అనంతపురం, మే 27 : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో వివరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలోని రెవెన్యూభవన్‌లో బారులు తీరారు. ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లెకు చెందిన రైతు చిన్న వెంకటరాముడు తమకున్న పొలంలో మామిచెట్లు నాటానని, వాటికి నీరులేక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం బోరు మంజురు చేసి ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చాడు. హిందూపురం మండలం బాలంపల్లె పంచాయతీ సి.చెర్లోపల్లి లోని గత 20 సంవత్సరములుగా జీవిస్తున్నామని ఈ ప్రభుత్వ భూమిని తమకే ఇచ్చే విధంగా పట్టా మంజూరు చేయాలని, గోరంట్ల మండలం బూదిలి గ్రామానికి చెందిన శివమ్మ భర్త మరణించడాని తమకు న్యాయం చేసి ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చింది. నగరంలోని స్ధానిక కోవూరునగర్ నందు నివసిస్తున్న మాలిన్ బీ వితంతువు పెన్షను మంజూరు చేయాలని వినతిపత్రాన్ని సమర్పించింది. పుట్టపర్తి మండలం కోయిలగుంటపల్లిగ్రామానికి చెందిన గంగాద్రి అనే అతను కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ఇతని ఇంటిపై 11 కెవి విద్యుత్ వైర్లు రెండు లైన్లు ఉన్నందున అవి ప్రాణాంతకంగా మారాయని వాటిని తొలగించాలని వినతిపత్రం ఇచ్చాడు. ధర్మవరం మండలం కనుంపల్లికి చెందిన చిన్న కుళ్లాయప్ప, సూర్యనారాయణ అను రైతులు 2011 సంవత్సరంలోని పంట నష్టపరిహారం తనకు అందలేదని ఈ విషయమై తనకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. డిఆర్‌డిఎ ఐకెపిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టి, తమకు న్యాయం చేయాలని బొమ్మనహాళ్ మండలం 73 ఉడేగోళంకు చెందిన కోటేశ్వరరెడ్డి వినతి ద్వారా కోరారు. ప్రజావాణిలో డిఆర్‌ఓ సుదర్శనరెడ్డి, హౌసింగ్ పిడి ప్రసాద్, జడ్‌పి సిఈఓ సుబ్బారెడ్డి, డిఇఓ మధుసూదనరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి జనార్ధనరావు, పౌర సరఫరాల శాఖ మేనేజర్ వెంకటేశం, డిఆర్‌డిఓ అకౌంట్స్ ఆఫీసర్ పాల్గొన్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో
english title:
p
Date:
Tuesday, May 28, 2013