Clik here to view.

ప్రస్తుత రోజుల్లో నటి కెరీర్‌కు గ్లామర్ చాలా అవసరమన్న విషయాన్ని నటి సంధ్య (ప్రేమిస్తే ఫేం) కాస్త ఆలస్యంగానైనా తెలుసుకున్నట్టుంది. అందుకే ప్రస్తుతం చేస్తున్న తమిళ, మలయాళ చిత్రాల్లో హద్దుమీరే గ్లామర్‌ని ప్రదర్శించటానికి సిద్ధమయింది. ‘కాదల్’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ మలయాళీ భామ తొలి చిత్రంతోనే మంచి పేరుని తెచ్చుకుంది. ఆ చిత్రం కాసుల వర్షాన్ని కురిపించింది. దాంతో సంధ్యకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దాంతో మార్కెట్ డౌన్ అయింది. కొత్తగా అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకున్న ఈ అమ్మడు మాతృభాషపై దృష్టి సారించింది. అక్కడ నటించిన చిత్రాలు ప్రజాదరణ పొందడంతో మంచి పేరు లభించింది. చేతినిండా చిత్రాలున్నాయి. ప్రస్తుతం నాలుగు మలయాళ చిత్రాల్లో నటిస్తున్న సంధ్య ఆయా చిత్రాల్లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను కవ్వించనుందట.