ప్రేమను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని చిత్రాలు నిర్మించడం ఈ మధ్య టాలీవుడ్‌లో బాగా ఫ్యాషనైపోయింది. ఒకటి కాదు..రెండు కాదు ప్రేమ ప్రధాన వస్తువుగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న చిత్రాల సంఖ్య తక్కువేమీకాదు. తాజాగా ఈ వారం అలాంటి ప్రేమకథా చిత్రాలు రెండు ప్రేక్షకుల తీర్పును కోరుతూ వచ్చాయి. అవి ‘లవ్ సైకిల్’, ‘లవ్ టచ్’. ‘లవ్ సైకిల్’ చిత్రం విషయానికొస్తే శ్రీ, రేష్మా జంటగా కాళీ క్రియేషన్స్ పతాకంపై సపన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరీ నాసిరకంగా తయారై ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెడుతోంది. జయంత్, ధృత జంగా శ్రీచంద్ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ టచ్’ సైతం అదే బాటలో సాగింది. ఈ రెండు చిత్రాల పరిస్థితి ఈ విధంగా వుండగా, ఈ వారం వేణు, కమలినీ ముఖర్జీ నటించిన మరో చిత్రం ‘రామాచారి’ (వీడో పెద్ద గూఢచారి) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బోల్తాకొట్టింది. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. ప్రశాంత్ హీరోగా వచ్చిన మరో డబ్బింగ్ చిత్రం ‘రాజకోట రహస్యం’ కూడా పెద్ద ఫలితాన్నివ్వలేదు. పై నాలుగు చిత్రాలు ప్రదర్శిస్తున్న థియేటర్లు జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ ఇలా కుదేలవడం టాలీవుడ్‌కు పెద్ద బెంగపట్టుకుంది. ఇక గత వారం చిత్రం ‘తడాఖా’ సోసోగానే ముందుకు కదులుతోంది.
ప్రేమను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని చిత్రాలు నిర్మించడం
english title:
t
Date:
Friday, May 24, 2013