రాజ్‌కుమార్ కథానాయకుడిగా నృత్య దర్శకురాలు తార దర్శకత్వంలో నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి పిక్చర్స్ పతాకంపై శ్రీమతి రమా రాజ్‌కుమార్ సమర్పణలో రూపొందిన చిత్రం ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర పనులు ముగింపుదశకు వచ్చాయి. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ చిత్ర విశేషాలు వివరిస్తూ- సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఈ బారిష్టర్ శంకర్ నారాయణ్ తెరకెక్కింది. ఇందులో నేను లాయర్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాను. వృత్తి జీవితంలో బారిష్టర్ శంకర్ నారాయణ్‌కు ఎదురైన సంఘటనలు, సమస్యలు, వాటి పర్యవసానం ఏమిటి, చివరకు ఏం జరిగిందన్న అంశానికి వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా సీనియర్ నృత్య దర్శకురాలు తార మాస్టర్‌ను దర్శకురాలిగా పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. బారిష్టర్ శంకర్ నారాయణ్ పాత్ర తీరుతెన్నులను తార మాస్టర్ తెరకెక్కించిన తీరు తెరపై చూడాల్సిందే. ఓ మంచి కథాచిత్రం ద్వారా ఆమె వెండితెరకు దర్శకురాలిగా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై ప్రథమార్థంలో ఆడియోను, అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. దర్శకురాలు తార మాట్లాడుతూ- దర్శకురాలిగా నాకు ఇది తొలి చిత్రం. ఇందులో నాయకా నాయికల పాత్రలు అభినయానికి ఎంతో అవకాశం ఉన్నవి. పాత్రల మధ్య భావోద్వేగాలు సన్నివేశాలను రక్తి కట్టిస్తాయి. నృత్యదర్శకురాలిగా నాకున్న పేరును ఈ చిత్రం దర్శకురాలిగా మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందన్న నమ్మకం నాకుంది. ఇందులో ఎం.ఎస్.నారాయణ, ఏ.వి.ఎస్, అనంత్, కిశోర్‌దాస్, హేమ, అపూర్వల పాత్రలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతాయి. అలాగే సాకేత్ సంగీతం ఆకట్టుకుంటుంది. కథానుగుణంగా సాగే వెంకట్ మాడభూషి సంభాషణలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తాయి. ఎస్.వి.శివారెడ్డి ఛాయాగ్రహ పనితనం ఈ చిత్రానికి ఓ ఎస్సెట్ అని తెలిపారు. అలంగ్రిత, అలియా త్రివేది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో లక్ష్మీ, హేమ, అపూర్వ, ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్, అనంత్, మహర్షి, కిశోర్‌దాస్, శ్రీరాం, శశాంక్, సింగం మహేష్, టంగుటూరి రామకృష్ణ, రవిదాస్, అంజన్‌బాబు, ప్రత్యేక పాత్రలో 20 సూత్రాల పథకం చైర్మన్ ఎన్.తులసీరెడ్డి నటించారు. ఈ చిత్రానికి మాటలు: వెంకట మాడభూషి, సంగీతం: సాకేత్, పాటలు: భువనచంద్ర, కెమెరా: ఎస్.వి.శివారెడ్డి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రామకృష్ణ, సమర్పణ: శ్రీమతి రమా రాజ్‌కుమార్, నిర్మాత: వి.వి.రాజ్‌కుమార్, కొరియోగ్రఫి, దర్శకత్వం: తార. (చిత్రం) రాజ్‌కుమార్, అలంగ్రిత
రాజ్‌కుమార్ కథానాయకుడిగా నృత్య దర్శకురాలు తార
english title:
barrister
Date:
Monday, June 17, 2013