సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రచనల సంకలనం ఇది. సమాజంలో వ్యక్తులకు, సమూహాలకు లింగ, వర్ణ, జాతి, మతం, ప్రాంతం తదితర పలు రకాల గుర్తింపులుంటాయి. ఇవేవీ ఉన్నప్పటికీ అన్నింటిలోకి కీలకమైనది వర్గమే. ఎందువల్లనంటే ఏ సమాజ వౌలిక స్వభావం అయినా అది ఏ ఉత్పత్తి విధానం మీద ఆధారపడింది అన్న విషయంపైనే నిర్ధారింపబడుతుంది. ఒక వ్యక్తి ఆ సమాజంలోని ఉత్పత్తి శక్తులతో ఎలాంటి సంబంధం ఉంది అన్న అంశంపై ఆ వ్యక్తి ఏ వర్గానికి చెందాడన్నది తెలుస్తుంది. సమాజం సమూలంగా మార్పు చెందడంలో వౌలిక పాత్ర వహించేది వర్గాలు, వర్గ పోరాటమే. రకరకాల అస్తిత్వ వాదాలు ప్రాచుర్యంలోకి వచ్చి, విచ్ఛిన్న వేర్పాటువాద ఉద్యమాలకు సైతం ఊతమిస్తున్న నేటి తరుణంలో వర్గ విశే్లషణ ప్రాధాన్యత ఎంతైనా ఉంది. దానికి ఈ పుస్తకం సముచితమైన రీతిలో ఉపయోగపడుతుంది.
దీనికి ఉపయోగపడే అంశాలను ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు పుస్తకాల నుండి సేకరించి పొందుపరిచారు. దీనిలో మొదటిగా 1980 నాటి సోవియట్ ప్రచురణ ‘వర్గాలు, వర్గ పోరాటం అంటే ఏమిటి?’ అనే దాని నుండి ప్రధానమైన కొన్ని అధ్యాయాలను తీసుకున్నారు.
*
వర్గాలు-వర్గ పోరాటం
సంకలనం
-కారల్ మార్క్స్
-పి.సుందరయ్య
ప్రజాశక్తి బుక్ హవుస్
ఎంహెచ్‌భ వన్, ప్లాట్ నెం.21/1, అజామాబాద్,
ఆర్‌టిసి కళ్యాణ మండపం దగ్గర,
హైదరాబాద్ - 20
040-27660013
సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి
english title:
parichayam
Date:
Saturday, June 22, 2013