సంక్లిష్టమైన సమయాల్లో జట్టుకు అండగా నిలిచి, మ్యాచ్‌ల్లో విజయాలను అందించిన ఆటగాళ్ల జాబితాలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అత్యుత్తమ ‘మ్యాచ్ ఫినిషర్’ ఎవరన్న ప్రశ్నకు వెస్టిండీస్‌లో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్‌లో సమాధానం లభించింది. శ్రీలంకను ఢీకొన్న భారత్‌కు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమయ్యాయి. షామిండా ఎరాంగ వేసిన ఆ ఓవర్ మొదటి నాలుగు బంతుల్లోనే 16 పరుగులు సాధించిన ధోనీ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని సాధించిపెట్టాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టును లక్ష్యానికి చేర్చాడు. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మైఖేల్ బెవాన్ కూడా గొప్ప ‘మ్యాచ్ ఫినిషర్’ గుర్తింపు పొందాడు. అయితే, జట్టును గెలిపించే క్రమంలో అతను సగటున 66.42 పరుగులు చేశాడు. ధోనీ విషయానికి వస్తే ఈ సగటు 89.63 పరుగులు. సూపర్ ధోనీకి తిరుగులేదని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఓటమి అంచున నిలిచిన జట్టును తిరుగులేని ఆటతో ఎలా గెలిపించాలి? ఇన్నింగ్స్‌కు ఎలాంటి ముగింపు ఇవ్వాలి? అన్న ప్రశ్నలకు ధోనీ ఆటే చక్కటి సమాధానం.
సంక్లిష్టమైన సమయాల్లో జట్టుకు అండగా నిలిచి
english title:
dhoni
Date:
Sunday, July 28, 2013