ఏలూరు, జూలై 26: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రాన్ని విభజించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయని, దీన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా సమైక్యంగా ముందుకు రావాలని జిల్లా ఎన్‌జిఓల సంఘం అధ్యక్షులు ఎల్ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. అలాకాకుండా నిశ్శబ్దంగా ఊరుకుంటే చూస్తు ఊరుకునేది లేదని వారిని పదవుల నుంచి దింపే సత్తా తమకు ఉందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ఆదర్శంగా నిలిచారని, అదే బాటలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా నడవాలని కోరారు. లేని పక్షంలో ఈనెల 29న సీమాంధ్ర ఎంపిల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తొందరపాటే అవుతుందన్నారు.ఉద్యోగులందరూ సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు.
నేడు భీమవరం బంద్
భీమవరం:రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అఖిల పక్ష నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన అంశంపై దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా శనివారం భీమవరం బంద్ నిర్వహించనున్నారు. ఈసందర్భంగా భీమవరం పట్టణ ప్రముఖులు శుక్రవారం పట్టణంలో జెఎసిగా ఏర్పడి సమావేశమయ్యారు.
ఎపి ఎన్‌జిఓల హెచ్చరిక
english title:
v
Date:
Saturday, July 27, 2013