Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అమ్మయ్య -- సిసింద్రి కథ

$
0
0

రఘురామపురంలో సకల సంపత్తులు కలుగజేసే యోగి పుంగవుడున్నాడని తెలిసి సంతాన భాగ్యం కోసం పరితపిస్తూ వున్న జానకిరామయ్య భార్యతోసహా పయనమై ఆ ఊరు చేరుకున్నాడు.
యోగధ్యానంలో వున్న స్వామి ఈ లోకంలోకి వచ్చేవరకు అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపటి తరువాత కనులు తెరచిన స్వామి ఎదురుగా ఉన్న దంపతులను చూసి విషయమేమిటని అడిగాడు.
‘స్వామీ! మాకు పెళ్లై 20 సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలుగలేదు. పిల్లల కోసం పరితపిస్తున్న మేము తిరగని క్షేత్రం లేదు. మొక్కని దేవుడు లేడు. అలా తిరిగి తిరిగి వేసారిన మాకు మీరు వచ్చారన్న వార్త విని ఆనందం కలిగింది. మాయందు దయ తలచి సంతానం కలిగే మార్గం చూపండి స్వామీ’ అని ఎంతో వినయంతో వేడుకున్నారు జానకిరామయ్య దంపతులు.
వారు చెప్పింది విని మళ్లీ ధ్యానంలోకి వెళ్లి కాసేపు అలాగే ఉండి కనులు తెరచి, ‘అన్ని పుణ్య క్షేత్రాలూ తీర్థాలూ తిరిగాం అంటున్నారు. ఎందరి దేవుళ్లకో మొక్కాం అంటున్నారు. మీ తల్లిదండ్రులను పూజిస్తున్నారా?’ ప్రశ్నించాడు యోగి పుంగవుడు.
‘మా అమ్మానాన్నలు ఎప్పుడో పరమపదించారు స్వామీ!’ నిరుత్సాహంగా చెప్పాడు జానకిరామయ్య. ‘అమ్మానాన్నలు బతికి వున్నారా, చనిపోయారా అని కాదు. బతికుంటే గౌరవించాలి. చనిపోతే పూజించాలి. మాతా పితలంటే ఎవరనుకున్నారు? మనకు కనిపించే దేవుళ్లు. వారిని మరచి దేవుళ్లను పూజించటం వ్యర్థం. తల్లిదండ్రులు బిడ్డలను ఏ విధంగా పెంచుతారో మీకు తెలియదా? బిడ్డలకు కావలసినవన్నీ ఏ విధంగా సమకూర్చుతారో నీవు ఎరుగవా? ఒక కోడి పెట్టను చూడండి. కాళ్లతో మట్టిని తవ్వి తన పిల్లలకు ఏ విధంగా ఆహారాన్ని అందిస్తుందో చూశావా? అలాగే మనకు కావలసిన వాటి కోసం వారు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటారు. కాబట్టి ఇక నుంచి మీరు వేకువనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ముందుగా తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా పూజించి ఆ తరువాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇష్టదైవంతోపాటు మీ తల్లిదండ్రులు కూడా మీ కోరిక సిద్ధించటానికి ఎంతో కృషి చేస్తారు. ఈ ప్రక్రియ మీ సంతతి కూడా అలవర్చుకుంటుంది.’ ఎంతో నిశ్చలంగా పలికాడు స్వామి. యోగి పలుకులకు పరవశించిపోయిన దంపతులు ‘స్వామీ! తీర్థయాత్రలు చేసిన మాకు కనిపించే దేవుళ్లే తల్లిదండ్రులు అన్న సత్యం మాకు తెలియలేదు. సృష్టి రహస్యం చెప్పి మా కళ్లు తెరిపించారు. ఇక నుంచి ప్రతిరోజూ మీరు చెప్పినట్టే నడుచుకుంటాం.’ అంటూన్న జానకిరామయ్య మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది.
‘మీరే కాదు -ప్రతి ఒక్కరూ కూడా అమ్మానాన్నలను అవగాహన చేసుకొనే పదమే ‘అమ్మయ్య’. ఈ పదాన్ని ప్రతి ఒక్కరూ కూడా కూర్చున్నా, లేచినా, ఏ పని మొదలుపెట్టినా భగవంతుని కన్నా ముందుగా అమ్మయ్య అనే పదమే మీ నోటి వెంట ఉచ్ఛరించాలి. అప్పుడే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సార్థకత ఏర్పరచిన వారౌతారు.’
‘అర్థమైంది స్వామీ! మేం ఇంతవరకు ఏం కోల్పోయామో ఇప్పుడే తెలుసుకున్నాను స్వామి. నేనే కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పదం పలికేటట్లు చేస్తాను. ఈ విధంగా అందరికీ తెలియజేస్తే ఆ పుణ్యానైనా మా కోరిక తీరుతుందని నమ్మకం కలుగుతుంది. ఈ అమ్మయ్య అనే పదాన్ని అమృతంలాగా అందరికీ తారకమంత్రంగా చేరవేస్తాను. నేను మళ్లీ బిడ్డతో మీ దర్శనం చేసుకుంటానని నమ్మకం కలుగుతుంది. అలా జరిగేటట్టు ఆశీర్వదించండి స్వామీ’ అని యోగి దీవెన పొంది ఎంతో తృప్తితో స్వామి నుంచి సెలవు తీసుకున్నారు జానకిరామయ్య దంపతులు. *

పీడనం కలుగజేసే బలం -
చేసి చూద్దాం

కొద్ది నీటితో తడిపిన మైదాపిండిని బాగా పిసికి ముద్దగా చేయాలి. ఈ ముద్దపై ఒక అగ్గిపెట్టెను బల్లపరుపుగా ఉంచాలి. ఒక సీసా నిండుగా ఇసుక తీసుకుని ఆ సీసాను అగ్గిపెట్టెపై ఉంచాలి. ఆ విధంగా కొంత సమయం ఉంచాలి.
ఇప్పుడు ముద్దగా తయారైన మైదాపిండిని మరి కొంత తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద అగ్గిపెట్టెను తక్కువ వెడల్పుగల భాగం మీద ఆనుకుని ఉండేట్లు ఉంచాలి. అగ్గిపెట్టె రెండవ భాగంపై మరల ఇసుకతో నింపిన సీసా ఉంచాలి. ఈ అమరికను కూడా కొంత సమయం ఉంచాలి.
ఈ దఫా తడిపిన మైదా పిండి ముద్దపై అగ్గిపెట్టెను నిటారుగా ఉంచాలి. అంటే దాని చిన్న భాగం ముద్దపై అనునట్లు ఉంచాలి. అగ్గిపెట్టె రెండవ వైపున ఉండే చిన్న భాగంపై ఇసుకతో నింపిన సీసాను ఉంచాలి.
ఈ ప్రయోగంలో ఉపయోగించే మూడు సీసాలు ఒకే పరిమాణంలో ఉండాలి. వాటిలో నింపిన ఇసుక సమానంగా ఉండాలి.
పిండి ముద్దపై అగ్గిపెట్టె పీడనం కలుగజేసే బలం వలన ముద్దలోని అగ్గిపెట్టె దిగుతుంది. ఈ ప్రయోగంలో అగ్గిపెట్టె చిన్నభాగం ముద్దపై ఉంచినపుడు అగ్గిపెట్టె ముద్దలో ఎక్కువ లోతుకు దిగినట్లు గమనిస్తారు. దీనికి కారణం ఇసుక సీసా పీడనం కలుగజేసిన బలం మిగిలిన సందర్భాలకన్నా ఈ సందర్భంలో ఎక్కువ.
-సి.వి.సర్వేశ్వరశర్మ

కాపీకేట్ - స్ఫూర్తి
సుఖేష్ తండ్రి తన తొమ్మిదేళ్ల కొడుకులో ఇటీవల వచ్చిన మార్పుని గమనించాడు. భాషలోని మార్పు, ‘ఎనీవేస్’ అనే పదాన్ని కొత్తగా వాడుతున్నాడు. షర్ట్ కాలర్‌ని తన ఫేవరేట్ సినిమా హీరో నటించిన కొత్త సినిమాలోలా పైకి ఎత్తి పెట్టుకుంటున్నాడు. తనకి మినపరొట్టె వద్దని, పీజా కావాలని తల్లిని అడగడం విన్నాడు. కొత్తగా ఓ హిందీ పాటని ఆలపిస్తున్నాడు. తన మిత్రులని ఫోన్‌లో ‘హాయ్ బడీ’ అని పిలవడం కూడా విన్నాడు.
‘మీరు గమనిస్తే సుఖేష్ బొత్తిగా కాపీకేట్ అవుతున్నాడు కదండి’ ఆ రోజు వాడి తల్లి తన భర్తని అడిగింది.
‘అవును. గమనించాను. అది మంచిది కాదు.’
ఆ సాయంత్రం ఆఫీస్ నించి ఇంటికి తిరిగి వచ్చాక సుఖేష్ తండ్రి కొద్దిసేపు యూ ట్యూబ్‌లో ఓ కార్టూన్ సినిమా కోసం వెదికి దాన్ని పట్టుకున్నాడు. తర్వాత సుఖేష్‌ని పిలిచి చెప్పాడు.
‘నీకో చిన్న సినిమా చూపిస్తారా. దీంట్లో ఏదైనా నీతి ఉందేమో చూసి చెప్పు’
సినిమా అనగానే సుఖేష్ ఆసక్తిగా వచ్చాడు. ఇద్దరు కలిసి ‘ఇగుమన్’ అనే ఆ సినిమాని చూశారు. ఇగుమన్ తొండ లాంటి ఓ జంతువు. అది తనకి పరిచయం అయిన ఇతర జంతువుల్లా కనిపించే ప్రయత్నం చేయసాగింది. దాంతో జీబ్రాలా ఒంటికి తెలుపు, నలుపు చారలని పూసుకుంది. ఏనుగులా ఓ రబ్బరు గొట్టాన్ని తొండంలా అమర్చుకుంది. గుర్రానికి ఉన్న జూలుని చూసి, తన మెడ మీద జుట్టు అతికించుకుంది. పక్షిని చూసి ఈకలని అతికించుకుంది. దాని రూపం చూసి సుఖేష్ పగలబడి నవ్వుతూ చెప్పాడు.
‘క్రేజీ! అది బఫూన్‌లా తయారైంది. ఎనీవేస్ సినిమా బావుంది నాన్నా’
ఓ రోజు ఇగుమన్ మిత్రులంతా కాస్ట్యూమ్ పార్టీని ఏర్పాటు చేసి దాన్ని కూడా ఆహ్వానించారు. ఆ పార్టీకి వచ్చిన వాళ్లంతా ఇగుమన్ లాగే ఉండటం చూసి ఇది వెంటనే బాత్‌రూంలోకి వెళ్లి తను తొడుక్కున్న, అలంకారాలన్నీ తీసేసి వచ్చింది. దానికి ఆ పార్టీలో ‘బెస్ట్ డ్రెస్ట్ ఇగుమన్’ బహుమతి లభించింది.
‘దీని నీతి ఏమిటి?’ సుఖేష్‌ని సినిమా అయ్యాక వాడి తండ్రి అడిగాడు.
‘ఇతరుల్ని చూసి క్రేజీ వేషాలు వేయకూడదు’
‘నాకు నువ్వు వేషం తీయక మునుపటి ఇగుమన్‌లాగా కనిపిస్తున్నావు తెలుసా?’ ఆయన నవ్వుతూ చెప్పాడు.
‘్ఛ! నేనేం మెడకి జుట్టు అతికించుకుని, మొహానికి తొండం తగిలించుకోలేదే? ఎందుకలా కనిపిస్తున్నాను?’ సుఖేష్ అడిగాడు.
‘నువ్వు కూడా దానిలాగే ఇతరుల్ని అనుకరించడం గొప్పనుకుంటున్నావు. ‘ఎనీవేస్’ అనే పదాన్ని మీ అక్క స్నేహితురాలి దగ్గర నేర్చావు. సినిమా హీరోని చూసి కాలర్ పైకి ఎగరేసావు. నల్ల బూట్లకి బ్రౌన్ రంగు లేసులని ఓ క్రికెటర్‌ని చూసి అనుకరిస్తూ కట్టుకుంటున్నావు. ఇవన్నీ చూస్తూంటే నాకు నువ్వు అచ్చం ఆ ఇగుమన్‌లానే అనిపిస్తున్నావు?’
‘నిజమా?’
‘ఎవరికైతే తమ మీద ఆత్మవిశ్వాసం ఉండదో వారు ఇతరులని అనుకరిస్తారు. నువ్వు ఇంకొకర్ని అనుకరించడం కాదు. నినే్న ఇతరులు అనుకరిస్తే అది నీ గొప్పతనం అవుతుంది. ఎనీవేస్ నువ్వే ఆలోచించుకో’ ఆయన నవ్వుతూ చెప్పాడు.
ఆ తర్వాత సుఖేష్ ఎన్నడూ కాపీకేట్‌లా ప్రవర్తించలేదు.
-మల్లాది వెంకటకృష్ణమూర్తి

రఘురామపురంలో సకల సంపత్తులు కలుగజేసే యోగి పుంగవుడున్నాడని
english title: 
sisindri
author: 
- చండిక సముద్ర

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>