కావలసినవి
పచ్చి టమాటాలు - 3
ఉల్లిపాయ - 2
జీలకర్ర - 1 టీ.స్పూ.
పచ్చిమిర్చి - 4
నువ్వులు - 3 టీ.స్పూ.
ధనియాలు - 2 టీ.స్పూ.
చింతపండు
- చిన్న నిమ్మకాయంత
వెల్లుల్లి - 4 రెబ్బలు
ఉప్పు - తగినంత
ఆవాలు, జీలకర్ర - 1/3 టీ.స్పూ.
మినప్పప్పు - 1 టీ.స్పూ.
కరివేపాకు - 2 రెబ్బలు
నూనె - 4 టీ.స్పూ.
ఇలావండాలి
ఈ పచ్చడికి పండినవి కాకుండా పచ్చి టమాటాలనే తీసుకోవాలి. పాన్ వేడి చేసి జీలకర్ర, నువ్వులు, ధనియాలు దోరగా వేయించాలి. అదే పాన్‌లో రెండు చెంచాల నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గనిచ్చి చల్లారనివ్వాలి. వేయించుకున్న జీలకర్ర, నువ్వులు మొదలైనవి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇందులో వేయించిన టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, తగినంత ఉప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి. మరో చిన్న పాన్ లేదా గినె్నలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పప్పు వేసి రంగు మారుతున్నపుడు దింపి రుబ్బుకున్న పచ్చడిలో కలపాలి.