Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆలోచనను ఖండించటమూ, అంగీకరించటమే!

$
0
0

‘నా ఆలోచనను, నేను కాదనుకోగలనా?’ అని మనలోకి మనం చూసుకోగలిగి ‘గలను’ అన్న సమాధానాన్ని అందుకోవటం, అందుకున్న సమాధానాన్ని అంగీకరించటం, అంగీకరించిన అంశానికి అనుకున్నంత కాలం కట్టుబడి ఉండటం జరగాలంటే మనకు కొంత దమ్ము ఉండాలి.. మనలో పట్టుదల ఉండాలి. ఈ రెంటినీ మించి ‘నిలదొక్కుకోగలం’ అన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో ఉంటే కనక సెల్ఫ్ డినయల్ సులభసాధ్యమే.
జీవన యానంలో సలహాలు తీసుకోవటం తప్పు కాదు.. సలహా లివ్వటమూ నేరం కాదు. సలహా లిచ్చినంత మాత్రాన అవతలి వారు మారిపోతారనీ కాదు. మన మాట వారిని ఆలోచింపజేస్తుంది. మన మాటే నెగ్గాలనే తత్వానికి దూరం కాగలిగితే సెల్ఫ్ డినయల్ అనేది మంచి పరిణామానికే దారి తీస్తుంది.
పైగా మన ఆలోచనను మనమే కాదనుకుని ఒక నిర్ణయానికి రావటం వల్ల, చోటు చేసుకున్న మంచి పరిణామాల వల్ల సంపూర్ణంగా, సంతృప్తిగా జీవించటం సాధ్యమవుతుంది. మన ఆలోచనలను మనమే కాదనుకోవటం వల్ల మనం నష్టపోలేదు లాభపడ్డామన్న భావన చోటు చేసుకుంటే ఉన్నదానితో, వర్తమానంతో తృప్తి చెందవచ్చు. సెల్ఫ్ డినయల్ కారణంగా కొన్ని సందర్భాలలో మనల్ని మనం ఖండించుకుంటున్నా అది సెల్ఫ్ ఆక్సెప్టెన్సీనే అవుతుంది. అంటే మన ఆలోచనను మనమే ఖండించుకోవటమూ మనల్ని మనం అంగీకరించటమే.
పైగా సెల్ఫ్ డినయల్ కారణంగా-
* అసంబద్ధతలు తొలగి స్పష్టత ఏర్పడుతుంది.
* కన్‌ఫ్యూజన్ కనుమరుగై క్లారిటీ కళ్ల ముందుకొస్తుంది.
అంతేకానీ మన ఆలోచనను మనమే కాదనుకుంటున్నామన్న అపరాధ భావనకు గురి కాకూడదు. ఇది ఆత్మగౌరవాన్ని పెంచుకోవటానికి దారి తీయాలే కానీ అపరాధ భావనతో వేగిపోకూడదు. పైగా ఇది ఆత్మవిశ్వాస ప్రతీక. మొత్తానికి మన నుండి పుట్టుకొచ్చిన కొన్ని భావాలను ఆసక్తులుగా మలచుకోకుండా ‘కాదు’ అనుకుని సంయమనంతో వర్తించటం వల్ల ఈ సంతృప్త జీవనం సాధ్యమవుతుంది. దీనికంతటికీ మనం చేయవలసిందల్లా వాస్తవాన్ని అంగీకరించటమే.
ఉజ్వల భవిష్యత్తు కోసం మన ఆలోచనలను మనకు మనంగా కొన్ని సందర్భాలలో తోసిపుచ్చాల్సిందే! వర్తమాన వ్యామోహాల నుండి బయటపడాల్సిందే!! మంచి మనుగడ కోసం రాజీ పడాల్సిందే!! శాశ్వత విలువల ముందు తాత్కాలిక వ్యామోహాలు, విలాసాలు లెక్కలోకి రావు కదా. ఒక విధంగా, ఇటువంటి వర్తనాన్ని కొందరు అననుకూల జీవన దృక్పథంగానూ, ఇంకొందరు సానుకూల జీవన దృక్పథంగానూ పరిగణిస్తుంటారు. మనల్ని మనమే కాదనుకోవటం వల్ల మనపై మనకే ఏహ్య భావం కలిగే అవకాశం ఉందన్నది మరి కొందరి అభిప్రాయం.
ఏది ఏమైనా మన ఆలోచనలలో కొన్నింటిని మనమే తుంగలో తొక్కటం వల్ల-
* కొన్ని అననుకూల పరిస్థితులు, విపత్కర సందర్భాల నుండి క్షేమంగా బయటపడగలుగుతాం.
* కొన్ని ఛాలెంజెస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం.
* పోరాడే తత్వం మనకు వొంటబడ్తుంది.
కొంతకాలం ఒక ఆలోచనను తోసిపుచ్చగలగటం మంచిదే కానీ ఆ తోసిపుచ్చటం అనేది శాశ్వత పంథా కాకూడదు. ఒక విధంగా తోసిపుచ్చటాన్ని కాస్త జాగు చేయటంగానే పరిగణించాలి. మనం దేన్నయినా శాశ్వతంగా దూరంగా ఉంచ ప్రయత్నిస్తున్నామంటే మానసికంగా బలహీనంగా ఉన్నట్లే. సెల్ఫ్ డినయల్‌ను సమయ సందర్భాలను బట్టి తాత్కాలిక ఉపశమనంగానే పరిగణించాలి.
* సామాన్యంగా వొత్తిడికి లోను చేసే సందర్భాలకు దూరంగా ఉండటానికి సెల్ఫ్ డినయల్ ఉపకరిస్తుంది.
* మనం జీవన పోరాటంలో తట్టుకోలేని ఆలోచనలను త్యజించటానికి సెల్ఫ్ డినయల్ సాధనమవుతుంది.
దేన్నయినా మనం వద్దనుకుని పోస్ట్‌పోన్ చేయగలమే కానీ వాస్తవాన్ని ఎప్పటికయినా ఎదుర్కోక తప్పదు. సెల్ఫ్ డినయల్ వల్ల వాస్తవాన్ని అంగీకరించటానికి కాస్త వ్యవధి దొరుకుతుంది. అంతే. అంతేకాదు, సెల్ఫ్ డినయల్ పేరిట పైకి మనం ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ మనల్ని మనం అవలోకించుకోక తప్పదు.
ఆ అవలోకనతో-
- మనం వెనకడుగు వేస్తుండటానికి కారణం ఏమిటి?
- మనం ఆచరణశీలురం కాకపోవటానికి మనలో గూడుకట్టుకున్న అననుకూల దృక్పథాలు ఏమిటి?
- మన భయాలను, భావోద్వేగాలను వ్యక్తపరచ లేకపోవటానికి కారణాలు ఏమిటి?
- మన ప్రవర్తన సవ్యంగా ఉంటోందా?
- మనల్ని మనం సరియైన రీతుల నిర్వచించుకో గలుగుతున్నామా?
- మన లోపాలను, బలహీనతలను కనీసం ప్రాణ స్నేహితుల వద్ద కాకపోయినా మనలో మనం ఆవిష్కరించుకో గలుగుతున్నామా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు మననుండే రావాలి. అయితే సమాధానాలను రాబట్టుకునే విషయంలో అందిన సమాధానాలను స్వీకరించాలే తప్ప, ఆ సమాధానాలతో మనల్ని మనమే కాదనుకోకూడదు. ఈ సందర్భంలో మాత్రం సెల్ఫ్ డినయల్ పనికిరాదు.
మహానుభావులతో ఓ రోజు

వినదగు
english title: 
a
author: 
-డా.వాసిలి వసంతకుమార్ 9393933946

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>