కావలసినవి
గుమ్మడికాయ ముక్కలు
- 250 గ్రా.
ఉల్లిపాయ - 1
టమాటా - 2
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు
ధనియాల పొడి - 2 టీ.స్పూ.
గరం మసాలా పొడి
- 1/4 టీ.స్పూ.
కొబ్బరిపొడి - 3 టీ.స్పూ.
జీడిపప్పు - 8
పెరుగు - 1/4 కప్పు
అల్లం-వెల్లుల్లి ముద్ద
- 1/2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
తయారుచేసేదిలా
గుమ్మడికాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను దోరగా వేయించాలి. ఇం దులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాలు వేపాక, గుమ్మడికాయ ముక్కలు, కారం పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు కాస్త వేగి, మగ్గిన తర్వాత ధనియాల పొడి, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. కొబ్బరి పొడి, జీడిపప్పు, టమాటా ముక్కలు, పెరుగు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత ఈ మసాలా, గరం మసాలా పొడి వేసి కలిపి ఉడికించాలి. ముక్కలు ఉడికి, చిక్కబడి నూనె తేలుతున్నపుడు కొత్తిమీర చల్లి దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలు, పరాఠాలకు బావుంటుంది.