అనురాగ్, కాజల్ యాదవ్ జంటగా విరించి అకాడమీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి ‘మనసా తుళ్ళిపడకే..’ అన్న పేరును ఖరారు చేశారు. ఎం.సుజి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకురాలు సుజి మాట్లాడుతూ గత మార్చిలో చిత్రాన్ని ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పాలకొల్లు, తుని, యానాం, హైదరాబాద్‌లలో పూర్తిచేశామని, పట్నంలో పెరిగిన అబ్బాయి పల్లెటూరి అమ్మాయిని ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను ఈ చిత్రంలో సరికొత్తగా చూపుతున్నామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ నెల చివరివారంలో ఆడియో విడుదల చేసి జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నళిని, చలపతిరావు, అన్నపూర్ణమ్మ, చిన్నా, కాదంబరి కిరణ్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:టి.పరంధామం, ఎడిటింగ్:వి.నాగిరెడ్డి, కథ, సంగీతం:పి.నరేష్, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎం.సుజి.
అనురాగ్, కాజల్ యాదవ్ జంటగా
english title:
manasaaa
Date:
Sunday, June 16, 2013