హైదరాబాద్, మే 31: ఇప్పటికే అరకొర సిబ్బందితో అల్లాడిపోతున్న నగర పోలీసు శాఖలో శుక్రవారం ఒక్కరోజే 48 మంది అధికారులు పదవీ విరమణ పొందారు. వీరిలో అదనపు డిసిపి ఒకరు కాగా, ఇద్దరు ఎసిపిలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఒకరు సీనియర్ అసిస్టెంటు, అయిదుగురు ఎస్ఐలు, 18మంది ఎఎస్ఐలు, 14 మంది హెడ్కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లుండగా, మరొకరు ఎల్జిఇలున్నట్లు శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన సిబ్బందిని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అభినందించారు. వారికి రావల్సిన అన్ని ప్రయోజనాలను సకాలంలో అందించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందామని ఏ మాత్రం ఆధైర్యపడకుండా ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు.
ఇప్పటికే అరకొర సిబ్బందితో అల్లాడిపోతున్న నగర పోలీసు
english title:
retirement
Date:
Saturday, June 1, 2013