ప్రపంచ వ్యాప్తంగా జనజీవన విధానంలో టెలివిజన్ అనూహ్య మార్పును తీసుకొచ్చింది. దీని వ్యతిరేక ప్రభావం పిల్లలపై పడకుండా తప్పించడం ఎలా?-అనేది తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సి ఉంది. టీవీలోని దృశ్యాలకు ప్రభావితమై కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు వార్తాపత్రికల్లో చూస్తున్నాం. చాలా ఇళ్ళల్లో ఉదయం నుంచి టివి ఆన్‌లోనే ఉంటుందంటే దానికి అన్ని వయసుల వారూ ఎంతగా బా నిస లవుతున్నారో తేటతెల్లమవుతుంది. స్పైడర్‌మాన్ సాహస కృత్యాలను టీవీలో చూసి అనుకరించే ప్రయత్నంలో పిల్లలు గాయపడిన సందర్భాలు న్నాయి. వాణిజ్య ప్రకటనలు, కార్టూన్ షోలు, సినిమాలు, ఫ్యాషన్ షోలు వీటన్నింటికి పిల్లలు అలవాటు పడిపోతున్నారు. ఆడుకోవడం, చదువుకోవడం, అల్లరి చేయడం వంటి పనులను మరచిపోయ చిన్నారులు టీవీ సెట్లకు అతు క్కుపోతున్నారు. అనారోగ్యమైన ఆహార పదార్థాలకు ఎంతో ఆకర్షణీయంగా అమ్మాయిలు, అబ్బాయిల చేత అందమైన ప్రకటనలు ఇప్పిస్తూ ఉంటారు. కోలాలు, చాక్లెట్లు, స్వీట్స్, న్యూడిల్స్, స్నాక్స్, ఫాస్ట్ఫుడ్స్ తింటూ పిల్లలు బాగా ఆడుకుంటున్నట్లు చూపిస్తారు. ఇదిచూసిన పిల్లలు వాటిని తిని తాము కూడా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటామనుకుని భావిస్తారు. అనవసరపు తిళ్ళు తిని పిల్లలు స్థూలకాయుల్లా తయారవుతూ ఉంటారు. టివిలో చూపే ఆకర్షణీయమైన మోడల్సు, వీడియో గేమ్స్, బొమ్మలు, సబ్బులు, షాంపులు, వాషింగ్ పౌడర్లు, కార్లు, మొబైల్స్ కొనాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తారు. వారు కొనకపోతే తమను నిర్లక్ష్యం చేశారని బాధపడుతూ ఉంటారు. నిజ జీవితంలోకన్నా టివీలో కన్పించే మనుషులు చాలా ఆకర్షణీయంగా కన్పిస్తారు. అనుక్షణం టీవీల్లో ప్రసారమయ్యే అందాల పోటీలు, ఫ్యాషన్ షోల వంటివి చూసిన టీనేజ్ పిల్లలకు భౌతికపరమైన ఆకర్షణ చాలా ముఖ్యమైనదని భావిస్తూ ఉంటారు. మంచి వ్యక్తిత్వం అభివృద్ధిపరచుకోవాలనే ఆలోచనను పక్కనబెట్టి శరీర బరువును తగ్గించుకుని నాజూగ్గా ఉండేందుకు డైటింగ్ చేయడం, మొటిమలు పోయేందుకు క్రీమ్స్‌వాడడంపై దృష్టి నిలుపుతారు.
హింస, నేరప్రవృత్తి..
రక్తం కారే సన్నివేశాలు, ప్రతినాయకుడిని కొట్టడం వంటి హింసాత్మక దృశ్యాలు, అత్యాచారానికి గురైన మహిళలను పదేపదే టీవీలో చూపించడం వల్ల పిల్లలు సాధారణ విషయాలు గానే ఫీలవుతున్నారు. దీనివల్ల క్రమంగా హింస, నేర ప్రవృత్తి ప్రమాదకరం, తప్పు అనే భావం వారిలో దూరం అవుతుంది. పిల్లలు టివిలకు అతుక్కుపోయి ఆటలు, చదువులకు దూరం కావడంవల్ల వారి మెదడు ఎదుగుదలలో 20 నుండి 30 శాతం తగ్గుతున్నట్లు పరిశోధనలలో వెల్లడయ్యింది. టివి చూడడం వల్ల అనేక ప్రేరణలకు పిల్లలు దూరమవుతున్నారు. కళ్లకు మాత్రమే పని ఉంటోంది. ఇతరుల మాటలు వినడం కూడా మరచిపోతున్నారు. దీనివల్ల వారి కంటిలోని కండరాలు కూడా తగిన కదలికలు లేకపోవడంవల్ల అవి లేజీగా తయారవుతున్నాయి.
తల్లిదండ్రుల బాధ్యత..
పిల్లలను టివి చూడకుండా చేయడమనేది అసంభవం. వారిపై వ్యతిరేక ప్రభావం పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు పడుకునే గదిలో టెలివిజన్ వుంచకూడదు. దానిని పిల్లల అదుపులో పెట్టకూడదు. పిల్లలకు విడిగా టివిని సమకూర్చడం స్టేటస్‌గా భావించకూడదు.
మనుమల పుట్టిన రోజు బహుమతిగా నాయనమ్మలు లేదా అమ్మమ్మలు వారికి టివిని బహుమతిగా ఇవ్వకూడదు. పిల్లలు గదిలో కూర్చుని టివి చూడడానికి అలవాటుపడితే పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో, ఏ చానల్స్ చూస్తున్నారో తల్లికి కూడా తెలియని స్థితి వస్తుంది. వేలాది మాటలు కలుగజేయలేని ప్రేరణ ఒక దృశ్యం కలుగజేయగల్గుతుంది. పిల్లలు యదార్థానికి, కృత్రిమంగా చూపిస్తున్నదానికి మధ్యగల తేడాను గుర్తించలేరు. సాధారణంగా పిల్లల్ని కొత్తవారితో మాట్లాడనియ్యరు. టివి చూడటంవల్ల కొత్తవారు వారి మెదళ్లలో ప్రవేశిస్తున్నారని గుర్తుంచుకోవాలి. యుద్ధాలు వంటివి నిజంగా చెయ్యరని కొన్ని ట్రిక్స్‌తో వాటిని కెమెరాలలో బంధించి టివిలో చూపిస్తారని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. టివిలో కన్పించే సన్నివేశాలు నిజం కాదని కేవలం వినోదం కోసం అతి చేసి చూపిస్తారని పిల్లలకు తెలియజెప్పాలి. దృశ్యాలను విశే్లషణ చేస్తూ పిల్లలకు నైతిక విలువలు గురించి చెపుతూ ఉండాలి. పిల్లల భావాలను తెలుసుకుంటూ స్నేహపూరిత వాతావరణంలో వారిని విద్యావంతుల్ని చేయాలి. ఉత్పత్తిదారులు తమ సరకులను అమ్ముకునేందుకు వేసే ఎత్తుగడలే ప్రకటనల వెనుక నిజాలని పిల్లలకు స్పష్టం చెయ్యాలి. హింసాదృశ్యాలు, అత్యాచార సంఘటనలు వంటివి చూడకూడదని, అవి వారి మనసును కలుషితం చేస్తాయని వారికి చెప్పాలి. పిల్లలు టివి చూసే సమయాన్ని విధిగా అదుపు చేయాలి. వారానికి చాలామంది పిల్లలు కనీసం 30 గంటలు టివి చూస్తున్నారని ఒక పరిశీలన. రోజులో గంట లేదా గంటన్నరకు మించి వారిని టివి చూసేందుకు అనుమతించకూడదు. టివి చూడడంతోబాటు స్నేహితులతో ఆడుకోవడం, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటి కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రపంచ వ్యాప్తంగా జనజీవన విధానంలో టెలివిజన్ అనూహ్య మార్పును తీసుకొచ్చింది.
english title:
a
Date:
Thursday, June 13, 2013