వృద్ధులు, వికలాంగులు, పసి పిల్లల తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకొనేందుకు ఉదయం 10.గం.కు, మధ్యాహ్నం 3 గం.కు రాత్రి 10 గం.లకని తిరుమల స్వామివారి పాలకవర్గం సమయం కేటాయించారు. ఈ క్యూ కూడా చాలా పెద్దదిగా వుండి ఆరుబయట ఎంతకు ఎండుతూ వానకు తడుస్తూ నిర్దేశించిన సమయాలకు ముందు 2 లేక 3 గంటల ముందు క్యూలో నిల్చోవలి వస్తోంది. ఇంత సమయం వీరు నిల్చొని ఉండటం చాలా కష్టంగా వుంది. ఐ.డి గుర్తింపు తర్వాతే వీరు ఒక వంద మంది కుర్చీలో దర్శనానికి వదిలేంతవరకు కూర్చొ నే వీలుంది. కాని 300-400 మంది క్యూలో బయట నిల్చోవలసి వున్నది. తనిఖీ సిబ్బంది నిర్దేశించిన సమయంవరకు వచ్చిన వారినే అనుమతిస్తారు. మిగతా వారు తర్వాతి దర్శనం వరకు వేచి వుండవలసిందే. ఇలా దేవస్థానం సౌకర్యం కల్పించినా, కనీసం మూడునాలుగు గంటలు దర్శనానికి శ్రమపడాల్సి వస్తుంది. ఇంకో షెడ్డు ఒక వంద లేక నూట ఏబది మందికి సరిపడా నిర్మించి కూర్చొనే వసతి కల్పించాలి. తర్వాత ఆలయంలోపల ముందు వారిని నెట్టుతూ పరుగులు తీయకుండా నిరోధించాలి. అలాగే దర్శనం చేసుకొంటూ ముందుకు సాగుతున్న వారిని వెనుక వారు నెట్టకుండా ఏర్పాటుమెరుగుపర్చాలి.
- గర్నెపూడి వెంకట రత్నాకరరావు, వరంగల్
ప్రధాని పదవికి మోడీ సరైన వ్యక్తి
ప్రస్తుత దేశ కాల మాన పరిస్థితులను చక్కదిద్దాలంటే నరేంద్రమోడీ ప్రధానిగా సరైన వ్యక్తి. చాపక్రింద నీరులా క్రైస్తవం, ముస్లిం తీవ్రవాదం ముంచుకొస్తున్న తరుణంలో సరైన వ్యక్తి దేశానికి కావాలి. నిజమైన లౌకికవాది నరేంద్రమోడీయేనని చెప్పక తప్పదు. హిందూ వ్యతిరేకులంతా లౌకికవాదులు కాదు. ఏ లౌకికవాదైనా సరే హిందూ సమాజాన్ని గౌరవిస్తూ, ఇతర మతాలను సమానంగా చూసేవాడే నిజమైన సెక్యులరిస్టు. అలాంటి వ్యక్తి నరేంద్రమోడీయే! గుజరాత్‌లో అనేకమంది ముస్లింలను రాజకీయ పదవుల్లోకి తెచ్చింది మోడీగారే! నరేంద్రమోడీ నీతినియమాలకు కట్టుబడిన వ్యక్తి. ఆయన సంపాదించింది శూన్యం. ఆయన సంపాదించింది ప్రజాభిమానం మాత్రమే. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచి, దాచిన వ్యక్తుల్లో ఆయన్ను చేర్చేదానికి వీలు లేదు. అందువల్లనే ఈ దోపిడీదారులంతా ఒక్కటై, మోడీని నిరోధించాలని చూస్తున్నారు. దేశ క్షేమానికే గాదు, హిందూ మత రక్షణకు కూడ ఆయన సారధ్యమే దేశానికి కావాలి. ప్రజలందరు మోడీ వెనుకేవున్నారు. దేశక్షేమం కొరకు బిజెపికి సంపూర్ణ మెజారిటీనిచ్చి, మోడీని ప్రధానిగా చూడాలి. మన రాజ్యాంగాన్ని పూర్తిగా తిరగరాయాలి. ప్రజలందరికి ఒక్కటే రాజ్యాంగము కావాలి. అదే దేశానికి రక్ష.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
వ్యాపార జిమ్మిక్కులు
టాటా ఐడియావారు 77 రూ.ల ఎస్‌ఎమ్‌ఎస్ కార్డు వేయించుకుంటే నెల రోజుల్లో వెయ్యి ఎస్‌ఎమ్‌ఎస్‌లు చేసుకోవచ్చని మెసేజ్ పంపించారు. ఈ ఆఫరేదో బాగుందని కార్డు వేయించుకుంటే ప్రతి ఎస్‌ఎమ్‌ఎస్‌కు మెయిన్ బ్యాలెన్స్‌లోంచి రూపాయి కట్ అవుతున్నది. కష్టమర్ కేర్ నెంబరు దొరకటమే కష్టం. దొరికాక వారు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపడటం నా వంతైంది. రోజుకు వందకు పైగా ఎస్‌ఎమ్‌ఎస్‌లు చేస్తే అట్లాగే కట్ అవుతుందని, వంద ఎస్‌ఎమ్‌ఎస్‌లు చేసే తీరికా, ఓపికా ఎవరికున్నాయి? వారు చెప్పిందే వేదం. నష్టపోయిందెవరయ్యా అంటే కష్టమర్. కష్టమర్‌ని తేలిగ్గా బురిడీ కొట్టించింది ఘనత వహించిన కంపెనీ.
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
రైలు ప్రయాణికుల యిబ్బందులు
ప్యాసింజర్ రైళ్ళలో ప్రయాణికులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. సీట్లు శుభ్రంగా వుండవు. కుషన్ సీట్లయితే అక్కడక్కడ చీలికలు పేలికలుగా వుంటాయి. కంపార్టుమెంట్లలో కూడ వేరుశనగ బొప్పులు, అరటి తొక్కలు పడివుంటాయి. ఫ్యాన్లకు స్విచ్‌లు సరిగా వుండవు. ఇంక మరుగుదొడ్ల విషయానికొస్తే ఒక్కొక్కప్పుడు నీళ్ళు సరిగా వుండవు. దుర్గంధ భరితంగా ఉంటాయ. మరుగుదొడ్ల తలుపులు సరిగా వుండవు. లోపలి గడియలు వుండవు. వుండినవి సరిగా పడవు.పై సమస్యలన్నింటికి పరిష్కారం కనుగొనండి.
- సాయిరామానందస్వామి, పొదలకొండపల్లె
మనం జాతీయ వాదులం
శతాబ్దాల తరబడి మన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు ఇన్ని మతాలవారు కలసి మెలసి సహ జీవనం చేస్తున్న ఈ పుణ్యభూమిలో కేవలం ఒక మతం వాడిని అదే హిందూ జాతీయవాది అని చెప్పుకోవటం దురదృష్టకరం. మనమందరం భారత జాతీయవాదులం అని తెలుసుకుంటే బిజెపి పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీకి మంచిది.
- యం.పి.విజయకుమార్, సికిందరాబాద్
వృద్ధులు, వికలాంగులు, పసి పిల్లల తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకొనేందుకు
english title:
m
Date:
Wednesday, August 28, 2013