రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా విశ్వవిజన్ ఫిలిమ్స్ పతాకంపై గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘టాప్ ర్యాంకర్స్’ (జర్నీ బిట్వీన్ ఎల్‌కెజి టు ఎమ్‌సెట్). పసుపులేటి బ్రహ్మం నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ 75శాతం పూర్తయింది. నిర్మాత పసుపులేటి బ్రహ్మం మాట్లాడుతూ క్లైమాక్స్ రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ అంతా పూర్తయిందని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నామని తెలిపారు. ఈనెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి, జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. దర్శకుడు గోళ్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి విద్యావ్యవస్థలోని లోపాలను ప్రక్షాళన చేసి, పవర్‌ఫుల్ పాత్రలో ప్రిన్సిపాల్‌గా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారని, కథాకథనం ఆసక్తికరంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులంటే ర్యాంకులు సాధించే యంత్రాలు కాదు, వాళ్ల అభిరుచులు, ఇష్టాఇష్టాలను గ్రహించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది అని ఈ చిత్రం ద్వారా తాము చెబుతున్నామని, మార్కుల కంటే మనోవికాసం, వ్యక్తిత్వ వికాసం ముఖ్యమని ఈ చిత్రంలో ప్రధాన సందేశంగా ఉంటుందని ఆయన వివరించారు. శివాజీరాజా, గిరిబాబు, అశోక్‌కుమార్, కనుమూరి కృష్ణంరాజు, సోనీచరిష్ట, అశ్విని, జ్యోతిశ్రీ, పావని ఇంకా సెయింట్ మెరీస్ విద్యార్థులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: జయసూర్య, సంగీతం: సునీల్‌కాశ్యప్, కెమెరా: శంకర్ కంతేటి, ఎడిటింగ్: నాగిరెడ్డి వి, రచన, సహకారం: రాజేంద్రభరద్వాజ్, నిర్మాత: పసుపులేటి బ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గోళ్లపాటి నాగేశ్వరరావు.
రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా విశ్వవిజన్ ఫిలిమ్స్
english title:
top rankers
Date:
Sunday, June 16, 2013