నమోస్తు నాళీక నిభాననాయై , నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సౌమామృతసోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై
అంటూ ఆదిశంకాచార్యులచే నుతించిబడిన మహాలక్ష్మిదేవి చతుర్భుజుడైన జగత్ప్రభువైన వైకుంఠవాసునికి ఇల్లాలు. ఈమె మొట్టమొదట వైకుంఠంలో నారాయణుని చేత పూజలందుకుంది. ఆ తర్వాత దేవతలు, స్వాయంభువ మనువు, తర్వాత ఋషులు, మునీంద్రులు, మానవులు ఇలా అందరూ అర్చించడం జరుగుతూ వస్తోంది. ఈమే స్నిగ్థదృష్టులతో సమస్త విశ్వాన్ని లక్షిస్తుంది గనుగ ఈ దేవిని మహాలక్ష్మి అన్నారని దేవీ భాగవతం చెప్తోంది. ఇటువంటి ఈ తల్లే సర్వసంపత్స్వరూపిణియై స్వర్గలక్ష్మిగా, నాగలక్ష్మిగా, రాజ్యలక్ష్మిగా, గృహలక్ష్మిగా, కామధేనువుగా, దక్షిణాదేవిగా, క్షీరసముద్ర రాజతనయగా, శోభాలక్ష్మిగా, తేజోలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, వీరలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా,్ధనలక్ష్మిగా, ఆదిలక్ష్మిగా ఇలా మహాలక్ష్మి ఎన్నో అంశావతారానుధరించింది.
ఆ తల్లిని శ్రావణమాసంలో పౌర్ణమినాటికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మిగా భావించిపూజిస్తే సకల సౌభాగ్యాలుకలుగుతాయని అంటారు. ఈ లక్ష్మివైభవాన్ని వేదాలు, పురాణాలు వేనోళ్ల కీర్తిస్తున్నాయ. ఈ తల్లి జగద్వ్యాపకాన్ని విష్ణుపురాణం వర్ణిస్తుంది. అందుకే సంపదలకు, సామ్రాజ్యాలకు, విద్యలకు, కీర్తిప్రతిష్ఠలకు, సర్వశాంతులకు, యశస్సులకు మూలకారణమైన ఈ తల్లిని శ్రావణమాసంలో పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం నాడు పూజిస్తే సర్వసౌభాగ్యాలు సమకూరుతాయని పరమశివుడు పార్వతికి చెప్పాడు.
‘‘్ధవళతరాంశుక గంధమూల్య శోభే’’, అంటూ వరలక్ష్మీదేవికి ఇష్టమైన శే్వత వస్త్రాలని కట్టి, శే్వత వర్ణ పుష్పాలతో, శే్వతశ్రీ గంధంతో, పాలు, పాయసంతో, అధికంగా తెలుపు రంగుకు ప్రాధాన్యతనిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించినవారికి కోరిన కోరికలు ఈడేరుతాయ నమ్మకం. అందుకే వరలక్ష్మిదేవి పూర్వం మగధ దేశంలో ‘కుండిన’ అనే పట్టణంలో నివాసముంటున్న చారుమతీదేవి అనే పుణ్యస్ర్తికి శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి స్వప్నంలో కనబడి ‘‘వరలక్ష్మీ వ్రతం’’ ఆచరించమని ఆదేశించింది. ఆ చారుమతి వరలక్ష్మీదేవి ఆదేశానుసారంగా శ్రావణ పౌర్ణమినాటికి ముందు వచ్చే శుక్రవారంనాడు తోటి బంధువులతో, ఇరుగు పొరుగులతో కలసి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం ఆచరించింది. ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి నానావిధ ఫల, భక్ష్య భోజ్యాలను నివేదన చేసింది. ఆ తర్వాత చారుమతి శాస్త్రోక్తంగా వ్రతాన్ని నిర్వహించిన పురోహితునికి దక్షిణ తాంబూలాదులను సమర్పించి సంతృప్తిపరిచింది. ఆమె చేసిన వ్రతానికి తృప్తిచెందిన వరలక్ష్మిదేవి చారుమతి కోరికలన్నీ తీర్చింది. అంతేకాక తనతోపాటుగా పూజచేసుకొన్నవారికి, వ్రతాన్ని చూడడానికి వచ్చినవారికి కూడా సకలైశ్వర్యాలను ప్రసాదించింది. ఇలా పుణ్యస్ర్తి అయిన చారుమతి ద్వారా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి లోకానికి అందించిన శ్రీ వరలక్ష్మీవ్రతాన్ని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు తెలియజేసినట్లు వ్రతకథ చెప్తోంది. ఈ వ్రతంలో ‘తోరపూజ’ అనునది ప్రధానమైనది. తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది చోట్ల ముడుల్ని వేసి పుష్పాల్ని మధ్య మధ్యలో కట్టిన సూత్రాన్ని కుడిచేతికి కట్టుకొని ‘అమ్మా! వరలక్ష్మీదేవి! మాకు పుత్ర పౌత్రాభివృద్ధినీ, ఆరోగ్యంతో కూడిన ఆయుష్షును ఇవ్వవలసింది’ అని ప్రార్థిస్తారు.
నమోస్తు నాళీక నిభాననాయై , నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
english title:
v
Date:
Monday, August 12, 2013