికి అప్పగించిన గిరిజన కుటుంబం
*మహిళలకు భరోసా ఇవ్వని బంగారు తల్లి పథకం
మెదక్, మే 16: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బంగారు తల్లి పథకాన్ని ప్రకటించిన మెదక్ జిల్లాలోనే ఆడపిల్ల పెంపకం భారంగా మారింది. నవమాసాలు మోసి కన్నబిడ్డను పది రోజులకే ప్రభుత్వానికి అప్పగించిన సంఘటన మెదక్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. కౌడిపల్లి మండలం రూప్‌సింగ్ తాండాలోని ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రూప్‌సింగ్ తాండాకు చెందిన రాజు, హాస్లి అనే దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు జన్మించాడు. అందులో ఒక కుమార్తె మరణించింది. తిరిగి హస్లి ఈ నెల 6న ఆరవ సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. వీరి కుటుంబం పేద కుటుంబం కావడంతో ఆడపిల్లను పోషించలేమని మెదక్ జిల్లా సంగారెడ్డిలోని చైల్డ్ హెల్ప్‌లైన్ ద్వారా జిల్లా అధికారులను ఆశ్రయించారు. హెల్ప్‌లైన్ సూచన మేరకు సంగారెడ్డిలో ఉన్న ఐసిడియస్ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజకు రాజు హాస్లి అనే దంపతులు వారికి జన్మించిన పది రోజుల ఆడబిడ్డను ఈ నెల 16న అప్పగించారు. ముఖ్యమంత్రి బంగారు తల్లి పథకం మెదక్ జిల్లాలో ప్రకటించారు. ఈ పథకాన్ని మే 1 నుంచి అమలులోకి తెస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈ దంపతులకు పుట్టిన బిడ్డ ఈ నెల 6న జన్మిచడం వలన బంగారు తల్లి పథకం ఈ పసిబిడ్డ ఆర్హురాలైనప్పటికీ ఆ దంపతులు ప్రభుత్వానికి అప్పగించడం పట్ల జిల్లా చర్చనీయాంశంగా మారింది. నర్సాపూర్ నియోజకవర్గంలోని గిరిజన తాండాలలో ఆడపిల్లలు జన్మిస్తే ఆ బిడ్డలను విక్రయించడం, లేద చంపడం అనేది జరుగుతూ వస్తుంది. ఆడ పిల్లల విక్రయాల విషయంలో నర్సాపూర్ నియోజకవర్గం పతాక శీర్షికలో వచ్చిన వార్తలు విధితమే ఆలాంటి నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలం రూప్‌సింగ్ తాండా ఒక ఆడపిల్లను ప్రభుత్వానికి అప్పగించడం దురదృష్టకరమైన సంఘటన. తల్లిదండ్రుల ఆలనపాలనలో పెరగాల్సిన బిడ్డ అనాదాశ్రమంలో పెరగాల్సిన దుస్థితి ఆ బిడ్డకు నెలకొంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించిన, బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టిన కూడా ఈ పథకాలు గిరిజనుల దారిచేరలేవదనటానికి ఇది తాజా ఉదహారణ.
25లోగా అమ్మహస్తం సరుకులు
సంగారెడ్డిరూరల్, మే 16: జిల్లాలో ఈ నెల 25వ తేదీ లోపు అమ్మహస్తం పథకం కింద 9రకాల సరుకులను చౌకధరల దుకాణాల ద్వారా అందించడం జరుగుతుంది సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 9 సరుకులకు గాను పామాయిల్, కందిపప్పు, పంచదార, ఉప్పు, చింతపండు, కారంను గోదాముల నుండి చౌకధరల దుకాణాలకు పంపడం జరిగిందని, గోదుమలు, గోధుమపిండిని కూడా 50 శాతం వరకు దుకాణాలకు పంపించడం జరిగిందన్నారు. మిగతా సరుకులను త్వరలో చౌక ధరల దుకాణాలకు పంపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్డుదారులు సరుకులను కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
మాస్‌కాపీకి పాల్పడుతూ చిక్కిన 42 మంది విద్యార్థులు
జహీరాబాద్‌టౌన్, మే 16: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి రెండవ సంవత్సరం చివరి పరీక్ష రాస్తున్న 42 మంది విద్యార్థులు మాస్‌కాపీ కొడుతూ పట్టుబడినట్టు ఛీఫ్ ఎగ్జామినర్ తెలిపారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలు నడుస్తున్న సమయంలో యూనివర్సీటి స్పెషల్ స్క్వాడ్ సభ్యులు వచ్చారు. వీరు కాపీ కొడుతున్న 42 మంది విద్యార్థులను మాల్‌ప్రాక్టీస్‌కింద పట్టుకుని డిబార్ చేశారు. చివరి పరీక్షకు స్థానిక కేంద్రంలో 432 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.

రఘునందన్ ఆరోపణలు విడ్డూరం
*టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ
సంగారెడ్డిరూరల్, మే 16: టిఆర్‌ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురైన రఘునందన్‌రావు పార్టీ నాయకులపై అభూత కల్పనలతో ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షడు ఆర్.సత్యనారాయణ పేర్కొన్నారు.12సంవత్సరాలుగా మంచివారిగా కనిపించిన నాయకులు, ఆయనపై సస్పెన్షన్ వేటు వేయగానే చెడ్డవాళ్లు అయ్యారా రఘునందన్ వివరణ ఇవ్వాలన్నారు.సస్పెండ్ అయ్యాక ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంజాయిషీ ఇవ్వాల్సిందిపోయి ఎదురుదాడికి దిగడం వెనకాల ఆయనకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు.ఏమైన బిన్నాప్రాయాలు ఉంటే పార్టీ వేదికలపై తన అభిప్రాయాలు వెళ్లడించాల్సి ఉంది తప్ప మీడియాకు ఎక్కడం క్రమశిక్షణారాహిత్యం తప్ప మరొకటి కాదన్నారు.ఆయన చేస్తున్న చర్యలు తెలంగాణ ఉద్యమానికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. గడిచిన 12సంవత్సరాలలో రఘునందన్‌రావుకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, పార్టీ ద్వారా గుర్తింపువచ్చిందన్నారు. పార్టీకి సంజాయిషీ ఇచ్చి బహిష్కరణ వేటును తప్పించుకోవాలని సత్యనారాయణ సూచించారు.

సమస్యల పరిష్కారం కోరుతూ
ఐకెపి ఉద్యోగుల సమ్మె
సంగారెడ్డిరూరల్, మే 16: ఐకెపిలో పని చేస్తున్న సెర్ఫ్ హెచ్‌ఆర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె సరైన్ మోగించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నార నర్సప్ప తెలిపారు.సమ్మె నోటిసును గురువారం డిఆర్‌డిఎ పిడి సుధాకర్‌కు సమర్పించారు.16నుండి 20వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటామని, 21న ఉద్యోగులందరూ సామూహిక సెలవుపెట్టి చలో కలెక్టరేట్,22న నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతుందన్నారు.గత సంవత్సరం సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే సమస్యల పరిష్కారిస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు సమ్మెను విరమించేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యాదగిరి, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

బెల్టుషాపులపై పోలీసుల దాడులు
జగదేవ్‌పూర్, మే 16: మునిగడపలో అక్రమంగా నిర్వ హిస్తున్న మద్యం గొలుసు దుకాణాలపై ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యం లో పోలీసులు బుదవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో అక్రమంగా నిలువ ఉంచిన 40 క్వాటర్ బాటిల్లు, 2బీరు కాటన్‌లను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు రవిపై కేసు నమోదు చేశారు. కాగా నిబందనలకు విరుద్ధ్ధంగా బెల్టుషాపులు నిర్వహిస్తే ఊరుకునేది లేదని, అలాగే అక్రమంగా మద్యం నిలువలు ఉంటే తమకు సమాచారం అందించాలని ఎస్‌ఐ సత్యనారాయణ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం
గజ్వేల్, మే 16: ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని మాదిగ ఎంప్లారుూస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శంకర్, ఉపాధ్యక్షులు చేబర్తి యాదగిరి, కార్యదర్శి సుధాకర్‌లు పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌లోఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళితులు విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభ్యున్నతి సాధించిన రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయని స్పష్టం చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణమాదిగ చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడంతోపాటు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్, టిడిపి, వైఎస్సార్ సిపిలు బిల్లు ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే సామాజిక ఉద్యమాల్లో దళితుల బాగస్వామ్యం నిమిత్తం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మాదిగ ఉద్యో గుల సమాఖ్యను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. సమావేశంలో నేతలు సుంచు నరేందర్, జి.వెంకటకిరణ్, వెంకన్న, ప్రభావతి, బాలమల్లయ్య, మల్కపురం శంకర్, నాగభూషణం, నాగయ్య, బండారు యాదగిరి, బాల పోచయ్య, కృష్ణ, పరశురాం, లక్ష్మయ్య, గుండ్ర నర్సింలు, కృష్ణవేణి, యాదయ్య, కనకయ్య, రాములు, లక్ష్మినర్సయ్య, కనకరాజు, మహేష్, మల్లేశం, దమ్మని మల్లయ్య, శ్రీను, సత్తయ్య పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై కళాజాత
జగదేవ్‌పూర్, మే 16: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఆమలుతోపాటు వివిధ సంక్షేమ పథకాల ఆమలు తీరుపై మండలం లో గురువారం కళాజాత నిర్వహించారు. సిద్ధేశ్వర జానపద నాట్య కళా మండలి, వెంకటేశ్వర కళామండలి బృందంచే మండల పరిధిలోని ఇటిక్యాల, తీగుల్, మునిగడప, పీర్లపల్లి, వట్టిపల్లి, జగదేవ్‌పూర్, అలిరాజ్‌పేట, ఎర్ర వల్లి గ్రామాల్లో ఆటాపాటలతోపాటు పల్లె సుద్దుల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చైతన్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీం ఇన్‌చార్జి ప్రకాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు సుమాంజలి, రమ్య, యాదగిరి, జెమిని, కృష్ణ, అనీల్, కిష్టయ్య, రమేష్, రాము, మధు తదితరులు పాల్గొన్నారు.

రఘనందర్‌రావు ఆరోపణలు అర్థరహితం
* రఘనందన్‌రావు ఆనాడే ఎందుకు స్పందించలేదు
* కెసిఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
* మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి
సిద్దిపేట, మే 16 : టిఆర్‌ఎస్ బహిష్కృత నేత రఘునందన్‌రావు టిఆర్‌ఎస్ పార్టీ నేతలైన కెసిఆర్, హరీష్‌రావులపై చేసిన ఆరోపణలు అర్థరహితమని..తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆర్‌అండ్‌భి అతిధి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రఘనందన్‌రావు తెలంగాణ ఉద్యమ శ్రేయోభిలాషి అయితే టిఆర్‌ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే ఆనాడే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పార్టీనుండి బహిష్కరించిన తర్వాత అక్కసుతో పార్టీపై, కెసిఆర్, హరీష్‌రావులపై బురద జల్లటం సమంజసం కాదన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ నాయకులపై నోటికివచ్చినట్లు విమర్శలు చేయటం సమంజసం కాదన్నారు. రఘనందన్‌రావును ఎమ్మెల్సీగా పోటీచేసినప్పుడే హరీష్‌రావు ఓడిస్తే ఇప్పటివరకు హరీష్‌రావుతో ఎందుకు సఖ్యతగా మెలగారని ప్రశ్నించారు. కెవిపి రాంచందర్‌రావు సుట్‌కేసులు ముడుపుల వ్యవహరంపై సాక్షిగా వున్నప్పుడు ఇప్పటివరకు ఈవిషయాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చె విషయాలు తెలిసిన చెప్పకపోవవం నేరమన్నారు. రఘునందర్‌రావు అప్పుడు చెప్పకుండ ఇప్పుడు చెప్పటం టిఆర్‌ఎస్ పార్టీని, నేతలపై అప్రతిష్ట పాలు చేయటమేనన్నారు. తనకు తెలిసినంతవరకు టిఆర్‌ఎస్ పార్టీలో హరీష్‌రావు, రఘనందర్‌రావులే అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు తెలిపారు. ఎంఆర్‌ఎఫ్ కంపెనిలో సైతం హరీష్‌రావు వర్కింక్ ప్రసిడెంట్‌గా వుంటే, గౌరవ అధ్యక్షుడుగా రఘునందన్‌రావులే వున్నారన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులైన కెటిఆర్, కవిత, హరీష్‌రావులపై రఘనందన్‌రావు విమర్శలు అర్థరహితమన్నారు. వైఎస్ సిఎంగా వున్నప్పుడు హరీష్‌రావు సచివాలయంలో కలసాడని...చాటుమాటుగా కలవలేదన్నారు. ఇప్పటికి ఈవిషయంపై పలుమార్లు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రఘనందన్‌రావు కెసిఆర్ కుటుంబ సభ్యులపై, హరీష్‌రావులపై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రఘనందన్‌రావు మహాకూటమి పొత్తులో భాగంగా ఎమ్మెల్సీగా పోటీచేసినప్పుడు టిఆర్‌ఎస్, టిడిపి నాయకుల మధ్య అభిప్రాయం బేధాల వల్ల ఓటమి చెందాడన్నారు. దీనికి హరీష్‌రావును బాధ్యున్ని చేయటం సమంజసం కాదన్నారు. దుబ్బాక నియోజక వర్గంలో టిఆర్‌ఎస్ గ్రూపు విభేదాలు చిన్నవేనని త్వరలోనే సమసి పోతాయన్నారు. జిల్లాలోనే దుబ్బాక నియోజక వర్గంలో తెలంగాణ ఉద్యమం బలంగా వుందని, తనతో పాటు, కార్యకర్తలపై వందలాది కేసులు వున్నాయన్నారు. పార్టీకార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా వుంటానని, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. ఈసమావేశంలో టిఆర్‌ఎస్ నేతలు తౌడ శ్రీనివాస్, నిరంజన్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సాయినాథుని పల్లకీ సేవ
గజ్వేల్, మే 16: గజ్వేల్ పట్టణంలోని శ్రీ శేషసాయి మోక్ష మందిరం వార్షి కోత్సవాల్లో భాగంగా బుదవారం రాత్రి స్వామివారి పల్లకి సేవ ఘనం గా జరిగింది. వేదపండితుల మంత్రోశ్చరణలు, భక్తజనుల జయజయ ద్వానాల మద్య సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పల్లకిపై సాయినాధుడిని అదిష్టింపజేసి అనంతరం ప్రధాన వీదుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు భజన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా, వేదపండితులు నందబాలశర్మ, రామరాజశర్మ, విఠాలకృష్ణచైతన్య శర్మ, ఆలయ కమిటీ సభ్యులు బొగ్గుల సురేష్, ఎల్లురాంరెడ్డి, గుంటుకు మల్లేశం, పేర్ల శ్రీనివాస్, భాస్కర్, సత్యనారాయణ, జానకిరాంరెడ్డి, నేతి నాగరాజు, ఉప్పల సంజయ్‌గుప్త, చిగుళ్లపల్లి రవి, కొత్త గోవర్థన్, రవీందర్‌రెడ్డి, గాడిపల్లి భాస్కర్, కొమురవెల్లి శంకరయ్య, బెజుగామ వీరేశం, జానకి రాంరెడ్డి, ఉప్పల రఘువీర్, ఆకుల వెంకటేశం, పంజాల రాజు, కల్లూరి అశోక్, జంగం రమేష్, గుంటుకు రాజు, డాక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

బస్‌పాస్ చార్జీల పెంపు యోచనను విరమించుకోవాలి
సంగారెడ్డిరూరల్,మే 16: విద్యార్థుల బస్‌పాస్ ధరలను పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు.చార్జీలను పెంచి పేద విద్యార్థులపై భారాలు మోపడం దారుణమన్నారు.ఈ నిర్ణయంతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.ప్రభుత్వం స్పందించి బస్‌పాస్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, నరేష్, మచ్చేందర్, బస్వరాజ్, దుర్గేష్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

* కలెక్టర్ దినకర్‌బాబు
english title: 
cl

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>