సృష్టికి మూలకారణం శక్తి. త్రిమూర్తులలో చైతన్యస్వరూపిణిగా, సకల జీవకోటిలో చేతన స్వరూపంగా అలరారే ఆ శక్తి నే అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి. ఈ శక్తే సృష్టి స్థితిగతులకు ఆధారం. అంతటా వ్యాపించిన ఆ శక్తిని వేదాలు పరమేశ్వరిగా కీర్తించాయ. ఈ తల్లికి ఉన్న అనంతనామాలు అనంతార్థాలకు ప్రతీకలు. ఈ అఖిలాండేశ్వరి శ్రావణమాసంలోని మంగళవారం నాడు గౌరీగా ఆరాధనలందుకుంటుంది. శివునికోసం కఠోరతపస్సు ఆచరించిన ఈ సుకుమారి పార్వతి శరీరం తపోగ్నిచేత నల్లబడిందట. ఆమెను చూచిన బోళాశంకరుడు కాళీ అని పిలిచాడట. దాంతో ఆ తల్లి దానికి అలిగి చిరుకోపాన్ని ప్రదర్శించింది. పరమశివుడు ఆ అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి గంగా భిషేకం జరిపించాడట. దాంతో అమ్మ మెరుపు తీగలాగా మెరిసిపోయిందట. అపుడు ఆమెను గౌరీగా శివుడు అభివర్ణించాడని ఓ పురాణకథ ప్రాచుర్యంలో ఉంది. దీనికి తగ్గట్టుగా శ్రావణ మంగళవారం నాడు స్ర్తిలందరూ మంగళగౌరిని తెల్లని పూలతో ఆరాధించి, ఆ తల్లికి శే్వతాంబరములు అలంకరించి తెల్లని వరిపిండితో చేసిన ప్రమిదలలో దీపారాధనచేసి కొలుస్తారు. ఈ తల్లినే దుర్గమాలను దూరం చేస్తుందని దుర్గగా పిలిచి అర్చిస్తారు. ఐశ్వర్యాన్నిచ్చి జీవితాన్ని ఆనందప్రదం చేస్తుందని ఐశ్వర్యకారణి లక్ష్మిగానూ కొలుస్తారు.
సర్వశ్రేయోదాయకమూ, సర్వసంపత్కరం అయన మంగళగౌరి వ్రతం పేరిట మంగళగౌరిని మహిళులందరూ శ్రావణ మంగళవారం పూజి స్తారు. ఈ పూజావిధానంలో వ్రతకథలో సుశీల ఈ దేవిని అర్చించి తన భర్తఅల్పాయుస్సును పూర్ణా యుస్సుగా మార్చుకొంది. తన అత్తమామలు పూర్వకర్మఫలంగా అనుభవిస్తున్న దృష్టి దోషాన్ని కూడా పోగొట్టింది. తనకు సర్వసౌభాగ్యాన్ని ఇచ్చిన ఆ వ్రతరాజాన్ని సర్వులకు తెలియచెప్పింది. ఈ వ్రతంలో భాగంగా పూజా మందిరంలో తూర్పుదిక్కుగా మండపం అమరుస్తారు. ఆ మండపంపై కలశం పెట్టి దాని మీద మంగళగౌరీని ఆవాహన చేస్తారు. ఆ మంగళగౌరిని షోడోపచారాలతో అర్చిస్తారు. తమతమ శక్తికొద్దీ, ఇంటి ఆచారం ప్రకారం తయారు చేసిన భక్ష్యభోజనాలు నివేదన చేస్తారు. కర్పూర హారతి, మంత్రపుష్పం సమర్పించి, ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. అనంతరం భక్తిశ్రద్ధలతో సౌభాగ్య సిద్ధికోసం‘‘మంగళే మంగళధారే....మాంగళ్యం దేహిమే సదా’’
అంటూ ఒక తోరణం గౌరీదేవికి సమర్పించి, ఒకటి కుడి చేతికి కట్టుకుంటారు. తద్వారా దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలపై నుంచి కత్తికి కాటుక పడుతూ వ్రత కథ వింటారు. ఆ తరువాత కత్తికి పేరుకొన్న కాటుకను ఆవునేతితో రంగరించి వ్రతం చేసిన స్ర్తితో పాటుగా ముత్తెదువులందరూ కళ్ళకు ఆ కాటుకను తీర్చి దిద్దుకొంటారు. ఈ కాటుక వలనే పూర్వకర్మదోషాలు దూరం అవు తాయని అంటారు.
సాయంత్రంపూట పదిమంది ముత్తెదువులను పిలిచి దక్షిణతాంబూలాలను ఇచ్చి మమ్ము చల్లగా చూడమని చలిమిడి ముద్దలు వాయనాలుగా ఇచ్చి నమస్కరిస్తారు మహిళలు.
ఈరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీదేవికి నీరాజనాలు సమర్పించి రకరకాల వంటలు చేసి అమ్మకు నైవేద్యంపెట్టి ఆ తరువాత వారు ఆ ప్రసాదాన్ని సేవించి ఉపవాసవిరమణ చేస్తారు.
సృష్టికి మూలకారణం శక్తి. త్రిమూర్తులలో చైతన్యస్వరూపిణిగా,
english title:
m
Date:
Monday, August 12, 2013