ఏ శుభవేళ ఆచార్య ఎన్. గోపి ‘నానీ’ల ప్రక్రియ ప్రారంభించారో గానీ - ఈ కవితారూపం దినదినాభివృద్ధి చెందుతోంది. వందలాది కవులు వెలుగులోకి వచ్చారు. వస్తువైవిధ్యమూ విశేషమే. అటువంటి నానీ కవులలో పనసకర్ల ప్రకాశ్ ఒకరు. నగరీకరణ నలుదిక్కులా వ్యాపిస్తున్న రోజుల్లో ఈ కవి పల్లెవైపు కలాన్ని పయనింపజేశాడు.
‘‘పెళ్ళికొచ్చినవారు/ చెప్పారు
పిల్లకంటే/ పల్లె బాగుందని’’
అనటంలో పల్లె ప్రాభవం వెల్లడి అవుతుంది. నేటి రాజకీయాలపై మంచి చురక ఇది-
‘‘ఇంకా ఎన్నాళ్ళీ/
చిల్లర దొంగతనాలు?
ఇప్పుడైనా చేరండి/
రాజకీయాల్లో’’
ప్రకాశ్ లోక పరిశీలన ఉన్న కవి. ఆర్ద్ర హృదయం గల కవి కలంనుంచి వెలువడిన మరొక మంచి నానీ.....
నూతి చుట్టూ/ ఎప్పుడూ చెమ్మే
అమ్మకంటి పొరని/ అచ్చుగుద్దినట్టు’’
ఇటువంటి అనుభూతిని పంచే నానీలు చాలా ఉన్నాయి. అయితే ఈ కవి వీటితోనే సంతృప్తి చెందకుండా వచన కవితలు, దీర్ఘకవితలూ రాసి సత్తా నిరూపించుకోవాలి- ఆ స్థాయిగల కవికాబట్టి!
ఏ శుభవేళ ఆచార్య ఎన్. గోపి
english title:
andaayi..
Date:
Saturday, June 22, 2013