అత్యాచారాలు, లైంగిక వేధింపులు నానాటికీ పెచ్చుమీరుతున్నాయంటే అందుకు మహిళల వస్తధ్రారణ, వారి ప్రవర్తన తీరుతెన్నులే కారణమంటూ సెలవిచ్చే నేతలకు మన దేశంలో లోటు లేదు. యువతులు జీన్స్ ధరించరాదని, సెల్‌ఫోన్లు వాడరాదని ఇప్పటికే ఉత్తరాదిలోని కొన్ని గ్రామాల్లో కులపెద్దలు ‘ఖాప్ పంచాయతీ’ల పేరిట ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రఘునందన్ శర్మ (బిజెపి) మరో అడుగు ముందుకేసి మహిళలకు ఓ ఉచిత సలహా పారేశారు. మహిళలపై లైంగిక నేరాలు తగ్గాలంటే వివాహం జరిగే వరకూ యువతులు మొబైల్ ఫోన్లు వాడకపోవడమే మేలని ఆయన హితవు పలికారు. ఏ వయసు మహిళలలైనా జీన్స్ ధరించకపోవడం మంచిదని ఆయన ఇటీవల జరిగిన ఓ కుల సంఘం సమావేశంలో సూచించారు. నేడు విద్యార్థులు ముఖ్యంగా అమ్మాయిలు విశృంఖలంగా సెల్‌ఫోన్లు వాడడం వల్లే అనర్థాలన్నీ జరుగుతున్నాయని ఆయన తేల్చి చెప్పారు. అమెరికాలో కౌబాయ్స్ మాత్రమే జీన్స్ ధరిస్తారని, వాటికి మన దేశ సంస్కృతితో ఎలాంటి సంబంధం లేదన్నారు. మహిళల శ్రేయస్సు కోసం చేసిన ఈ సూచనలన్నీ కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలేనని శర్మ స్పష్టం చేశారు.
*
అత్యాచారాలు, లైంగిక వేధింపులు నానాటికీ పెచ్చుమీరుతున్నాయంటే
english title:
m
Date:
Thursday, June 13, 2013