Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

స్థానిక ‘భారం’ ఇన్‌ఛార్జ్‌లే భరించాలి

$
0
0
విశాఖపట్నం, జూన్ 27: ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు విపక్ష తెలుగుదేశం పార్టీలో కదలికను తెస్తున్నాయి. మరో పక్షం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఉత్తరఖండ్ ఉపద్రవం నేపధ్యంలో కొంతమేర సమయం తీసుకున్నప్పటికీ త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ ఎన్నికలకు సన్నాహకంగా భావించే స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధ మవుతున్నాయి. ఈనేపధ్యంలో తొలుత పంచాయతీ, తర్వాత మండల, జిల్లా పరిషత్‌లకు జరిగే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే విజయావకాశాలను భేరీజు వేసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలవో జరిపిన పాదయాత్ర ఉపకరిస్తుందని అంచనావేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధినేత పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన రావడం, ఇదే సమయంలో అధికార కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కన్పించడం తెదేపా వర్గాలను సంతోషానికి గురిచేస్తోంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని భావించినప్పటికీ ఆపార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు తమకే లాభిస్తాయని తెదేపా అంచనావేస్తోంది. ఇదే సందర్భంలో కలసికట్టుగా పనిచేస్తే విజయం తధ్యమన్న భావన కన్పిస్తోంది. అయితే స్థానిక ఎన్నికల్లో రాజకీయంగా పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ పోటీచేసే అభ్యర్థుల ఆర్థిక అవసరాలను కొంతమేరైనా భరించాలని సీనియర్‌లు సూచిస్తున్నారు. ఇదే సందర్భంలో పార్టీ తరపున రానున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఆర్థిక భారాన్ని భరించాలని అధినేతకు మొరపెట్టుకుంటున్నారు. ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటే సాధారణ ఎన్నికల్లో అక్కరకు వస్తారని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకువచ్చేందుకు కొంతమంది పార్టీ ప్రతినిధులు ఇప్పటికే లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఇన్‌ఛార్జ్‌లుగా నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్న వారు ఎన్నికల సమయంలో సొంత నిధులు కొంతమేరైనా అభ్యర్థుల కోసం ఖర్చు చేయాలని లేనిపక్షంలో అధికార పార్టీని నిలువరించలేమన్నది వీరి భావన. ఇదిలా ఉండగా జిల్లాలో 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, గ్రామీణ ప్రాంతంలోనే తొమ్మిది నియోజకవర్గాలున్నాయి. గ్రామీణ విశాఖలో పాయకరావుపేట, అనకాపల్లి, పాడేరు, భీమునిపట్నం నియోజకవర్గాలకు ఇప్పటికీ ఇన్‌ఛార్జ్‌లు లేరు. వీటిలో కొన్ని నియోజకవర్గాలకు కమిటీలను నియమించారు. వీరిలో కూడా కొంతమేర సమన్వయం తక్కువగానే ఉంది. ఈ అంశాలన్నీ క్రోఢీకరిస్తూ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరఖండ్ విపత్తు, బాధితులకు సహాయం అందించే విషయంలో బిజీగా ఉన్న అధినేత చంద్రబాబు, ఇకమీదట స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టనున్నట్టు పార్టీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. నేడు సామూహిక అక్షరాభ్యాసాలు * కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాట్లు విశాఖపట్నం, జూన్ 27: శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి భ్రమరాంబ తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సంయుక్తంగా ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం చేయించేందుకు పేర్లను నమోదు చేసుకున్న వారు ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. అక్షరాభ్యాసానికి అవసరమయ్యే సామాగ్రి దేవస్థానం సమకూరుస్తుందని తెలిపారు. జిల్లాకో క్రీడా పాఠశాల * కేంద్రం యోచన విశాఖపట్నం, జూన్ 27: గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జిల్లాకో క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఏర్పాటయ్యే క్రీడా పాఠశాలకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తయ్యాయి. గ్రామీణ స్థాయి విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిగల వారిని గుర్తించడంతో పాటు వారు కోరుకునే క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కొంతమేర నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. వీటి నిర్వహణపై ప్రస్తుతం రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్రం 80 శాతం, రాష్ట్రప్రభుత్వం 20 శాతం నిధులను నిర్వహణ నిమిత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మరో ప్రతిపాదనలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వెచ్చించాలి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పైకా పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. ప్రతి ఏటా పైకా క్రీడల పోటీలను పాఠశాల, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నారు. అయితే క్రీడా పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణను ఇవ్వడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్థాయిలో రాణించే విధంగా వారిని ప్రోత్సహించడమే క్రీడా పాఠశాలల లక్ష్యం. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సారథ్యంలో క్రీడా పాఠశాల ఎంపిక జరుగుతుంది. ప్రతిపాదనలకు జిల్లా కలెక్టర్ ఆమోదముద్ర వేసిన తర్వాత పాఠశాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. విశాఖ జిల్లాకు సంబంధించి క్రీడా పాఠశాల ఏర్పాటు ఏర్పాటు విషయమంలో సమగ్ర పథక నివేదిక (డిపిఆర్)ను సిద్ధం చేయాల్సిందిగా విశాఖ జిల్లా కలెక్టర్ శేషాద్రి, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) విసిని కోరారు. పాఠశాల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసిన మీదట నివేదికను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విసి యువరాజ్ ఆంధ్రభూమి కి తెలిపారు. కాళ్లరిగిపోతున్నాయి * విడుదల కాని ఎమ్మెల్సీ ఎన్నికల నిధులు విశాఖపట్నం, జూన్ 27: ఎన్నికల తంతు పూర్తయి నెల్లు గడిచిపోయింది. గెలిచిన వారు ఎమ్మెల్సీలుగా అన్ని సదుపాయాలు అందుకుంటున్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించిన వారు, ఎన్నికలకు సంబంధించి వసతులు, సదుపాయాలు సమకూర్చిన వారు మాత్రం అలోలక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. ఈఏడాది ప్రారంభంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించారు. నోటిఫికేషన్ వెలువడిన దగ్గర్నుంచి ఎన్నికల తంతు పూర్తయ్యే వరకూ వసతి, రవాణా, భోజన సదుపాయం వంటి వాటితో పాటు ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి భత్యం చెల్లించాల్సి ఉంది. దాదాపు 25 లక్షల రూపాయల మేర ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చులు చెల్లింపులకు నోచుకోలేదు. ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి జీతభత్యాలతో పాటు ఎన్నికల విధులకు సంబంధించి ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లకు అద్దెలు, భోజనాలు సమకూర్చిన వారు ఇప్పటికీ చెల్లింపులకోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దీనికి సంబంధించి నిధులు విడులైనప్పటికీ ఖజానా నుంచి చెల్లింపులు మాత్రం జరగలేదు. నిధుల ఫ్రీజింగ్ వల్ల చెల్లింపులు జరగలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల చెల్లింపుల విషయంలో అధికారులు చేస్తున్న తాత్సారం ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. జగనన్న వస్తేనే బాధల నుండి విముక్తి పాదయాత్రలో షర్మిల రావికమతం, జూన్ 27: ఎడాపెడా పన్నుల బారంతో అప్పులు ఊబిల్లో కూరుకుపోయిన ఆడ పడుచులకు జగనన్న రాకతోనే రుణ విముక్తులవుతారని స్వర్గీయ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల భరోసా ఇచ్చారు. మరో ప్రజాప్రస్ధానంలో భాగంగా మండలంలో కొత్తకోటలో గురువారం రాత్రి ఆమె కిక్కిరిసిన జన సందోహం మధ్య ప్రసంగించారు. ఐదేళ్ళ వై. ఎస్. పాలనతో ఒక్క రూపాయి కూడా పన్నులు భారం పెంచని సి. ఎం.గా వై. ఎస్. చరిత్రకెక్కారన్నారు. ప్రస్తుత కిరణ్‌కుమార్ పాలనలో గ్యాస్ , విద్యుత్ , ఎరువులు, నిత్యావసర వస్తువులతో పాటు ఆర్టీసి ఛార్జీలు సైతం ఎడాపెడా పెంచారని ఆమె విమర్శించారు. దీంతో అన్ని వర్గాల వారు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చంద్రబాబు మద్దతుతో బయడి పడినందున మరో ఏడాది ఈ భారాలు ప్రజలు మోయక తప్పదని ఆమె తెలిపారు. వ్యవసాయం దండగన్న బాబుకు అధికారం ఇస్తే రైతులను పురుగుల్లా చూస్తారని జోస్యం చెప్పారు. ఫ్రస్తుత అస్తవ్యస్థ పాలనను గాడిలో పెడతానని గొప్పలు చెబుతున్న బాబు తన పాలనలో అన్ని వర్గాల వారిని విస్మరించారని, సంక్షేమ పధకాలు దండుగన్నారని గుర్తు చేసారు. మరో సారి బాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం అదోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన పక్షంలో వై. ఎస్. సంక్షేమ పధకాలు సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు ప్రాధమిక విద్య నుండి డిగ్రీ స్థాయి విద్య వరకు నెలనెలా 500 నుంచి రెండువేల వరకు ఉపకార వేతనాలను మంజూరు చేస్తారని భరోసా ఇచ్చారు. పన్నులు భారం ఇక ఉండదని ఆమె హామీ ఇచ్చారు. మత్సవానిపాలెంలో రాత్రి బస కొత్తకోట, దొండపూడి మీదుగా మత్స్యవానిపాలెం చేరుకున్న షర్మిల ఇక్కడ తూనిక కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన విడిదిలో బస చేసారు. కేంద్ర సర్వీసుకు కలెక్టర్ శేషాద్రి? విశాఖపట్నం, జూన్ 27: విశాఖ జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూకు గురువారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఇటీవల ఒకసారి వెళ్లాల్సి ఉన్నా, అది కాస్త వాయిదా పడింది. దీంతో మళ్ళీ ఇపుడు ఇంటర్వ్యూకు వెళ్ళే అవకాశం లభించింది. ఈ ఇంటర్వ్యూలో ఎంపిక అయితే కేంద్ర సేవల్లోకి ఈయన బదిలీ అవుతారు. కేంద్ర సేవల్లోకి వెళ్ళే అంశం గత ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉంది. మొదటి నుంచి దీనికి వెళ్ళేందుకు కలెక్టర్ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల ఈ ఇంటర్వ్యూలో పాల్గొని శనివారం ఆయన తిరిగి విశాఖపట్నం చేరుకుంటారు. ఈ విధంగా కలెక్టర్ ఇంటర్వ్యూకు హాజరుకావడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేంద్ర సేవలకు వెళ్ళిపోతే కొత్త కలెక్టర్ ఎవరనేది ప్రశ్నగా మారింది. ఏడాది కూడా పూర్తికాకుండానే ఇక్కడ నుంచి బదిలీ చేస్తారా అనే సందేహాలు రెవెన్యూ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. వచ్చిన కొద్దికాలంలోనే అనేక రకాలైన సంస్కరణలు తీసుకువచ్చిన కలెక్టర్ వి.శేషాద్రి జిల్లా ప్రజల మన్ననలు పొందగలిగారు. అన్నింటి కంటే ప్రధానంగా దాదాపు పది వేల ఎకరాల ప్రభుత్వ భూములను పరిరక్షించడం రెవెన్యూ చరిత్రలోనే ప్రథమం. ఎటువంటి సిఫారసులకు తలొగ్గకుండా ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా వ్యవహరించిన కలెక్టర్ వంద రోజుల కార్యక్రమం ద్వారా పలు రకాల సమస్యల పరిష్కారించగలిగారు. నిత్యం ఎదుర్కొనే భూ సమస్యలు, జిల్లాలో తాగునీరు, ఏజేన్సీ ప్రాంతాల్లో సీజనల్ రోగాలను అరికట్టడం, పెద్దాసుపత్రిలో వౌలిక వసతులు మెరుగు, అక్రమాలకు చెక్ పెట్టే విధంగా తరచూ ఆకస్మీక తనిఖీలు, దీని అభివృద్ధి కోట్లాది రూపాయల నిధులు సాధించడం, ప్రతి సోమ,మంగళవారాల్లో ప్రజావాణి, డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమాల ద్వారా అన్ని విభాగాల అధికారులతో సమీక్ష, ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ వంటివి చురుగ్గా నిర్వహిస్తున్న కలెక్టర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టగలిగారు. ఈ విధంగా పలు సంస్కరణలు తీసుకురాగలిగిన కలెక్టర్‌ను ప్రభుత్వం వదులుకోదనే వాదన రెవెన్యూ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏడాది పూర్తికాకుండానే బదిలీ చేస్తారా? అనే ఆలోచన వస్తోంది. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మరో అయిదు రోజులు పట్టే పరిస్థితులున్నాయి. ఇది విడుదలైతే కోడ్ వర్తిస్తున్నందున ఇక బదిలీ అయ్యే పరిస్థితి ఉండదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. విశాఖ జిల్లా నుంచి 211 మంది యాత్రికులు * ఇళ్ళకు చేరిన 150 మంది * పుణ్యక్షేత్రాల సందర్శనలో 45 మంది క్షేమం విశాఖపట్నం, జూన్ 27: విశాఖ జిల్లా నుంచి ఉత్తరాఖండ్‌లో ఛార్‌దామ్‌కు వెళ్ళిన యాత్రికులు 211మంది ఉన్నట్టు జిల్లా యంత్రాంగం తేల్చింది. ఇందులో గత వారం రోజుల్లో 150 మంది యాత్రికులు తిరిగి ఇళ్ళకు చేరుకోగలిగారు. మరో 45 మంది యాత్రికులు క్షేమంగానే ఉన్నట్టు ఇక్కడి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. వీరంతా ప్రస్తుతం మరికొన్ని పుణ్యక్షేత్రాల సందర్శనలో ఉన్నట్టు తెలిసింది. మిగిలిన 16 మందిలో విశాఖకు చెందిన ఆరుగురు మృతి చెందగా, మరో పది మంది తప్పిపోగా, వీరిలో నలుగురి ఆచూకీ లభించింది. ఛారదామ్ వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు లక్షన్నర వరకు ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని నిర్ణయించగా, ఇందులో దారిద్య్రరేఖకు దిగువనున్న (బిపిఎల్) కుటుంబాలకు అపద్భుందు పథకం కింద మరో 50 వేల రూపాయలు అందజేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలపై నష్టపరిహారం వర్తింపు చేసేందుకు సంబంధితాధికారులు చర్యలు చేపట్టారు. కాగా ఛార్‌దామ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల కుటుంబాలకు ఎప్పటికపుడు సమాచారం అందించేందుకుగాను కలెక్టరేట్‌లో హెల్ఫ్‌లైన్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం * మంత్రి గంటా శ్రీనివాసరావు నర్సీపట్నం,జూన్ 27: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పధకాలు ప్రతీ ఇంటికి చేరాలనేదే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్యేయమని రాష్ట్ర పెట్టుబడులు, వౌళిక వసతుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలోని మాకవరపాలెం, నర్సీపట్నం మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పధకాలకు శంకుస్ధాపనలు, భూమి పూజలు ,ప్రారంభోత్సవాలు చేసారు. బూరుగుపాలెంలో పి.హెచ్.సి భవనాలను ప్రారంభించిన మంత్రి బూరుగుపాలెం - తూటిపాల మధ్య జాజిగెడ్డ వంతెనపై కోటి 20 లక్షలతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి భూమి పూజ చేసారు. కోటి 98 లక్షలతో చేపట్టే లచ్చన్నపాలెం, కుసర్లపూడి రోడ్డు పనులకు శంకుస్ధాపన చేసారు. అనంతరం వేములపూడిలో 4.5 కోట్లతో నిర్మించిన కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా బూరుగుపాలెంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి గంటా మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తిస్తూ వాటిని తీర్చేందుకు ముఖ్యమంత్రి పలు సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ఆడ పిల్లల కోసం బంగారుతల్లి పధకాన్ని ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ఫ్లాన్, అమ్మహస్తం, ఇందిరమ్మ కలలు, పచ్చతోరణం వంటి పధకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. కుటుంబంలోని ప్రతీ వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారన్నారు. దీనిలో భాగంగానే వంతెన నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. ఇది చేతల ప్రభుత్వమని గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈకార్యక్రమాల్లో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, డి.సి.సి.బి. చైర్మెన్ సుకుమారవర్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్యామల, ఆర్డీవో వసంతరాయుడు, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బోళెం వెంకటరమణమూర్తి, పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రూ.21 కోట్లతో మన్యంలో ఫైలట్ ప్రాజెక్టు అటవీ కన్జర్వేటర్ భరత్‌కుమార్ వెల్లడి అరకులోయ, జూన్ 27: మన్యంలో 21 కోట్ల రూపాయల నిధులతో గ్రీన్ ఇండియా మిషన్ ఫైలట్ ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ సర్కిల్ అటవీశాఖ కన్జర్వేటర్ భరత్‌కుమార్ వెల్లడించారు. స్థానిక అటవీశాఖ అతిథిగృహంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాడేరు డివిజన్ పరిధిలోని 23 వన సంరక్షణ సమితుల్లో ఈ ప్రాజెక్టు కింద పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. గిరిజన ప్రాంతంలో అటవీ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్యచరణ ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. మన్యం వ్యాప్తంగా పచ్చదనం వెల్లువిరిసేలా తీర్చదిద్దడమే గ్రీన్ ఇండియా మిషన్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ ప్రాజెక్టు అమలులో స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములుగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతంలో ఎనిమిది కోట్ల రూపాయలతో రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన(ఆర్.కె.వి.వై.) ప్రాజెక్టు కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. సారవంతమైన భూసారాన్ని కాపాడేందుకు అరకులోయ, సీలేరు నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీనిధులతో పనులు చేపడతామన్నారు. మొదటి ఏడాది ఐదు కోట్లు, రెండవ సంవత్సరం మూడు కోట్ల రూపాయల వంతున వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మూడు పథకాల కింద నాలుగువేల ఎకరాల్లో ఎక్రోకార్పస్ మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిల్వర్‌ఓక్ స్థానంలో ఈ సరికొత్త మేలురకం మొక్కల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. పాడేరు డివిజన్‌లో పదిహేను వందల ఎకరాల్లో ఎక్రోకార్పస్ పెంచనున్నామన్నారు. ఇందుకు గానూ కాంఫ పథకం కింద 3.50 కోట్లు, 13వ ఫైనాల్స్ కింద ఒక కోటి, ఎఫ్.డి.ఎస్. కింద 50 లక్షలు చొప్పున ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఏకో టూనిజం కింద గిరిసీమ పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాధనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టు ఆయన చెప్పారు. సమావేశంలో పాడేరు డి.ఆఫ్.ఒ. శాంతారాం, సబ్ డి.ఎఫ్.ఒ. జానకిరావు, రేంజ్ అధికారి పి.గంగరాజు, సెక్షన్ ఫారెస్టర్లు పాల్గొన్నారు. విశాఖకు మెట్రో రైలు ఏర్పాటుకు కృషి * రాజ్యసభ సభ్యులు డాక్టర్ టిఎస్సార్ విశాఖపట్నం, జూన్ 27: విశాఖలో భీమిలి, అనకాపల్లి విలీనానికి ఆమోదం లభించిన నేపధ్యంలో మెట్రోరైలు వ్యవస్థ ఏర్పాటుకు మరింత కృషి చేయనున్నట్టు రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. విలీనంతో పట్టణాన్ని మరింత విస్తరించడానికి వీలుపడుతుందన్నారు. వౌలిక వసతుల కల్పనలో భాగంగా మెట్రోరైలు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 20 లక్షలకు పైగా నగర జనాభా ఉన్న పరిస్థితుల్లో విలీనం ద్వారా పెరిగిన జనాభాకనుగుణంగా రవాణా సౌకర్యాలు పెంచాల్సి ఉందన్నారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖలో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. పరిశ్రమల్లో రెండు లక్షలు మందికి పైగా పనిచేస్తున్న దృష్ట్యా మెట్రో రైలు సాధనకు తన వంతుగా పూర్తిస్థాయిలో కృషి చేస్తారని, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తక్షణమే తీసుకువెళ్తున్నామన్నారు. విశాఖలో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పటుకు సంబంధించి ఇప్పటికే తాను ఈ నెల 12వ తేదీన పట్టణాభివృద్ధి, వౌలిక సదుపాయాల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌కె లోహియాకు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. రైల్వేట్రాక్ మరమ్మతులతో రైళ్ళు రద్దు విశాఖపట్నం, జూన్ 27: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ పరిధిలో పలుచోట్ల రైల్వేట్రాక్‌కు సంబంధించి నిర్వహణ, మరమ్మతులు చేపడుతున్న కారణంగా వచ్చేనెల 6వ తేదీ నుంచి 22వరకు రెండు రైళ్ళను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ కమర్షియల్ విభాగం అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబల్‌పూర్-కోరాపుట్ (58301) మధ్య నడిచే రైలును, విశాఖ-రాయగడ-కోరాపుట్ మధ్య రైల్వే 58538, 58538నెంబర్ల రైలు ఈ తేదీల్లో రద్దుకానుంది. ఇవి కాకుండా విశాఖపట్నం-్భవనేశ్వర్ (18411) మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఖుర్ధా వరకే నడువనుంది. అక్కడి నుంచి తిరిగి బయలుదేరి విశాఖపట్నం వస్తుంది. ఆయా తేదీల్లో మార్పును గమనించి ప్రయాణికులు తమతో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర పరిణామాలు * సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసి విశాలాక్షినగర్, జూన్ 27: రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సమైక్యవాదులు చూస్తూ ఊరుకోరని సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు హెచ్చరించారు. గురువారం ఆంధ్రవిశ్వవిద్యాలయం గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ ముసుగులో రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. ప్రజాప్రతినిధులు రాష్ట్రం విడిపోకుండా సమైక్యంగా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 29న 14 విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 30న కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన జెఏసి రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్, వికలాంగుల జెఏసి సురేశ్‌మీనన్, కో-కన్వీనర్లు ఆనంద్,నరేష్ సంతోష్,సందీప్‌లు పాల్గొన్నారు. ఎయుకు రూ.5 కోట్లతో పరిశోధనా ప్రాజెక్టు * డిసెంబర్‌లో స్నాతకోత్సవం విశాలాక్షినగర్, జూన్ 27: ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఐదు కోట్లతో పరిశోధనా ప్రాజెక్టు మంజూరైంది. ఈ మేరకు ఉత్తర్వులు వచ్చినట్లు వర్శిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్‌ఎన్.రాజు తెలిపారు. గురువారం ఎయు సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేవంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిక్విన్ సహకారంతో వర్శిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇఎంఐ, ఇఎంసి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసినప్పుడు రూ.40 లక్షలతో పరిశోధనా కేంద్రం ప్రారంభమైందన్నారు. మూడేళ్ళ కాలపరిమితిలో ఐదుకోట్ల రూపాయల ప్రాజెక్టును నిర్వహిస్తామన్నారు. విసి రాజు పర్యవేక్షణలో ఎలక్ట్రోమేగ్నెటిక్ తరంగాలు, పరికరాలు తదితర అంశాల్లో పరిశోధనలు జరుగనున్నాయి. డిసెంబర్‌లో స్నాతకోత్సవం గత వారంలో వర్శిటీ విసి రాజు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసారు. దీనిపై విసి చర్చించారు. తేదీలు ఖరారు చేసి తెలుపాలని గవర్నర్ సూచించారు. దీనిపై సెనేట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సమీర్ పరిశోధన కేంద్రం రక్షణ సంబంధమైన రంగాలకు అవసరమైన పరిశోధనలు జరపడానికి మరో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వర్శిటీ విసి ఆచార్య రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సమీర్‌తో సంయుక్త పరిశోధనలు చేయనున్నారన్నారు. మరో పది కోట్ల రూపాయలతో పరిశోధనా కేంద్రాలు వర్శిటీలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఉద్యోగాల భర్తీకి కృషి వర్శిటీలో ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నట్లు ఎయు విసి రాజు తెలిపారు. బోధనా సిబ్బంది, వర్శిటీ ఆర్థిక పరిస్థ్థి, ఇతర అంశాలపై నగరానికి వచ్చిన సిఎం కిరణ్ వద్ద చర్చించినట్లు చెప్పారు. దీనికి సిఎం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి కొరియా వెళ్ళనున్నట్లు పేర్కొన్నారు. కొరియా దేశంలోని విద్యావిధానం తీరుతెన్నులపై రాజు అధ్యయనం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎయు రెక్టార్ ఆచార్య ఎవి.ప్రసాద్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య కట్టా రామ్మోహన్‌రావుతదితరులు పాల్గొన్నారు. సింహగిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమావేశం సింహాచలం, జూన్ 27: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో జూలై 21వ తేదీన సింహగిరి ప్రదక్షిణ, 22వ తేదీ ఆషాడపౌర్ణమి ఉత్సవ ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కె.రామచంద్రమోహన్ గురువారం విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసారు. ప్రతి ఏటా ఆషాడపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని చతుర్దశి రోజున వేలాది మంది భక్తులు సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యంపై అధికారులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు సింహాచలేశుని ధర్మప్రచార రథం ప్రదక్షిణకు బైలుదేరనుందని అధికారులు తెలిపారు. సింహగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి సుమారు 32 కిమీ పొడవునా సుమారు 25 స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్టాల్స్‌లో ప్రాథమిక వైద్య సదుపాయం, తాగునీరు, ప్రసాదాలు ఏర్పాటు చేసే అంశంపై అధికారులు చర్చించారు. 22వ తేదీ పౌర్ణమిరోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆలయ ప్రదక్షిణను అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయలేని భక్తులు ఆలయాలలో ప్రదక్షిణ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. 21వ తేదీ ఉదయం కాలినడకన ప్రదక్షిణ ప్రారంభించే భక్తులు రాత్రంతా ప్రదక్షిణ చేస్తూ సింహాచలం రానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘ్ఠనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు, 108 వాహన సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. జోడుగుళ్ళపాలెం బీచ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సమావేశంలో ఇఇ శ్రీనివాసరాజు, ఎఇఇలు ఎంవి.కృష్ణమాచాచార్యులు, రాఘవకుమార్, ఆర్‌వివిఎస్.ప్రసాద్, డిఇ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బడుల్లో మోగిన ఎన్నికల గంట * రేపు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు విశాఖపట్నం , జూన్ 27: సర్కారు పాఠశాలల్లో ఓట్ల గంట మోగనుంది. ఈ నెల 29న పాఠశాల యాజమాన్య కమిటీలకు చైర్మన్, వైస్‌చైర్మన్‌లను ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యాపక్షోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మరో నెల రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నెలాఖరులో జరుగబోయే బడి ఓట్లు ఆయా ప్రాంతాలలో వేడి వాతావరణాన్ని సృష్టించనున్నాయి. కాస్త రాజకీయ రుచి మరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఎన్నికలను ప్రతిష్ఠగా తీసుకోనున్నారు. ’ప్రజల చేతుల్లోకి పాఠశాల విద్య’ అన్న నినాదంతో సరిగ్గా 15 సంవత్సరాల అకితం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యాకమిటీల పేరుతో సర్కారు పాఠశాలలకు రాజకీయ రంగు పులిమారు. 1997లో మొట్టమొదటిసారిగా జరిగిన పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు అప్పట్లో పెద్దదుమారం లేపాయి. రహస్య ఓటింగ్ కాకుండా చేతులెత్తే విధానం పెట్టడంతో పల్లెల్లో గొడవలు కూడా జరిగాయి. విద్యార్థులు తల్లిదండ్రులు వర్గాలుగా విడిపోయి గ్రామాల్లో వర్గపోరుకు దారితీసాయి. 2004లో కాంగ్రెస్ సర్కార్ రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విద్యాకమిటీలను రద్దు చేశారు. ఆయన మరణానంతరం పాఠశాల యాజమాన్య కమిటీల పేరుతో 2011లో వీటికి కిరణ్ సర్కార్ ఎన్నికలు నిర్వహించింది. రెండేళ్ళ అనంతరం పాత నిబంధనలను కొద్దిమార్పుతో ఈ నెల 29న తాజాగా ఎన్నికలను నిర్వహించనున్నారు. గతానికి భిన్నంగా.... గతంలో పాఠశాల యాజమాన్యం కమిటీకి సర్పంచ్ చైర్మన్‌గా ఉండేవారు. వైస్‌చైర్మన్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకునే వారు. కాని ఈసారి చైర్మన్, వైస్‌చైర్మన్‌లను సంబంధిత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులే అయి ఉండాలి. చేతులెత్తడం లేదా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తాజాగా జారీ చేసిన జిఓ నెంబర్ 41లో పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో జరుగబోయే ఈ ఎన్నికలలో విద్యార్థుల తల్లిదండ్రులు చైర్మన్, వైస్‌చైర్మన్‌లతో పాటు తరగతికి ముగ్గురు చొప్పున కమిటీ సభ్యులను ఎన్నుకోవాలి. వీరిలో మూడింట రెండు వంతులు మంది మహిళలు ఉండాలని నిబంధన పెట్టారు. అలాగే చైర్మన్, వైస్‌చైర్మన్‌లలో ఎవరో ఒకరు తప్పనిసరిగా మహిళై ఉండాలని నిబంధనలు స్పషంగా చెబుతున్నాయి. ఇలా ఏర్పడిన కమిటీకి ప్రధానోపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్‌గా, వార్డు మెంబర్, అంగన్‌వాడీ కార్యకర్త, మహిళా సమాఖ్య సభ్యురాలు, ఆరోగ్య కార్యకర్తలు కో ఆప్షన్ మెంబర్లుగా ఉంటారు. కమిటీ కనుసన్నల్లోనే...మధ్యాహ్న భోజనం ఇక నుండి ప్రధానోపాధ్యాయుడు, కమిటీ చైర్మన్‌తో జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. నిధుల ఖర్చు కూడా ఇక నుండి కమిటీ పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజన నిర్వహణ సైతం కమిటీ కనుసన్నల్లోనే జరగాలి. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వీరికి నచ్చకపోతే కమిటీ సమావేశం నిర్వహించి ఏ నిమిషంలోనైనా మార్చేయవచ్చు. ఆగమేఘాలపై... పంచాయతీ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఆఘమేఘాలపై ఈ నెల 29వ తేదీన పాఠశాల యాజమాన్య కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. పల్లెల్లో ఎన్నికల వేడిని రగిల్చి ఎక్కడ తాము బలహీనంగా ఉన్నామో అక్కడ ముందు జాగ్రత్త చర్యలు సిద్ధం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిఓ విడుదల చేసినా నేటికి ఆయా పాఠశాలలకు అందకపోవడం గమనార్హం. కనీస విద్యార్హత నిర్ణయించాలి ఎపిటిఎఫ్ యూనియన్ కమిటీ చైర్మన్ పోటీ చేయబోయే వ్యక్తికి కనీస విద్యార్సత నిర్ణయించాలి. అలాగే ఏకగ్రీవమైన కమిటీలకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలి. ఎంపికైన వ్యక్తులు తమ పరిధి దాటి బోధనా విషయంలో జోక్యం చేసుకోరాదని ఎపిటిఎఫ్ నాయకులు కోరుతున్నారు. ఎయులో వెహికల్ ఫ్రీ జోన్ విశాలాక్షినగర్, జూన్ 27: ఆంధ్రా యూనివర్శిటీ వెహికల్ ఫ్రీ జోన్‌కు విశేష స్పందన లభించింది. గురువారం ఎయు ఉపకులపతితో పాటు అధికారులు, ఆచార్యులు, సిబ్బంది, ఉద్యోగులు, విద్యార్థులు వెహికల్ ఫ్రీ జోన్ నిబంధన ప్రకారం విధులకు నడుచుకుని వచ్చారు. ఈ వాహన నిరోధక నిబంధన నిర్వహణ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్‌ఎడి.పాల్ పర్యవేక్షణలో ఖచ్చితంగా జరిగింది. నెలలో ఒకరోజు వర్శిటీ వెహికల్ ఫ్రీ జోన్‌ను పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో అందరి సహకారంతో ఎయు ఉపకులపతి ఆచార్య జిఎస్‌ఎన్.రాజు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి అందరూ సహకరిస్తున్నారు. ఉదయం క్రీడాకారులు మాత్రం వాహనాలపై చేరుకుని వ్యాయామం చేస్తూ కనిపించారు. అదే విధంగా విద్యార్థులు, సిబ్బంది ముందుగానే చేరుకుని తమ ద్విచక్ర వాహనాలను సెల్లార్లలో నిలిపివేసారు. రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట పార్కింగ్ స్థలంలో మూడు ద్విచక్ర వాహనాలు కన్పించడంతో అధికారులు ఖంగుతిన్నారు. ఉదయం పదిగంటలకు విధులకు చేరుకున్న ఉపకులపతి ఆచార్య రాజు ప్రధాన గేటు ఎదుట కారును ఆపి నడుచుకుంటూ తన ఛాంబర్‌కు చేరుకుని విధులు నిర్వర్తించారు. అదే విధంగా రెక్టార్ ఆచార్య ఎవి.ప్రసాదరావు, రిజిస్ట్రార్ కట్టా రామ్మోహన్‌రావు, ప్రిన్సిపాల్స్ వాహనాలను వర్శిటీ బైట విడిచి నడుచుకుంటూ వచ్చి విధులకు హాజరయ్యారు. మద్దిలపాలెం ఇంజనీరింగ్ గేటు నుంచి వాహనాలను అనుమతించకపోవడంతో ఆ మార్గం గుండా ప్రయాణించే వారు చుట్టూ తిరిగి ర్శిటీ, త్రీటౌన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకోవడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎయు చుట్టూ ఉన్న అన్ని గేట్లను మూసివేసి పార్కింగ్‌ను రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసి వాహనాలను లొపలికి వెళ్ళకుండా క్రమబద్దీకరించారు. విక్టోరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి * జివిఎంసి కమిషనర్ విశాఖపట్నం, జూన్ 27: జివిఎంసి పరిధిలోని విక్టోరియా ఆసుపత్రిలో పారిశ్ధ్యు పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. వార్డుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన 23,24 వార్డులో పర్యటించారు. ఈసందర్భంగా విక్టోరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
* అధినేతకు తెలుగు తమ్ముళ్ల సూచన
english title: 
local bodies

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>