Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గాలివాన బీభత్సం

$
0
0

ఆత్మకూరు/పొదలకూరు, మే 16: ఆత్మకూరుడివిజన్‌లోని ఏఎస్‌పేట, పొదలకూరు, మండల్లాలో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం కురిసిన గాలి, వాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, మామిడి చెట్లు విరిగి నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా ఆగిపోయి ఏఎస్‌పేటలో గురువారం సాయంత్రం వరకు అంధకారం నెలకొంది. మండలంలోని అనుమసముద్రం, ఏఎస్‌పేట తదితర గ్రామాలలో విద్యుత్ వైర్లు తెగిపోగా, విద్యుత్ స్తంభాలు విరిగి పోయాయి. అనుమసముద్రంలో రైస్‌మిల్లు పై కప్పు ఎగిరిపోవడంతో వర్షానికి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితులు చెప్పారు. పూరిల్లు కూలిపోయాయి. పలు గ్రామాలలో ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి, అక్కడక్కడ చెట్లు విరిగిపోయి రోడ్లపై పడివున్నాయి. దాంతో వాహన చోదకులకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. పందిపాడులో పొగాకు బేరన్ గోడలు, రేకులు పడిపోయినట్లు బాధితులు రమణారెడ్డి తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. మండలంలోని రాజవోలు, పొనుగోడు, హసనాపురం, చెందలూరుపాడు, ఏఎస్‌పేట తదితర గ్రామాలలో గాలులకు మామిడి చెట్లు సైతం నేలకొరిగాయి. పెద్దసంఖ్యలో కాయలు రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని మామిడి రైతులు వాపోతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. బుధవారం సాయంత్రం గాలి,వాన బీభత్సానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరిగి గురువారం రాత్రి ఏడు గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధించారు. మండల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురైనారు.
పెనుగాలుకు నేల రాలిన మామిడి
పొదలకూరు, మే 16: మండలంలో బుధవారం రాత్రి సంభవించిన పెనుగాలులకు మామిడి, అరటి, తమలపాకు తోటలు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం పదిలక్షల రూపాయల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనా. బోగసముద్రం, నావురుపల్లి, ప్రభగిరిపట్నం గ్రామాల్లో 23 ఎకరాల మామిడితోటలు, నావూరులో పది ఎకరాల అరటితోటలు, తాటిపర్తి, మహ్మదాపురం గ్రామాల్లో పదిహేను ఎకరాల తమలపాకు తోటలు దెబ్బతిన్నట్లు సమాచారం.

18నుంచి జిల్లాలో
మినీ మహానాడులు
- బీద వెల్లడి -
నెల్లూరు, మే 16: ఈనెల 27,28 తేదీల్లో హైదరాబాద్‌లో మహానాడు జరగనున్న సందర్భంగా ముందుగా జిల్లాలో పదినియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించదలిచామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర చెప్పారు. 18న గూడూరు, కోవూరు నియోజకవర్గాలకు సంబంధించి, 19న కావలి, ఆత్మకూరులో, 20న నెల్లూరు నగరంలో, 21న నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి, 22న ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు సంబంధించిన మినీ మహానాడు జరుగుతుందన్నారు. 24న నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవనల్‌లో జిల్లా స్థాయి మహానాడు జరుగుతుందన్నారు.
తహశీల్దార్ల బదిలీ
నెల్లూరు అర్బన్ , మే 16: జిల్లాలో పలువురు తహశీల్దార్లు బదిలీ అయ్యారు. సెలవులో ఉన్న ఎన్ లలిత కొండాపురం తహశీల్దార్‌గా, నియమితులయ్యారు. గుంటూరులోని వి బాలకృష్ణారెడ్డి డివి సత్రం, డిసిసత్రంలోని జయప్రకాష్ దగదర్తి, గుంటూరు జిల్లాలో ఉన్న కె రమేష్‌నాయుడు నెల్లూరు జిల్లా అల్లూరుకు, కొండాపురంలో ఉన్న వి లావణ్య బోగోలుకు, అల్లూరులో ఉన్న వి శ్రీనివాసులురెడ్డి వెంకటాచలంకు, వెంకటాచలంలో ఉన్న పి జనార్ధనరావు నాయుడుపేటుకు, నాయుడుపేటలో ఉన్న ఎం చెంచుకృష్ణమ్మ డక్కిలికి బదిలీ అయ్యారు. వివిధ మండలాలో పనిచేస్తున్న 11 మంది డిప్యూటీ తహశీల్దార్లను పలు ప్రాంతాలకు బదిలీ చేసారు. పొదలకూరులో ఉన్న వై మధుసూధనరావును స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్‌గా టిజిపి లొకేషన్‌కు, ఎస్‌డిసి, కెఆర్ కమిటీలో ఉన్న ఎస్‌కె గుల్జార్‌ను నెల్లూరు డిస్ట్రిక్ సప్లయి ఆఫీసుకు, నెల్లూరులోని ఎం శివకుమార్‌ను పొదలకూరు డిఎస్‌ఓ ఆఫీసుకు, కావలి చెక్‌పోస్టులోవున్న ఎంఎస్ శ్రీనివాస్‌ను నెల్లూరులోని టిజిపి లోకేషన్‌కు, నెల్లూరు డిఎస్‌ఓ ఆఫీసులో ఉన్న కృష్ణారావును కోవూరు తహశీల్దార్ ఆఫీసుకు, నెల్లూరు డిఎస్‌ఓ ఆఫీసులోని సిఎస్ డిటి ఎ నిర్మలానందబాబాను ఎస్‌డిసి కెఆర్‌ఆర్ కమిటీ నెల్లూరుకు, గూడూరు చెక్‌పోస్టు డిటి ఎస్ ఖాదర్‌బాషాను తడ డిటిగా, ఎలక్షన్ డిటిగా ఉన్న జి గీతావాణిని గూడూరు డిఎస్‌ఓ ఆఫీసుకు, నెల్లూరులో ఉన్న పి బాలముళిని కావలి డిఎస్‌ఓ ఆఫీసుకు, చేజర్లలో ఉన్న జి ఆనందరావును కలువాయి డిటిగా, కలువాయిలో ఉన్న ఎం వెంకటేశ్వర్లును మర్రిపాడు డిటిగా బదిలీ చేసారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ స్థాయికి చెందిన 24 మందిని పలు ప్రాంతాలకు బదిలీ చేసారు. వారి వివరాలు గూడూరు ఆర్‌ఐ వై నాగరాజును నెల్లూరు తహశీల్దార్ కార్యాలయంకు, ఎస్‌ఆర్‌పురంలోని రాజేష్‌ను టిపి గూడూరు ఆర్‌ఐగా, పొదలకూరులో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న శాంతకుమారిని నెల్లూరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ విభాగానికి, పొదలకూరులోని ఎల్ రవిని అదే స్థానంలో సీనియర్ అసిస్టెంట్‌గా, రాపూరులోని ఆర్ శ్రీనివాసులునాయుడును అదే ప్రాంతంలో సీనియర్ అసిస్టెంట్‌గా, ఆత్మకూరు సీనియర్ అసిస్టెంట్ సాయిచంద్‌ను అదే ప్రాంతంలో ఆర్‌ఐగా, ఆత్మకూరులోని పి విజయను అదే ప్రాంతంలో సీనియర్ అసిస్టెంట్‌గా, కోవూరులో ఆర్‌ఐగా ఉన్న మధుబాలను అదే మండలంలోసీనియర్ అసిస్టెంట్‌గా, కోవూరులో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న అనురాధాను అదే ప్రాంతంలో ఆర్‌ఐగా, ముత్తుకూరులో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న జ్యోతిని అదే మండలంలో ఆర్‌ఐగా, జలదంకిలో ఆర్‌ఐగా ఉన్న వెంకటరామిరెడ్డిని సీతారామపురం తహశీల్దార్ ఆర్‌ఐగా, బోగోలులో ఉన్న ఆర్‌ఐను అదే ప్రాంతంలో సీనియర్ అసిస్టెంట్‌గా, కావలి ఆర్‌ఐ అజంతుల్లాఖాన్‌ను కొండాపురం సీనియర్ అసిస్టెంట్‌గా, కొండాపురంలో ఆర్‌ఐగా ఉన్న ఎం కోటేశ్వరరావును కలిగిరి సీనియర్ అసిస్టెంట్‌గా, వరికుంటపాడు ఆర్‌ఐ సందాని బాషాను అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, వాకాడులో ఆర్‌ఐగా పనిచేస్తున్న విజయలక్ష్మిని గూడూరు సబ్‌కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా, డివి సత్రంలో ఆర్‌ఐగా ఉన్న లక్ష్మినారాయణరెడ్డిని గూడూరుసబ్‌కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా, కోట ఆర్‌ఐగా ఉన్న మల్లికార్జునరావును సైదాపురం సీనియర్ అసిస్టెంట్‌గా, ఓజిలిల ఆర్‌ఐగా ఉన్న ఎం మారెయ్యను తడ ఆర్‌ఐగా, సూళ్ళూరుపేట ఆర్‌ఐ రాజశేఖర్‌ను అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, కలువాయిలో ఆర్‌ఐగా ఉన్న బాలకోటమ్మను నెల్లూరు కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా, నెల్లూరులోని కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావును కావలి ఆర్‌ఐగా, కలిగిరిలో ఆర్‌ఐగా ఉన్న మురళీధర్‌రాజును ఉదయగిరి సీనియర్ అసిస్టెంట్‌గా, సైదాపురం ఆర్‌ఐగా ఉన్న నిరంజన్‌ను గూడూరు తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీ చేసారు. బదిలీలైన మూడు క్యాడర్ స్థాయిల అధికారులు పోస్టింగ్‌లో చేరాల్సి ఉంది.
రైతుల్లేక రైతు సదస్సు వెలవెల
సూళ్లూరుపేట, మే 16: సూళ్లూరుపేట బాలికల గురుకల పాఠశాలలో గురువారం డివిజన్ స్థాయిలో జరిగిన రైతు సదస్సు రైతుల్లేక వెలవెలపోయింది. 10గంటలకు ప్రారంభం కావాల్సిన సదస్సు ప్రజాప్రతినిధులు రాక ఆలస్యం కావడంతో 12గంటలకు ప్రారంభమైంది. రెండు గంటలు ఆలస్యం కావడంతో సదస్సుకు వచ్చిన రైతులు వసతులు లేక మండుటెండలో తిండితిప్పల కోసం వెంపర్లాడాల్సి వచ్చింది. కొందరు చేసేదేమి లేక నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. మైదానంలో ఏర్పాటు చేసిన కుర్చీలన్ని జనాలు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. ఏర్పాట్లు చేయడంతో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రైతులు కోసం కాకుండా కేవలం అధికారులు,ప్రజా ప్రతినిధులు ప్రయోజనాల కోసం సదస్సు పెట్టారని తీవ్ర విమర్శలు గుప్పమన్నాయి. తీరా 12గంటలకు ఎమ్మెల్యే పరసారత్నం, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి రావడంతో అధికారులు సదస్సు ప్రారంభించారు. జ్యోతి వెలగించి ప్రారంభమైన రైతు సదస్సు రైతులకు వ్యవసాశాఖ ద్వారా అందించే సేవలు,సాగులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడకుండా కేవలం రాజకీయ పొగడ్తల ప్రసంగాలతో ముగించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వ పాలన పై తీవ్రంగా విమర్శించారు. రైతుల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఆదర్శ రైతుల విషయంతో కూడా ప్రభుత్వం రాజకీయం చేసి అసలైన వారికి ఇవ్వలేదన్నారు.
తెలుగంగ కాలువల ద్వారా
21వేల ఎకరాలకు సాగునీరు
డివిజన్ స్థాయిలో ఉన్న తెలుగంగ కాలువలను పూర్తిచేసి రైతులకు సాగునీరందించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పరసారత్నం అన్నారు. కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయిన ఇవన్ని త్వరితగతిన పూర్తయితే సూళ్లూరుపేట నియోజకవర్గానికి 21వేల ఎకరాలకు సాగునీరందించవచ్చునన్నారు. అన్ని చెరువులకు గంగనీటిని అనుసంధానం చేస్తే అన్ని ప్రాంతాల నీళ్లు పుష్కలంగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా కిరణ్ సర్కార్ పనిచేస్తుందన్నారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన వ్యవసాయశాఖ అనుబంధ స్టాల్స్‌ను జెసి లక్ష్మీకాంతంతో కలసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడి సుబ్బారావు, సబ్ కలెక్టర్ నివాస్, ఎడి ఎ మారుతీదేవి, చెంగాళమ్మ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.
చెంగాళమ్మ బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

సూళ్లూరుపేట, మే 16: చెంగాళమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ నెల 30నుంచి 10రోజుల పాటు చెంగాళమ్మ తిరునాళ్లు వైభవంగా జరగనున్నాయి. దీనిక సంబంధించిన ఏర్పాట్లో ఆలయ పాలకవర్గం తలమునకలై ఉన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వాకాటి మాట్లాడుతూ పార్టీలు,మతాలకు అతీతంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నడంతో జిల్లా ఎస్పీతో భద్రతపై కూడా చర్చించామన్నారు. తిరునాళ్ల సందర్భంగా హోలిక్రాస్ జాతీయ రహదారి నుండి ఆలయం వరకు ఆర్చీలు కట్టి విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి,పాలకమండలి సభ్యులు అయితా శ్రీ్ధర్,యాదగిరిరెడ్డి, ఈవో శ్రీనివాసులరెడ్డి,కాంగ్రెస్ నాయకులు దేవారెడ్డి సుధాకర్ రెడ్డి,జెట్టి వేణుయాదవ్,చిలకా యుగంధర్ పాల్గొన్నారు.
ప్రతిభ గల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ సీటు

బిట్రగుంట, మే 16: ప్రతిభగల విద్యార్థులకు రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజీనిరింగ్ కళాశాలలో ఉచితంగా ఇంజనీరింగ్ సీటు ఇస్తున్నట్లు కళాశాల వ్యవస్థాపకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు. గురువారం కళాశాల ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తమ కళాశాల ఏర్పడి ఐదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. కళాశాల నుండి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వెళ్లి బ్యాచ్ 74 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. యునివర్శిటీ గోల్డు మెడల్‌ను తమ కళాశాల విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న దక్కించుకొందన్నారు. రెండవ బ్యాచ్ ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ సంవత్సరం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభిస్తున్నమని తెలిపారు. ఇంటర్‌మీడియట్‌లో 950 మార్కులు పైన వచ్చిన వారికి ఫీజు లేకుండా సీటు హస్టల్ వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 900 మార్కులు వచ్చిన వారికి కళాశాల బస్ ఉచితమని చెప్పారు. విద్యార్థులు విద్యతో బాటు క్రీడాలలో రాణించేందుకు అన్ని కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థినీ, విద్యార్థులకు విడిగా జిమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ ఎడాది నుండి ఎల్‌కేజి నుండి 5వరకు ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభించినట్లు తెలిపారు. అడ్మిషన్‌లు జరుగుతున్నాట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని పేద,మధ్య తరగతి వారు సద్వినియోగం చేసుకొవాలని కోరారు. ఆయన తోపాటు కళాశాల డైరక్టర్ రాజారెడ్డి, ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు, ఇంటర్ననేషనల్ పాఠశాల ప్రధానోపాధ్యారాలు జ్యోతి పాల్గొన్నారు.
-

థొంగతనాలను నివారించేందుకు ప్రజలు సహకరించాలి
అవగాహన సదస్సులో డిఎస్పీ వెంకటనాధరెడ్డి
నెల్లూరు, మే 16: వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని నగర డిఎస్పీ పి వెంకటనాధరెడ్డి సూచించారు. గురువారం స్థానిక వేదాయపాళెం సమీపంలో ఉన్న త్యాగరాజు గుడి వద్ద 5వ నగర సిఐ ఎస్‌వి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసదస్సులో నగర డిఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇటీవల దొంగలు వివిధ రూపాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బంగారు ఆభరణాలతోపాటు నగదు తీసుకువెళ్ళేటప్పుడు షేర్ ఆటోలలో వెళ్ళకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఒక వేళ షేర్ ఆటోలు, సిటీ బస్సులలో వెళ్ళేటప్పుడు తమ వద్దవున్న సొత్తును జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి బయట ఊళ్లకు వెళ్ళే సమయంలో సంబంధిత పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించాలని తద్వారా తమ క్రైమ్ సిబ్బందిచే పగలు, రాత్రి గస్తీలను ముమ్మరం చేస్తామని తెలిపారు. అదే విధంగా అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండేవారు ఏర్పాటు చేసుకున్న వాచ్‌మెన్‌కు అదనపు పనులు చెప్పకుండా బయటి వ్యక్తులు ఎవరెవరు వస్తున్నారో చూడాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే ఇటీవల స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయని, మహిళలు ఒంటరిగా రోడ్డుపై నడుచుకు వెళ్ళే సమయాల్లో బంగారు ఆభరణాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సిఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరాజు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

పెంచలకోన హుండీ రాబడి రూ.14.95 లక్షలు
రాపూరు, మే 16: జిల్లాలోని ప్రముఖ ఆలయమైన పెంచలకోన దేవస్థానంలోని స్వామి, అమ్మ, ఆంజనేయస్వామివార్ల మూడు ఆలయాల్లో ఉన్న హుండీలను గురువారం లెక్కించారు. ఈహుండీ లెక్కింపులో మూడు నెలలో వ్యవధిలో భక్తులు సమర్పించిన నగదు 14 లక్షల 95 వేల 675 రూపాయలు ఉన్నట్టు ఆలయ సహాయ కమిషనర్ దివి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు లెక్కించిన లెక్కింపులో ఈనగదుతోపాటు కొంత మేర బంగారం, వెండి ఉన్నప్పటికీ, వాటిని మరల హుండీలోనే వేయటం జరిగిందని చెప్పారు. ఈలెక్కింపులో దేవదాయశాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ శైలేంద్రబాబు, సిబ్బంది వెంకారెడ్డి, శ్రీ్ధర్‌నాయుడు, లక్ష్మినారాయణ, పెంచలరెడ్డి, రాధయ్యలతోపాటు మరికొందరు సిబ్బంది పాల్గొన్నారు.

వరిణి చెరువులో ఆక్రమణలు తొలగింపు
విడవలూరు, మే 16: మండలంలోని వరిణి చెరువులో ఆక్రమణలను నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో గురువారం రైతులు తొలగించారు. గ్రామంలో 558 ఎకరాల విస్తీర్ణం గల చెరువులో 200 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఇటీవల 56 ఎకరాలను కొంతమంది ఆక్రమించి సాగుచేస్తున్నారు. చెరువుల ఆక్రమణల వలన దిగువనున్న నాలుగు గ్రామాలలోని 2వేల ఎకరాల్లో నీరు అందడంలేదు. రామతీర్థం, వరిణి, దండిగుంట, రామచంద్రాపురం గ్రామాలలోని పొలాలకు వరిణి చెరువు నుంచి నీరు అందాల్సివుండగా ఆక్రమణల వలన నీరందక పంటలు పండటం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడవలూరు నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గౌస్‌బాషా జెసిబిని ద్వారా వరిణి చెరువు కలుజు సమీపంలో ఆక్రమించి కట్టలు వేసిన పొలాల గట్లలను తొలగింపచేశారు. నీటి వినియోగదారుల సంఘం మాజీ అధ్యక్షులు కావలి వెంకటేశ్వర్లు, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు మల్లికార్జున, ఆర్‌ఐ రాజేష్, విఆర్‌ఓ సుబ్బయ్య పాల్గొన్నారు.

‘వేసవిలో ఆరోగ్య సూత్రాలు పాటించాలి’
కావలి రూరల్, మే 16: వేసవి తీవ్రతను దృష్టిలోవుంచుకొని ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన అవసరం వుందని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ నాగమణి కోరారు. గురువారం స్థానిక 8వ వార్డు వెంకయ్యగారి మున్సిపల్ హైస్కూలు ఆవరణంలో ఐసిడిఎస్ లోక్‌సత్తా ఆధ్వర్యంలో వేసవి తీవ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా వుండటంతో చిన్నారులు వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడదెబ్బబారిన పడకుండా మంచినీరు అధికంగా తీసుకోవడంతోపాటు పండ్లు, కూరగాయలు, పండ్లరసాలు, మజ్జిగ వంటి వాటిని తీసుకోవాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో వుంచాలని రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. లోక్‌సత్తా ఉద్యమ సంస్థకు చెందిన మాలకొండారెడ్డి మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, మెదడువాపు, చికిన్ గున్యా, డెంగ్యూ, బోదకాలు, తదితర వ్యాధుల బారిన పడకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భిణులు రక్తహీనత బారిన పడకుండా ఒక ఐరన్‌ప్లస్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వంద రోజులు వంద మాత్రలు గర్భసమయంలో వినియోగించుకోవాలని కోరారు.ప్రభుత్వ వైద్యశాలలోనే విధిగా కాన్పులు చేయించుకోవాలని కోరారు. పుట్టిన ప్రతి బిడ్డ జననాన్ని నమోదు చేయించుకోవాలని కోరారు. తల్లిబిడ్డ ఆరోగ్యాన్ని కాంక్షించి ప్రభుత్వం ఆకుటుంబానికి తగిన సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. ఈకార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సుభాషిణి, పార్వతి, నాగలక్ష్మి, సుబ్బమ్మ, విజయలక్ష్మి, చెంచులక్ష్మి, నాగలక్ష్మి, దేవమ్మ కృపమ్మ,జ్యోతి లక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలుపాల్గొన్నారు.

తాగునీటి సమస్యను తీర్చండి సారూ....
అల్లూరు, మే 16: మండలంలోని పురిణి పంచాయతీ సుబ్బనాయుడుతోపుగ్రామానికి చెందిన పలువురు ప్రజలు తాగునీటి సమస్య తీర్చండి సారూ అంటూ గురువారం డిప్యూటీ తహశీల్దార్ నరసయ్యను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో తాగునీటి కోసం తీవ్ర ఇక్కట్లు చెందుతున్నామని సమీపంలో వాటర్ ట్యాంక్ వున్నప్పటికి నీరు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతూ పొలాల వద్దకు వెళ్ళితాగునీరు తెచ్చుకొని జీవిస్తున్నామని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. డిటి మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

‘షర్మిల పాదయాత్ర చారిత్రాత్మకం’
కావలి, మే16: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేద ప్రజల బాధలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడమే సంచలనం కాగా రెండువేల కిలోమీటర్లు పూర్తిచేయడం చారిత్రాత్మకమని ఆపార్టీ పట్టణ నాయకులు తిరివీధి ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు వచ్చినా తన కుటుంబం అనేక బాధల్లో వున్న పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నెలకొల్పిన పార్టీ కోసం అడుగులో అడుగు వేస్తూ దేశంలోనే రికార్డుస్థాయిలో నడక సాగించిన షర్మిల ఉక్కుసంకల్పం గల మహిళగా చరిత్రపుటల్లో నిలిచిపోతారని అన్నారు. తండ్రికన్నా మిన్నగా సోదరుడి అంచనాలకు తగ్గట్టుగా రానున్నకాలంలో ఏర్పాటు కానున్న జగన్ ప్రభుత్వానికి తన అనుభవాలతో దిశానిర్ధేశం చేయగలరని ఆకాంక్షించారు. వైఎస్ పాదయాత్ర స్పూర్తిగా షర్మిల ముందుకు సాగుతుండగా రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో 220 అసెంబ్లీ, 40 పార్లమెంట్ స్థానాలు గెలవడం ఖాయమన్నారు. కావలి నియోజకవర్గంలోను తమనేత ప్రతాప్‌కుమార్ తిరుగులేని మెజార్టీతో విజయదుందుభి మోగించనున్నారని చెప్పారు.

మోటార్‌సైకిళ్ళ తనిఖీ
కావలి, మే 16: పట్టణంలో గత రెండునెలలుగా పల్సర్ బైక్‌పై వేగంగా వెళుతూ ఓ అగంతకుడు మహిళల మెడల్లో బంగారు గొలుసులను లాక్కొని పారిపోతుండగా పట్టణ సిఐ రాంబాబు దర్యాప్తులో భాగంగా గురువారం సాయంత్రం మోటార్‌సైకిళ్ళ తనిఖీని చేపట్టారు. 1వ పట్టణ హెడ్‌కానిస్టేబుల్ షఫీతో కలిసి కెయు బ్రిడ్జి సెంటర్‌లో సుమారు రెండుగంటల పాటు నలువైపుల నుంచి వచ్చే మోటార్‌సైకిళ్ళను నిలిపి పరిశీలించారు. వాహనాల అనుమతి పత్రాలతోపాటు లైసెన్స్‌లను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా వున్న సుమారు 45 పల్సర్ మోటార్‌సైకిళ్ళను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ వాహనదారులు ప్రభుత్వపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు.

‘గోవులను సంరక్షించకపోవడం అన్యాయం’
కావలి, మే 16: హైందవ ధర్మంలో విశిష్ట స్థానం గల గోవులను సాక్షాత్తు సింహాచల క్షేత్ర ఆలయ నిర్వాహకులు వాటి సంరక్షణను పట్టించుకోకపోవడం, ప్రాణాలు పోతున్నా మిన్నకుండటం అన్యాయమని ఘటనకు కారకులైన ప్రతిఒక్కరి గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ జాగృతి సంస్థ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేళారు. ఎస్‌ఆర్ పంతులు, విజయ్‌చంద్ర తదితరులు ఆ ఘటన అత్యంత దారుణమని కోట్ల రూపాయిల విలువ చేసే ఆస్తులగల క్షేత్రానికి సంబంధించిన గోసంపదను పరిరక్షించలేకపోవడం క్షమించరాని విషయమని చెప్పారు.

26 మంది ఉపాధ్యాయులు బదిలీ
కొండాపురం, మే 16: మండలంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ కౌన్సిలింగ్‌కు సంబంధించి 26మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళినట్లు ఎంఇఓ అబ్దుల్ రజాక్ తెలిపారు. ఆస్థానాల్లో తిరిగి 26మంది విధుల్లో చేరారని తెలిపారు. ఇదిలా వుండగా జంగాలిపల్లి ప్రాధమికోన్నతపాఠశాలలో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడంతో దానిని ప్రైమరిస్కూలుగా మార్చారని చెప్పారు. పదిమంది లోపు విద్యార్ధులు వున్న చల్లగిరిగిల, శెట్టిపాలెం, మారినేనివారిపాలెం, రేణమాల, మిట్టపాలెంలలోని ప్రాధమిక పాఠశాలలు మూతపడినట్లు ఆయన తెలిపారు.

వ్యవసాయ కార్యాలయంలో దొంగలు పడ్డారు
కావలి, మే 16: పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో రూరల్ పోలీస్‌స్టేషన్, సర్కిల్ కార్యాలయం వున్న సముదాయంలో గల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో దొంగలు హస్తలాఘవం చూపారు. కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి చెందిన ఏటిఎం కార్డుతోపాటు 16వేల రూపాయిలకు పైగా విలువ చేసే తైవాన్ స్ప్రేయర్, వ్యవసాయ సదస్సులు జరిగేటప్పుడు ఉపయోగించుకునే మైక్‌ను దొంగలెత్తుకెళ్ళారు. ఈఘటన జరిగి సుమారు 3 రోజులు అవుతుండగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఏటిఎం కార్డును అపహరించిన దొంగలు తెలివిగా పాస్‌వర్డ్‌ను తెలుసుకొని ఖాతాలో గల 15వేల రూపాయిల నగదును డ్రా చేసి దోచుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.. అటెండర్‌గా పనిచేస్తున్న అతను నెలనెల జీతం తీసుకునేందుకు మాత్రమే కార్డును ఉపయోగిస్తుండగా కార్యాలయంలోని ఒక టేబుల్ సొరుగులో దాచుకునేవాడు. అలాగే అదే కార్యాలయం కిందవైపుగల మరో గదిలో రైతులకు యంత్రలక్ష్మి, యంత్రీకరణ కింద మంజూరైన యంత్ర పరికరాలను భద్రపరిచేవారు. ఇందులోనే కీలకమైన ఫైళ్ళు, వివిధ ఎరువుల దుకాణాలకు సంబంధించిన చట్టపర విషయాలను పర్యవేక్షించి నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపే సమాచారం వుంటుంది.
వెలుగుచూసిందిలా
మూడు రోజుల క్రితం తన జీతాన్ని డ్రా చేసుకునేందుకు ఏటిఎం కార్డును చూసుకోగా అది లేకపోవడంతో హైరానాపడ్డ ఉద్యోగి వెంటనే బ్యాంక్ శాఖా కార్యాలయానికి వెళ్ళి వాకబు చేశారు. పరిశీలించిన బ్యాంక్ సిబ్బంది 15వేల రూపాయిలను రెండు విడతలుగా మూడు రోజుల క్రితం డ్రా చేసి వున్నట్లు ఖాతాలో నగదు ఏమీలేదని చెప్పగా హతాసులయ్యారు. చోరీ జరిగిందని గ్రహించి కార్యాలయంలో పరిశీలన చేయగా మిగిలిన రెండు వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. ఈవస్తువులతోపాటు కీలకమైన ఫైళ్ళు ఏవైనా పోయి వుంటాయేమోనని భావించి కార్యాలయ అధికారులు పరిశీలించడంలో నిమగ్నమయ్యారు. కాగా బాధితుడితోపాటు సంబంధిత శాఖ కార్యాలయ అధికారి 1వ పట్టణ పోలీసులకు పిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా ఈవిషయమై వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్‌ను సంప్రదించగా చోరీ జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కార్యాలయానికి రెండు పటిష్టమైన తాళాలుగల ఇనుప షట్టర్ వుండగా దానిని పగలగొట్టి తీసిన ఆదారాలు ఏమి లేవని, అయితే ఎలా పోయాయో అర్ధం కావడం లేదని చెప్పారు. ఏటి ఎం కార్డుకు సంబంధించి పాస్‌వర్డ్ అత్యంత సన్నిహితులైన వ్యక్తులర్ సైకిళ్ళ తనిఖీని చేపట్టారు. 1వ పట్టణ హెడ్‌కానిస్టేబుల్ షఫీతో కలిసి కెయు బ్రిడ్జి సెంటర్‌లో సుమారు రెండుగంటల పాటు నలువైపుల నుంచి వచ్చే మోటార్‌సైకిళ్ళను నిలిపి పరిశీలించారు. వాహనాల అనుమతి పత్రాలతోపాటు లైసెన్స్‌లను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా వున్న సుమారు 45పల్సర్ మోటార్‌సైకిళ్ళను స్వాధీనంచేసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ వాహనదారులు ప్రభుత్వ పరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. ఉల్లంఘిస్తే తొలుత జరిమానాలు విధించి మళ్ళీమళ్ళీ అలాగే వ్యవహరిస్తుంటే తీవ్ర చర్యలు వుంటాయని హెచ్చరించారు.

గూడూరులో 19న శ్రీరామ మహాయజ్ఞం
గూడూరు, మే 16: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 19న గూడూరులోని శ్రీ అళగనాధ స్వామి ఆలయంలో శ్రీరామ మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుందని విహెచ్‌పి సభ్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక కేశవ నిలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జపయజ్ఞ సమితి కన్వీనర్ మల్లెమాల మురళీ రెడ్డి మాట్లాడుతూ విశ్వమానవాళీ సుఖశాంతులను కాంక్షిస్తూ పూజ్య ధర్మాచార్యుల ఆదేశానుసారం అయోధ్యలోని రామజన్మభూమిలో భవ్య మందిర నిర్మాణాన్ని కాంక్షిస్తూ దేశ వ్యాప్తంగా నిర్వహించబడుతున్న శ్రీరామ జయరామ, జయజయరామ మహామంత్ర జప పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా గూడూరు ప్రాంతంలో జప సాధకులు 13 కోట్ల జపం పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ నెల 19న ఉదయం 9 గంటలకు గూడూరులోని అళగనాధ స్వామి దేవస్థానంలో ఆగమశాస్త్ర వేదపండితుల చేత గణపతి పూజ, నవగ్రహపూజ, కలశారాధన, హనుమత్ సమేత సీతాలక్ష్మణ శ్రీరామచంద్రుల పూజ, పంచహోమ గుండములతో శ్రీరామ మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహాయజ్ఞంలో హనుమత్ ఉపాసకులు, హనుమంతునిపై రీసెర్చ్ చేసిన అన్నదానంచిదానందశాస్ర్తీతో పాటు శ్రీ మార్కేండేయానంద, శ్రీ కృష్ణానంద, శ్రీ దయానంద, శ్రీ నిశ్చిలానంద, శ్రీ బ్రహ్మయ్యస్వామి, శ్రీ కృష్ణ చైతన్యానంద స్వామిజీలచే ఆశీర్వా ప్రవచనాలు ఉంటాయన్నారు. అలాగే రామసేవకులకు, రామసాధకులకు అభినందన ముఖ్య అతిధిచే ప్రవచనాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో విళ్లారి మదుసూధన్‌రావు , పయ్యావుల మురళీకృష్ణ, రుద్రరాజు కృష్ణంరాజు, కె రామసుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

గుర్తింపు కోల్పోతున్న సినీ ప్రముఖులు
వాకాడు, మే 16: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు గుర్తింపు కోల్పోతుండటం బాధాకరమని సినీ, టీవి ఆర్టిస్టు చిన్నా (జితేంద్ర) అన్నారు. గురువారం తన స్వగ్రామమైన వాకాడుకు వచ్చారు. ఆయన వివాహం చేసుకున్న వాకాడు గొల్లపాలెం గ్రామంలో ప్రతి ఏడాది జరిగే మహాలక్ష్మి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం సినీ పరిశ్రమ ఇబ్బందికర వాతావరణంలో ఉందని, ఏ ఒక్క నిర్మాత సంతోషంగా లేరన్నారు. ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో చిన్న నిర్మాతలు సినిమాలు నిర్మించే సాహసం చేయకలేక పోతున్నారన్నారు.

నేడు గొల్లపాలెంకు సినీ ప్రముఖుల రాక
వాకాడు, మే 16: మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గొల్లపాలెం గ్రామానికి శుక్రవారం పలువురు సినీ ప్రముఖులురానున్నారు. ఈ గ్రామంలో వెలసి వున్న శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి 9వ వార్షిక అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రాజశేఖర్, జీవిత, రాజివ్ కనకాల, సుమ, పూనం కౌర్, చిన్నలతో పాటు మ్యూజికల్ స్టేజి ప్రోగ్రాం ఇచ్చేందుకు సింగర్స్ దీపూ సాయి శిల్ప, రష్యన్ డ్యాన్సర్లు, రంగం డ్యాన్సు ట్రూపు వారిచే స్పెషల్ ఫైర్ ప్రోగ్రాం నిర్వహించడం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త, కాంగ్రెస్ నాయకుడు పాపారెడ్డి మనోజ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ అన్నదానం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు.

తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎసిబి అధికారుల నిఘా
చిల్లకూరు, మే 16: చిల్లకూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు ఎసిబి అదికారులు నిఘా ఉంచారు. మోమిడి ప్రాంతంలో పలు వ్యవసాయ భూములను పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించడానికి సంబంధించి విఆర్‌ఓ, ఆర్‌ఐ, డిటి, తహశీల్దార్ అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొన్నారని, మరికొంత నగదు గురువారం నాడు తెమ్మన్నారని ఫిర్యాదుదారులు ఎసిబి అదికారులకు సమాచారం అందివ్వగా వారు 7 మంది ఎసిబి అధికారులు మండల కార్యాలయ వెలుపల అధికారులపై వేటు వేసుకొనేందుకు కాపు కాచారు. చివరి క్షణంలో వారి ఆపరేషన్ విరమించుకొని వెళ్లారు. విషయం తెలుసుకొన్న రెవిన్యూ సిబ్బంది ఒక్కొక్కరు మండల తహశీల్దార్ కార్యాలయం నుండి వచ్చేశారు. ఫిర్యాదు దారులుకు ఎసిబి అధికారులు మరో రోజు వస్తామని వెళ్లారు. దీంతో మండల ప్రాంగణం చుట్టూ ఎసిబి అధికారుల నిఘా ఉందంటూ పలుమండల కార్యాలయాలకు సమాచారాన్ని అందచేశారు. దీంతో ఎసిబి అధికారుల నుండి తప్పించుకొన్నట్లయింది.

ఆత్మకూరుడివిజన్‌లోని ఏఎస్‌పేట, పొదలకూరు, మండల్లాలో బుధవారం
english title: 
gail winds

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles