మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25: మహబూబ్‌నగర్ దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేషి నుండి రెండు రోజుల క్రితం ఫోన్ రావడంతో ఆమె తన అనుచరులతో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే ముఖ్యమంత్రితో భేటి అయిన విజయలక్ష్మి తనకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి విజయలక్ష్మికి టికెట్ ఇక కుదరదని తేల్చి చెప్పినట్లు విజయలక్ష్మి అనుచరులు ఇచ్చిన సమాచారం. దీంతో ఆమె నిరాశతో తిరిగి మహబూబ్‌నగర్‌కు విచ్చేశారు. కాగా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు ఆదివారం ప్రత్యేక సమావేశమై ఎన్నికల బరిలో ఉండాలా, లేక వేరే పార్టీలో చేరాలా అనే అంశంపై చర్చించుకోనున్నారు. దాదాపు పోటీలో ఉండాలని విజయలక్ష్మి భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి టికెట్ ఇస్తానని భావించిన విజయలక్ష్మి టికెట్ రాకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచరుల నిర్ణయం మేరకు నడుచుకోవాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మరోసారి కలిసినా టికెట్ ఇక రాదని భావించిన విజయలక్ష్మి నిరాశకు గురయ్యారు.
* టిక్కెట్ కుదరదని తేల్చిచెప్పిన సిఎం * నేడు అనుచరులతో విజయలక్ష్మి సమావేశం
english title:
a
Date:
Sunday, February 26, 2012