శంకర్‌పల్లి, జూలై 8: ఎన్నికల ప్రచారంలో వాహనాలకు అనుమతి లేకున్నా, లెక్కకు మించి డబ్బులు ఖర్చుచేస్తే కేసులు, శిక్షలు తప్పవని స్థానిక తహశీల్దార్, ఎంపిడిఓ భిక్షం, చేవెళ్ల సిఐ గంగారాం హెచ్చరించారు. సోమవారం పరిషత్‌లో నేతల సమావేశంలో వారు మాట్లాడుతూ, గ్రామాల్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని, పదివేలకంటే ఎక్కువ జనాభా వున్న గ్రామంలో సర్పంచ్ అభ్యర్ధి రూ.80 వేలు, వార్డు సభ్యులు ఆరువేలు ఖర్చు చేసి లెక్కలు చూపాలన్నారు. జనరల్ సర్పంచ్ రూ.2వేలు, ఎస్సీ ఎస్సీ, బిసి సర్పంచులు రూ.1000 డిపాజిట్ చేయాలన్నారు. వార్డు సభ్యులు జనరల్- రూ.500, ఎస్‌సి, ఎస్టీ, బిసిలు రూ.250 డిపాజిట్ చేయాలన్నారు. ఈనెల 9 నుంచి 13వరకు నామినేషన్లు ఉ.10.30 నుంచి సాయంత్రం వరకు, 14న పరిశీలన, 15న అభ్యంతరాలు, 16న ఆర్‌డిఓకు అప్పీలు చేసుకోవాలన్నారు. ఈనెల 27న ఎన్నికలు జరుగుతాయని, అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక వుంటుందని, తదుపరి నిర్ణయాలు ఎన్నికల అధికారిదేనని అన్నారు. సమావేశంలో నాయకులు, ఓటర్లు, అభ్యర్ధులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో వాహనాలకు అనుమతి లేకున్నా, లెక్కకు మించి
english title:
code
Date:
Tuesday, July 9, 2013