విశాఖపట్నం, ఆగస్టు 5: సమైక్యాంధ్రకు మద్దతుగా మహావిశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) అధికారులు, సిబ్బంది ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ఎపి ఎన్జీఓల సంఘం, రాష్ట్ర పురపాలక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జివిఎంసిలోని పట్టణ ప్రణాళిక విభాగం, ఎంప్లారుూస్ యూనియన్, జివిఎంసి ఆఫీసర్స్ అసోసియేషన్ (గోవా) సంయుక్తంగా రాష్ట్ర సమైక్య పోరాటంలో భాగస్వామ్యం అయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా తమ రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు సోమవారం నుంచి విధులను భహిష్కరిస్తున్నట్టు జివిఎంసి పట్టణ ప్రణాళిక అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈమేరకు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జయరాం, వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉదయం నుంచి సిబ్బంది విధులకు హాజరుకాకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఉద్యోగుల హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు పట్టణ ప్రణాళిక విభాగం ప్రతినిధులు సమైక్యాంధ్రకు మద్దతుగా తాము ఉద్యమంలో పాల్గొంటున్నామని, 72 గంటల పాటు పెన్‌డౌన్ సమ్మెకు దిగుతున్నట్టు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణకు లిఖితపూర్వకంగా తెలిపారు. అనంతరం వీరంతా జివిఎంసి కార్యాలయం ప్రధాన ద్వారం నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘గోవా’ ఆధ్వర్యంలో
జివిఎంసి ఆఫీసర్స్ అసోసియేషన్ (గోవా) ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు ఎడిసి రమేష్, పూర్ణచంద్రరావు, సిఇ బి జయరామిరెడ్డి తదితరులు ముందుగా కమిషనర్ ఎంవి సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విధులను బహిష్కరించి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా వారు రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో పట్టణ ముఖ్యప్రణాళికాధికారి బాలకృష్ణ, ప్రధాన ఆరోగ్య అధికారి డాక్టర్ ఎంఎస్ రాజు తదితరులు పారల్గొన్నారు. అనంతరం మానవహారం నిర్వహించారు.
జివిఎంసి గుర్తింపు యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎం ఆనందరావు ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా తలపెట్టిన ఆందోళనలో పాల్గొన్నారు.
బీచ్‌రోడ్డులో ఇక నిరంతర పారిశుద్ధ్యం
* వ్యాపారులకూ ప్రత్యేక డ్రెస్ కోడ్
* జివిఎంసి కమిషనర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 5: సాగరతీరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంపై జివిఎంసి దృష్టి సారించింది. బీచ్‌రోడ్డులో పారిశుద్ధ్య మెరుగునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. తన ఛాంబర్‌లో సోమవారం కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య మెరుగునకు చేపట్టే చర్యల్లో భాగంగా ఇక మీదట నిరంతరం పారిశుద్ధ్య పనులు జరుగుతాయని తెలిపారు. దీనిలో భాగంగా 24 గంటలూ పారిశుద్ధ్య పనులు జరిగే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. దీని అమలుకు జోనల్ కమిషనర్‌తో పాటు సూరింటిండెంట్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బీచ్‌రోడ్డులో వ్యాపారాలు చేసుకునే వారందరికీ డ్రస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇక్కడ వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులకు డస్ట్‌బిన్‌లు పంపిణీ చేసి చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిరోధించాలని నిర్ణయించామన్నారు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీచ్‌లో సందర్శకులను ఆకర్షించేందుకు పార్కుల్లో ఏర్పాటు చేసిన కట్టడాలు దెబ్బతిన్నాయని, వీటికి మరమ్మతులు చేపట్టి మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందని, ఫ్లైఓవర్ కింది భాగాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు 70 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. బ్రిడ్జి కిందిభాగంలో ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అయితే ఇక్కడ వాహనాల పార్కింగ్ వంటి వాటికి అనుమతిచ్చేందుకు నిబంధనలు అనుమతించవని ఆయన స్పష్టం చేశారు. నగర పరిధిలో శిధిల భవనాల కూల్చివేతకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, సమయం మించిన పక్షంలో వాటిని తామే స్వయంగా కూల్చేస్తామని స్పష్టం చేశారు.
జివిఎంసిలో భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలు సహా 10 పంచాయతీల విలీనం పూర్తయిందని, నిబంధనల మేరకు 19లకు జివిఎంసి జనాభా చేరుకుందన్నారు. నిబంధనల ప్రకారం జివిఎంసిని 81 వార్డులుగా పునర్విభజించే అవకాశం ఉందని, ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలిపారు. వార్డుల పునర్విభజన, మ్యాప్ తయారీ, నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన వంటి అంశాలు పూర్తయ్యేందుకు నెల రోజులు సమయం పడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కెజిహెచ్, ఎఎంసికి పాకిన సమైక్య సెగ
* రోడ్డెక్కి నిరసన తెలిపిన వైద్యులు
విశాఖపట్నం, ఆగస్టు 5: సమైక్య సెగ కెజిహెచ్, ఆంధ్రామెడికల్ కాలేజీ (ఏఎంసి)కి పాకింది. వైద్యులంతా రోడ్డెక్కి మరీ తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ప్రజా సంఘాలు, ఏన్జీవోలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, ముస్లింలు, కాలేజీ విద్యార్థులు, యువజన సంఘాలతోపాటు వైద్యులు తీవ్రతరమవుతున్న ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. దీంతో కేజిహెచ్, ఏఎంసిలు వైద్యుల నిరసనలతో హోరెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ గవర్న్‌మెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కేజిహెచ్ వద్ద పెద్ద సంఖ్యలో వైద్యులు పాల్గొని నిరసన ప్రదర్శన నిర్వహించార. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పిడకల శ్యామ్‌సుందర్ నాయకత్వంలో రాష్ట్ర విభజనపై జరుపుతున్న నిరసనల కార్యక్రమంలో భాగంగా సోమవారం యునైటెడ్ డాక్టర్స్ ఫోరం (ఏపి ప్రభుత్వ వైద్యుల సంఘం, ఐఎమ్, నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్స్) నర్సుల అసోసియేషన్స్, క్లాస్-4 ఎంప్లారుూస్ అసోసియేషన్స్ సంయుక్తంగా జరిపిన ధర్నా కార్యక్రమాలు కెజిహెచ్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి వద్ద జరిగాయి. కంటి ఆసుపత్రి దగ్గర మానవహారంగా ఏర్పడి బుల్లయ్య కాలేజి దగ్గర విఐపి రోడ్డును దాదాపు గంటసేపు దిగ్భంధం చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ మంగళవారం నుంచి వైద్య విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర విభజనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఎక్కడికక్కడ జరుగుతాయని శ్యాంసుందర్ తెలియజేశారు. అలాగే హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక విభాగాధిపతిని ఒక అసిస్టెంట్ దుర్భాషలాడుతూ ఈ ప్రాంతం నుంచి వెళ్ళకపోతే పెట్రోలు పోసి తగులబెడతానని అందరి ముందు చేసిన వ్యాఖ్యలు 24 గంటల్లో ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పకపోతే ఈసారి తెలంగాణా బిడ్డలతోనే సమాధానం చెప్పిస్తామని హెచ్చరించారు. ఇకనైనా అలాంటి వ్యాఖ్యాలు చేయవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ ఆదినారాయణ, ఎపిఎన్‌ఏ ప్రతినిధులు, నర్సుల అసోసియేషన్, క్లాస్-4 ఎంప్లారుూస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యులు శ్యామ్ సుందర్, ఉదయ్‌కుమార్, బాబీ శ్యాంకుమార్, రమణి, ఇందిర, శేఖర్, జయధీర్, సుధాకర్ పాల్గొన్నారు. కంటి ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ వివిఎల్ నర్సింహ, ఆర్‌ఎంఓ సత్యనారాయణ, వైద్యులు, నర్సు, నాల్గవ తరగతి ఉద్యోగులు, పారామెడికల్ స్ట్ఫా పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకు మద్ధతుగా
ఆర్టీసీ ఎన్‌ఎంయు నిరవధిక నిరాహారదీక్షలు
విశాఖపట్నం, ఆగస్టు 5: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సోమవారం ఆర్టీసీ ఎన్‌ఎంయు విశాఖ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం సిటీ డిపో వద్ద రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని జిల్లా అధ్యక్షుడు వి.అప్పారావు ప్రారంభించారు. ఈ శిబిరంలో తొమ్మిది డిపోల కార్మికులు పాల్గొన్నారు. స్టూడెంట్ జెఏసి నాయకులు, ఏపీఎన్జీవోల నాయకులు, పంచాయతీరాజ్ అసోసియేషన్ నాయకులు హాజరై సంఘీభావం తెలియపర్చారు. ఈ దీక్షా శిబిరానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన ఎన్‌ఎంయు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఒకే ఒక డిమాండ్త్ ఆర్టీసీ ఆర్మికులు, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలో భాగంగా ఈ రోజు జిల్లా కమిటి దీక్షలు నిర్వహించిందన్నారు. వీటిని నిరవధిక కొనసాగిస్తామన్నారు. కేవలం కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రాన్ని విభజించాలని చూడటం దుర్మార్గమని, దేశంలో 20 రాష్ట్రాల విభజన కేంద్ర హోంశాఖలో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఈ రాష్ట్రాన్ని మాత్రమే విభజించాలని నిర్ణయం తీసుకున్న దానిపై సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తక్షణం వారి పదవులకు రాజీనామా చేసి ఉద్యమాన్ని నడిపించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి హాజరైన జోనల్ కార్యదర్శి పివివి మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టమని, ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండి సీమాంధ్ర ఆర్టీసీకు నష్టపోతుందన్నారు. నీరు, విద్యుత్, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఏర్పడుతున్నాయన్నారు. అవసరమైతే సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి హాజరైన ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షులు కె.ఈశ్వరరావు సంఘీభావం తెలియజేశారు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచేంతంట వరకు ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలతో తీవ్ర ఉద్యమాన్ని సమిష్టిగా నడిపించాలని పిలుపునిచ్చారు. స్డూడెంట్ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తక్షణం రాజీనామా చేయాలని, ముఖ్యంగా కేంద్ర పర్యాటకశాఖామంత్రి చిరంజీవి ప్రజారాజ్యం అధ్యక్షులుగా ఉన్నపుడు గట్టిగా వాదించి, ఈ రోజు మంత్రి పదవి వచ్చిన తరువాత మాట మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణం వారి పదవికి రాజీనామా చేసి, సమైక్యాంధ్రకు కట్టుబడకపోతే, సీమాంధ్రలో వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సినిమాల విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంయు నాయకులు, విజి విలియమ్స్, ఎంవిఆర్ మూర్తి, పిఎన్ రావు, జెఎం నాయుడు, అన్ని డిపోల అధ్యక్ష,కార్యదర్శులు హాజరయ్యారు. ఎపీఎన్జీవో సంఘ నాయకులు కెవి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సత్తిబాబు, ఏపీ పంచాయితీరాజ్ అసోసియేషన్ అధ్యక్షులు యు.కూర్మారావులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ రోజు దీక్షా శిబిరంలో ఆర్టీసీ సిబ్బంది ఎల్.అప్పన్న, శంకర్, కెవిజె రావు, కెవిఎస్ ప్రసాద్, సంజీవి, టిఎస్ రావు, ఎంఆర్ బాబు, సాయిబబా, పివివిఎస్‌బి రావు, కృష్ణ, పి.రాంజీ, పివి రావు, కెవి కుమార్, వైఆర్‌సిహెచ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ముస్లింల మానవహారం
* సమైక్యాంధ్రకు మద్ధతుగా ర్యాలీ
విశాఖపట్నం, ఆగస్టు 5: సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం ముస్లింలు జగదాంబ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్ర విశాఖ ముస్లింల జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారం సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ముస్లింలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఏ రెహ్మాన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ముస్లిం హృదయాలను గాయపర్చేదిగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే అనేక రకాలైన నష్టాలుంటాయన్నారు. రంజాన్ మాసంలో యుపిఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ముస్లింలకు ఏమీ చేయాలో తెలియని అయోమయం నెలకొందన్నారు. హైదరబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ముస్లిం పెద్దలు, జేఏసి ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కట్టుబడి ఉంటూ రాజకీయ నాయకులు దీని కోసం తీవ్రంగా కృషి చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజన జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జహీర్ అహ్మద్, నజీర్, ఎకే ఖాన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జగదాంబ జంక్షన్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇక్కడ కొద్దిసేపు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ముస్లిం ప్రతినిధి బృందం జెసి ప్రవీణ్‌కుమార్‌కు వినితిపత్రం అందజేసింది.
సమైక్యాంధ్ర జెఎసి విద్యార్థుల ఆమరణ దీక్షల విరమణ
విశాలాక్షినగర్, ఆగస్టు 5: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు సోమవారం కెజిహెచ్‌లో దీక్షలు విరమించారు. ఆంధ్ర యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు విద్యార్థులను పరామర్శించి నిమ్మరసం ఇచ్చి విద్యార్థులను దీక్షలు విరమింప చేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవింద రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం శాంతియుత పోరాటాలు చేస్తామన్నారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులు, విద్యార్థి నాయకులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించ డానికి దీక్షలు విరమించామన్నారు. తాము చేపట్టిన దీక్షలకు సంఘీభావం తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎయు ఆచార్యులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది సహకారం మరువలేని దన్నారు. సమైక్యాంధ్ర యువజన జెఎసి రాష్ట్ర కన్వీనర్ ఆరేటి మహేష్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా విశాఖ నగరంలో భారీ సభ ఏర్పాటుకు రాజకీయ పక్షాల ప్రతినిధులు, ఎన్జీవో సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలతో చర్చలు జరుపుతున్నా మన్నారు. జెఎసి నాయకులు బి.కాంతారావు, టి.సురేష్ దీక్షలు విరమించారు. ఈ కార్యక్రమంలో ఎయు రెక్టార్ ఆర్‌కెవిఎస్ రాజు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కట్టా రామ్మోహన రావు, కెజిహెచ్ డాక్టర్లు ఎం.మధుసూధన బాబు, శివకుమార్, విజయ శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర బంద్ విజయవంతం
మునగపాక, ఆగస్టు 5: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాలేజీ విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన మండల బంద్ పూర్తిస్థాయిలో విజయవంత మైంది. మునగపాకలో తెల్లవారు 4గంటల నుండి మా జీ సర్పంచ్ పెంటకోట సత్యనారాయణ, ఆడారి గణప తి అచ్చింనాయుడు, ఆడారి మహేష్, పెంటకోట రా ము, దాడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో అనకాపల్లి - పూడిమడక మెయిన్‌రోడ్డులో రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. అచ్యుతాపురం మండలంలో బ్రాండిక్స్‌లో విధుల కోసం రోజూ వేలాదిమంది ఉద్యోగులు వెళుతుంటారు. తెల్లవారు నుండే ఆందోళనకారులు మునగపాకలో బస్సులను నిలిపివేయడంతో బస్సులు నిలిచిపోయి మునగపాక నుండి అనకాపల్లి బైపాస్‌రోడ్డు వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆటోలను, వాహనదారులను ఎక్కడికక్కడే ఆందోళనకారులు అడ్డగించి తమ నిరసన వ్యక్తం చేశారు. మునగపాకలోనూ, ఒంపోలు, నాగులాపల్లి, తిమ్మరాజుపేట ఇతర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేసి ఉద్యమాన్ని ఉద్ధృత రూపంలో నడిపించారు. శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీస్థాయిలో బలగాలను మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుండి బస్సులు నిలుపుదల చేయడంతో బ్రాండిక్స్ బస్సుల్లో ఉద్యోగులు చిక్కుకుపోయి ఆకలితో అలమటించారు. తెల్లవారు నాలుగు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బంద్ పూర్తిస్థాయిలో కొనసాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య, సహకార బ్యాంక్‌లు, హోటళ్లు, పాఠశాలలు, కళాశాలలు స్వచ్చందంగా మూసివేసి బంద్‌కు సహకరించాయి.
రాహూల్ కోసమే రాష్ట్రం ముక్కలు
* సమైక్యాంధ్ర కోరుతూ టిడిపి ఆందోళన
అనకాపల్లి, ఆగస్టు 5: భారత ప్రధాని పదవిని తన కుమారుడు రాహూల్‌గాంధీకి కట్టబెట్టే రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలుగా చేసి తెలంగాణ ఇచ్చేందుకు సోనియాగాంధీ సిద్ధపడ్డారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. సమైక్యాంధ్ర కోరుతూ అనకాపల్లి అసెంబ్లీ టిడిపి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తున ఆందోళనలను అనకాపల్లిలో నిర్వహించారు. నెహ్రూచౌక్ జంక్షన్‌లో రాస్తారోకో, మానవహారం, పట్టణంలో నిరసన ప్రదర్శన తదితర ఆందోళనలు చేపట్టారు. రింగురోడ్డు జంక్షన్‌లో టిడిపి నాయకులు, కార్యకర్తలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీమంత్రి బండారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వనరులతో అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను తెలంగాణ కు ధారాదత్తం చేయడం అన్యాయమన్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్న కెసిఆర్‌ను వెంటనే అరెస్టు చేయకుండా ప్రభుత్వం తాత్సార వైఖరిని అవలంబించడం తగదని జిల్లా టిడిపి అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు అన్నారు. అనకాపల్లి దేశం సమన్వయకమిటీ సభ్యులు బుద్ద నాగజగదీష్, డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించేవరకు తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరు సాగిస్తుందన్నారు. సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపిలు తమ పదవులకు రాజీనామాలు చేసి రుజువు చేసుకున్నారన్నారు. అసెంబ్లీ టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ ఎంపిపిలు నిమ్మదల త్రినాథరావు, రొంగలి శ్రీరామ్మూర్తి, బోడి వెంకట్రావు, మాజీ జెడ్పీటిసి పొన్నగంటి నూకరాజు, బొలిశెట్టి శ్రీనివాసరావు, యల్లంకి సత్తిబాబు, పట్టణ తెలుగుయువత అధ్యక్షులు మళ్ల సురేంద్ర ఆందోళనలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా
భారీ సమైక్య ర్యాలీ
పాడేరు, ఆగస్టు 5: సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐ.టి.డి.ఎ. కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ సినిమాహాల్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, మెయిన్‌రోడ్డు మీదుగా ఎం.పి.డి.ఒ. కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమైక్యాంధ్రపై చేసిన నినాదాలు పట్టణంలో హోరెత్తాయి. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నిన యు.పి.ఎ. చైర్‌పర్సన్ సోనియా గాంధీ తన దేశమైన ఇటలీకి వెళ్ళిపోవాలని, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ డౌన్‌డౌన్, సమైక్యాంధ్ర వర్థిల్లాలి, హైదరాబాద్ అందరిదీ, గిరిజన మంత్రి బాలరాజు రాజీనామా చేయాలనే పలు డిమాండ్లతో ఆందోళనకారులు నినాదాలు చేశారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నాయకులు, గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల సహకారంతో ప్రెస్ క్లబ్ తలపెట్టిన సమైక్యాంధ్ర ర్యాలీ విజయవంతమైంది. స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాయకులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు క్షీరాభిషేకం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువలన తెలుగుజాతి నాశనమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఏకతాటిపై ఉన్న తెలుగువారిని రెండుగా చీల్చి తెలుగు ప్రజల మధ్య ఢిల్లీ పెద్దలు చిచ్చు రేపారని వారు ఆరోపించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ముందుకు వచ్చి అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధం కావాలని వారు డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాలుపంచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నాయకులు బొర్రా నాగరాజు, రొబ్బి రాము, చీకటి మధు, కొట్టగుళ్లి సుబ్బారావు, పి.పాండురంగస్వామి, సురేష్‌కుమార్, గిరిజన ఉద్యోగుల సంఘం కార్యదర్శి రూడి అప్పారావు, ప్రతినిధులు పి.సత్యనారాయణ, జి.వెంకటేశ్వరరావు, బూసిన నాగరాజు, జి.శంకరరావు, గురునాథ్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, శ్రీ కృష్ణాపురం, తలారిసింగ్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు
సీలేరు, ఆగస్టు 5: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు చిత్రకొండ పోలీస్ స్టేషన్ సరిహద్దులో ఆదివారం మావోయిస్టు మిలీషియా సభ్యుడును అరెస్ట్ చేసి ఆరు తుపాకు లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో సరిహద్దు ప్రాం తంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. బి. ఎస్. ఎఫ్. పోలీసు బలగాలు ఎ.ఓ.బి. సరిహద్దుల్లో గిరిజన గ్రామాలకు వెళ్లి మావోయిస్టులు, మిలీషియా స భ్యుల ఆరా తీస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు మిలీషియా సభ్యులుగా వ్యవహరిస్తున్న వారి వివరాలు సేకరించి వారి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఝాన్‌బాయ్,బలిమెల ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలను తనిఖీ చేసి విడిచి పెడుతున్నారు. మావోయిస్టు మిలీషియా సభ్యులుగా అనుమానం ఉన్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరం అయ్యాయి.
సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతం
అరకులోయ, ఆగస్టు 5: రాష్ట్ర విభజన నిరసనగా అరకులోయ పట్టణంలో సోమవారం చేపట్టిన ఆందోళన ఉగ్రరూ పం దాల్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఐక్య కార్యచరణ సమితి (జె. ఎ.సి.) ఆధ్వర్యంలో అన్ని వర్గాల వారు రోడ్డు ఎక్కి ఆందోళన చేపట్టారు. ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వి ద్యార్థులు, రాజకీయ పార్టీల నాయకు లు, గిరిజనులు, కార్మికులందరూ ఏకమై సమైకాంధ్ర కోరుతూ నిరసన ప్రదర్శన, రాస్తారోకో, మానవహారం, ధర్నా నిర్వహించారు. సమైకాంధ్రకు మద్దతుగా చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచి సమైక్యవాదులు ప్రధా న కూడళ్ల వద్ద తిష్టవేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రైవేట్ వాహనాలను నడవకుండా మోటారు, ఆటో యూనియన్ సభ్యులు పూర్తి సహకారా న్ని అందించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలతోపాటు సినిమాహాలు, పెట్రోల్ బంక్, వ్యాపార దుకాణాలను మూయించివేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ విధులను, విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోగా, బ్యాంకులలో లావాదేవీలు స్తంభించిపోయాయి. దుకాణాలు మూతపడడంతో నిత్యావసర సరుకులు దొరక్క గ్రామాల నుండి మండల కేంద్రానికి వచ్చిన గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
స మైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా యు.పి.ఎ. చైర్‌పర్స్‌న్ సోనియాగాంధీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె సిఆర్.కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భం గా పలువురు సమైక్యవాదులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వె నక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విభజన చేస్తున్నట్టు కేం ద్రం తీసుకున