విశాఖపట్నం, జూన్ 24: రాష్ట్రంలో సుమారు 700 మోడల్ స్కూళ్లను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలియచేశారు. తొలిదశలో 300, రెండో దశలో 400 స్కూళ్ళను ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తొలి ఎపి మోడల్ స్కూల్‌ను విశాఖ జిల్లా కశింకోట మండలం తేగడ గ్రామంలో ఆయన సోమవారం ప్రారంభించారు. జిల్లాలో చీడికాడ, రావికమతం, మునగపాక, నర్సీపట్నంలలో కూడా ఇటువంటి మోడల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా తేగడ మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో మన విద్యార్థులు పోటీ తత్వాన్ని తట్టుకునేందుకు వీలుగా, ఈ మోడల్ స్కూళ్ళలో విద్యాబోధన ఉంటుందని అన్నారు.
పేద విద్యార్థులకు ఆంగ్ల విద్య అందుబాటులో లేకుండా పోతోందనే తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్ళను ప్రారంభిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని అన్నారు. గత నెలలో 3,200 మంది టీచర్లను, హెడ్మాస్టర్లను నియమించామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని యోధులతో పోటీ పడే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ బడి నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. మోడల్ స్కూళ్లు రాబోయే రోజుల్లో దేశానికే తలమానికంగా నిలుస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ అందించాలన్న ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్పొరేట్ స్కూళ్ళకే పరిమితమైన ఆంగ్ల విద్యను ఇప్పుడు పేద పిల్లలకు అందించాలన్న లక్ష్యంతో ఈ మోడల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని ఆయన తెలియచేశారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తెరిగి పనిచేయాలని ఆయన సూచించారు. ఈ స్కూల్‌లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులతోపాటు, ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. ఒక్కో స్కూల్‌ను 50 లక్షల రూపాయలతో నిర్మించారు. మంత్రులు రఘువీరారెడ్డి, బాలరాజు, గంటా శ్రీనివాసరావు, కోండ్రు మురళి, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, ముత్యాలపాప, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసుల నాయుడు, సూర్యనారాయణరాజు, డిసిసి అధ్యక్షుడు ధర్మశ్రీ, కలెక్టర్ శేషాద్రి పాల్గొన్నారు.
విశాఖ జిల్లా కశింకోట మండలం తేగడలో మోడల్ స్కూల్‌ను ప్రారంభిస్తున్న సిఎంకిరణ్
భారీగా చేరుతున్న వరద నీరు
చర్ల, జూన్ 24: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు తాలిపేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మండలంతోపాటు ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరు, పక్కనే ఉన్న జెర్రిపోతుల వాగు, లోటింత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు రెండు అదనపు గేట్ల నిర్మాణ పనులు జరుగుతుండటంతో భారీగా వస్తున్న వరద నీటి వల్ల ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గేట్ల నిర్మాణం కోసం వేసిన రింగ్‌బండ్‌ను దృష్టిలో ఉంచుకొని వరద నీటిని ఎప్పటికప్పుడు కిందికి వదిలేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 10వేలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదిలేస్తుంటే ఖరీఫ్‌కు సాగునీరు ఎలా విడుదల చేస్తారంటూ మరోవైపు సమీప రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో సుమారు 700 మోడల్ స్కూళ్లను నిర్మించనున్నట్టు
english title:
p
Date:
Tuesday, June 25, 2013