* తాజా కూరలు, గుడ్లు, ప్రొటీన్స్, పండ్లు, హెర్బల్ షాంపూలతో శిరోజాలు పుష్టిగా, అందంగా పెరుగుతాయని భ్రమపడతారు. కానీ, ఇవి కేశాలకు పోషక విలువలను మాత్రమే కలుగజేస్తాయి.
* నార్మల్ హెయిర్ గలవారు కోడిగుడ్డు సొనను బాగా గిలక్కొట్టి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చక్కని ఫలితం పొందవచ్చు.
* సూర్యరశ్మిలోని అతి నీల లోహిత కిరణాలవలన వెంట్రుకలు బిరుసుగా తయారవుతాయి. అందుచేత త్వరగా నెరిసిపోతాయ.
* ఆయిలీ హెయిర్ ఉన్న వారు ఆహారంలో నూనె, కొవ్వు పదార్థాలు తగ్గించాలి.
* డ్రై హెయిర్, నార్మల్ హెయిర్ గలవారికంటే ఆయిలీ హెయిర్ గలవారు తరచుగా తలస్నానం చేస్తుండాలి.
* శిరోజాల చివరలు కత్తిరిస్తే త్వరగా పెరుగుతాయనే అపోహ కొందరికి ఉంటుంది. కానీ, అది నిజం కాదు. కేశాల చివరలు కత్తిరించినట్లయితే, అవి పూర్తిగా చిట్లిపోకుండా మాత్రమే నివారించవచ్చు.
* జీడిగింజలను పగులగొట్టి నువ్వుల నూనెలో వేసి మరిగించి తలకు రాసుకుంటే శిరోజాలు క్రమంగా నల్లబడతాయి.
* పేనుకొరుకుడు ఉన్న చోట మందార పువ్వులతో చక్కగా మర్దనా చేసినట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు.
* తాజా కూరలు, గుడ్లు, ప్రొటీన్స్, పండ్లు
english title:
idia
Date:
Thursday, June 13, 2013