కావలసినవి
బోన్‌లెస్ చికెన్ - 100 గ్రా.
ఉల్లిపొరక తరుగు
- 2 కప్పులు
ఉల్లిపాయ - 1
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
ధనియాల పొడి - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి
- 1/4 టీ.స్పూ.
అల్లం-వెల్లుల్లి ముద్ద
- 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
ఇలా వండాలి
ముందుగా ఒక గినె్నలో నాలుగు కప్పుల నీళ్లుపోసి చికెన్ ముక్కలు ఉడికించాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించి పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి ఉడికించిన చికెన్ ముక్కలు వేసి కలపాలి. ఇందులో కారం పొడి ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. ముందే ఉడకబెట్టాం కాబట్టి తొందరగానే వేగిపోతుంది. ఇందులో కడిగి సన్నగా తరిగిన ఉల్లిపొరక వేసి కలిపి మూత పెట్టాలి. ఉల్లిపొరక ఆకు ఉడికి నీరంతా ఇగిరిపోయాక గరం మసాలా పొడి చల్లి దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.