హైదరాబాద్, జూలై 8: రంగారెడ్డి జిల్లాలోని 705 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 15 గ్రామ పంచాయతీలు నగర పంచాయతీలుగా ప్రకటించగా, మరో 36 గ్రామ పంచాయతీలు జిహెచ్‌ఎంసిలో విలీనం చేసేందుకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కోర్టు కేసులు, కాలం తీరని పంచాయతీలు మినహా మిగిలిన 649 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించేందుకు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 672 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీల జాబితాను ప్రకటించిన ప్రభుత్వం పురపాలక శాఖ చేసిన అభ్యర్థన మేరకు మరో 22 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్
కీసర సర్పంచ్ అభ్యర్థి జంగయ్య
కీసర, జూలై 8: వైఎస్‌ఆర్‌సిపి కీసర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కరెంటు జంగయ్యను మండల కన్వీనర్ టి. ఉమాపతి శర్మ ప్రకటించారు. కీసరగుట్టలో వైఎస్‌ఆర్‌సిపి సమావేశంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు. టిడిపి పార్టీలు ఉన్న జంగయ్య పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పిలుపురాకపోవడంతో చివరకు యాభై మంది కార్యకర్తలతో కలిసి వైసిపిలో చేరారు. కీసర గ్రామ సర్పంచ్‌గా గెలిచితీరుతానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు జె.సత్తిరెడ్డి, ముత్యంరెడ్డి, యాదగిరి, వీరేశ్, నరహరి, లాలియాదవ్, టి.లక్ష్మణ్, ప్రభాకర్‌చారి, ఎం.వెంకటేశ్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్, వైకాపా, బిజెపిలకు సర్పంచ్ అభ్యర్థులు కరువు
హయత్‌నగర్, జూలై 8: గ్రామపంచాయితీ ఎన్నికలకు మొదటి విడతగా నేడు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. హయత్‌నగర్ మండలంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఒక్కో గ్రామం నుంచి ఇద్దరు ముగ్గురు చొప్పున సర్పంచ్ పోటీ కోసం పోటీపడుతున్నారు. టిఆర్‌ఎస్, వైకాపా, బిజెపిలకు పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు. మండలంలోని 23గ్రామాలకు గాను కొన్ని గ్రామాలలో తప్పా ఆ పార్టీల బలం ఎక్కడ కనిపించడం లేదు. సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ మొదలవుతున్న ఆ పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారని కార్యకర్తలే చెపుతున్నారు. ప్రధాన పార్టీలలో పోటీపడుతున్న నాయకులను ఆ పార్టీల ఇన్‌చార్జ్‌లు బుజ్జగిస్తూ కేవలం గెలుపు గుర్రాల కోసం వెతుకుతున్నారు. దీంతో ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్‌ల పోటీ జోరందుకుంది. రిజర్వేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గెలుపు గుర్రాలను ఎంచుకొని రాత్రివేళ మద్యం సరఫరాతో ప్రచారాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఎంత ఖర్చు పెట్టైన తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే లక్ష్యంతో పోటీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. తెరాస, వైకాపా, బిజెపిలు మాత్రం పోటీ చేసేందుకు సర్పంచ్ అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లాలోని 705 గ్రామ పంచాయతీల్లో
english title:
rangareddy
Date:
Tuesday, July 9, 2013