నాకు సంస్కృతం వచ్చినందువల్ల, ఈ సంస్కృత వాక్యం ఉదహరిస్తున్నా ననుకోవద్దు; నాకు సంస్కృతం రాదు. కానీ ప్రమాణ వాక్యం తెలియజేయడానికి చెప్తున్నాను. శ్రీరాముడ్ని, అయోధ్యాధీశుడు కాకుండా కైక అడ్డం పడిందని లక్ష్మణుడు ఆగ్రహావేశంతో మాట్లాడినప్పుడు శ్రీరాముడిలా అన్నాడు: ‘అసంకల్పితమేవే హయ దకస్మాత్ ప్రవర్తతే/ వివర్త్యారంభ మారబ్ధం నను దైవస్య కర్మతత్’ అనుకున్న పని ఆగిపోయి అనుకోని విధంగా హఠాత్తుగా జరిగితే, అదే దైవం. ఇది గ్రహించకుండా ఆ పని ఎవరో చేశారని నిందించడం సరికాదు.
అంటే భారతీయులు దేవుడిగా పరిగణించి, కొలిచే శ్రీరామచంద్రుడు దైవానికి తల ఒగ్గడం తప్పనిసరి అని తీర్మానించాడు. బైరన్ కేటీ చెప్తున్నదంతా ఇంతే. జీవితం ఏది వడ్డిస్తే దానిని స్వీకరించి, శిరసావహించి, సావధానతతో అర్థం చేసుకుంటూ, నీ స్వేచ్ఛను నువు కనుగొనమంటున్నది.
నీ నిజ జీవితానికి కావలసినవన్నీ నీలోనే లభిసె్తై. నీవు దేనినైతే సతతమూ వెతుకుతున్నావో దానిని బాహ్యంలో వున్నదేదీ అందించదు అంటుంది కేటీ.
మనిషి మామూలుగా వొత్తిడి సహించలేడు. కానీ కేటీ ‘ప్రతి వొత్తిడి కలిగించే అనుభవం కూడా ఒక వరమనీ, అది నీ స్వేచ్ఛ నందుకోడానికి దారి చూపిస్తున్నదని గ్రహించమంటుంది. ‘ఈ సత్యం గ్రహిస్తే, జీవితం నీ యెడల ఎంతో దయతో ప్రవర్తిస్తున్నదని తెలుసుకుంటావ్’ అంటే ఆ వొత్తిడిని సరియైన విచారణకు గురిచేస్తే, నీ స్వేచ్ఛ వెలికి వస్తుంది.
అలానే, ఇతర్లు నిన్ను చేసే విమర్శ ఓ కానుకగా పరిగణించు, అంటుంది కేటీ. ఎవరైనా విమర్శించగానే బాధపడడం, నిన్ను నువ్వు సమర్థించుకోచూడడం అనే దానికి అర్థం ఏమిటంటే, నీలో ఏదో ఒక భాగాన్ని నువు సమ్మతించడం లేదు, నిన్ను నువ్వు ప్రేమించుకోలేకుండా ఉన్నావు అనుకోవాలి. నీలోని ఈ భాగాన్ని నువు దాచి ఉంచాలనుకుంటున్నావు. నిన్ను ఇతర్లు ప్రేమించాలని, నిన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నావు కానీ, ఆ భాగం విషయంగా మాత్రం కాదు’ అని తేలుస్తుంది కేటీ. ఆ భాగం లోపభూయిష్టంగా ఉంటే దానిని సరిదిద్దుకోడానికి ప్రయత్నించాలి గానీ, దానిని దాచి, సమర్థించుకోరాదు. ఆ విధంగా దానిని వెలికి తెచ్చినందుకు నీ విమర్శకుణ్ణి అభినందించవలసి ఉంటుంది; నీవతడికి రుణపడి వున్నావు.
స్వస్వరూప దర్శనమయ్యేంతవరకూ కేటీ మనల్ని వదిలిపెట్టదు. ఈలోగా ‘నేను’ అని మనమనుకునే ఈ మిథ్యా వస్తువును తుత్తునియలు చేసి అవతల పారేయడంలో ఆమె ప్రజ్ఞ అంతా ఇంతా కాదు. మృదువుగా చెప్పినవారున్నారు, కఠినంగా చెప్పినవారున్నారు. దాని యెడల మరణించ నేర్చుకోమని అన్నవారున్నారు. కానీ దానిని ముక్కలు ముక్కలుగా కత్తిరించి కాకులకూ గద్దలకూ వేస్తుంది కేటీ.
ఇది జరిగినప్పుడు జీవితంలో గొప్ప నమ్రత ప్రవేశిస్తుంది. ఈ నమ్రత అనేది దాసోహ’మనే వైఖరికి పూర్తిగా భిన్నమైనది. నమ్రత నిన్ను నీ శక్తిలో నిలుప నారంభిస్తుంది’ అంటుంది కేటీ.
‘బాధ అనే భ్రమను దాటి, ‘చూడగలిగిన’ శక్తి కలిగుండడమే మనిషికి మహావరం.’
ఏదైతే సంభవించిందో దాని వాస్తవమది. దానిని గురించి నీవు చేయగలిగిందేమీ లేదు. అదే నమ్రత అంటే. నాకా నమ్రత ఎంతో మధురంగా తోస్తుంది. రాజసగుణంతో కృషి చేయడం, ఫలితాలు సాధించడం, ఇవన్నీ చేయగలిగానని అనుకోడం కాసేపు సాధ్యమేననిపిస్తుంది. కానీ ఈలోగానే వాస్తవం మనల్ని అందుకుంటుంది.
నీ సామర్థ్యంతోబాటు నమ్రతను కూడా జత చేసుకొని బ్రతికావంటే, నీకెంతో మేలు జరుగుతుంది. అప్పుడు నువ్వు స్పష్టంగానూ, ఇతరులకు సహాయపడేట్లుగానూ ఉండగలవు’ అంటుంది కేటీ.
*
నాకు సంస్కృతం వచ్చినందువల్ల, ఈ సంస్కృత
english title:
neelamraju
Date:
Sunday, February 26, 2012