Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

2న ‘సాహసం’ ఆడియో

Image may be NSFW.
Clik here to view.

గోపీచంద్ కథానాయకుడిగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘సాహసం’. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో బి.వి.ఎన్.ఎస్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ- యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం చిత్రా ల కథానాయకుడు గోపీచంద్, ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం వంటి వైవిధ్యమైన చిత్రాలను రూపొందించిన చంద్రశేఖర్ యేలేటి కలయికలో ఈ చిత్రం తప్పక విజయవంతమవుతుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ చిత్రంలోని పాటలను 2న విడుదల చేయనున్నామని, సినిమాని పూర్తిచేసి జూన్ 14న విడుదల చేయనున్నామని, అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన ఈ చిత్రం రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని, ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా షూటింగ్ చేయని రేర్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశామని, గోపీచంద్‌కి తమ సంస్థ ద్వారా మరో సూపర్‌హిట్ చిత్రం రావడం ఖాయమని ఆయన తెలిపారు. తాప్సీ, శక్తికపూర్, అలీతోపాటుగా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్:సెల్వ, మాటలు:కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు:అనంత్ శ్రీరామ్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి.

గోపీచంద్ కథానాయకుడిగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>