కావలసినవి
మైదా - 1 కప్పు
డాల్డా లేదా వెన్న - 1/4 కప్పు
ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి
పెరుగు - 3 కప్పులు
పంచదార - 3 టీ.స్పూ.
స్వీట్ చట్నీ - 5 టీ.స్పూ.
జీలకర్ర పొడి - 2 టీ.స్పూ.
సన్న సేవ్ - 5 టీ.స్పూ.
కొత్తిమీర - 3 టీ.స్పూ.
ఇలా చేద్దాం
పెరుగులో పంచదార, తగినన్ని నీళ్లు కలిపి మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చిలికి ఫ్రిజ్‌లో పెట్టాలి. మైదాలో చిటికెడు ఉప్పు కలిపి రెండుసార్లు జల్లించి డాల్డా లేదా వెన్న కరిగించి కలపాలి. ముందుగా వెన్నని పిండిలో కలిపి తర్వాత తగినన్ని నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా తడిపి మూత పెట్టి ఉంచాలి. అరగంట తర్వాత ఆ పిండిని బాగా పిసికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను చిన్న పూరీల్లా వత్తుకుని రెండుసార్లు మడత పెట్టి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా కాకున్నా చిన్నగా కాస్త మందంగా బిస్కెట్ సైజులో పూరీల్లా వత్తుకుని కాల్చుకోవచ్చు. సర్వ్ చేసేముందు ఒక బౌల్‌లో ఈ పూరీలను చిదిమి పెట్టి దానిపైన చిలికిన పెరుగు వేసి దానిమీద ఖర్జూరం, బెల్లం, చింతపండు పులుసు, జీలకర్ర పొడి వేసి ఉడికించి తయారుచేసుకున్న స్వీట్ చట్నీ వేయాలి. దానిమీద జీలకర్ర పొడి, సన్న సేవ్, కొత్తిమీర వేసి వెంటనే సర్వ్ చేయాలి.