టోక్యో, సెప్టెంబర్ 21: జపాన్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు లీ చాంగ్ వెయ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అతను శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో ఐదో సీడ్ గుయెన్ తియెన్ మిన్ (వియత్నాం)పై 21-10, 21-5 తేడాతో కేవలం 29 నిమిషాల్లోనే విజయం సాధించి, టైటిల్ నిలబెట్టుకునే సత్తా తనకు ఉందని నిరూపించాడు. తుది పోరులో అతను స్థానిక ఫేవరిట్ కెనిచి తాగోను ఢీ కొంటాడు. రెండో సెమీ ఫైనల్‌లో తాగో 21-12, 21-12 ఆధిక్యంతో చైనా క్రీడాకారుడు గవో హుయాన్‌పై గెలుపొంది ఫైనల్‌లో స్థానం సంపాదించాడు. కాగా, మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అకనె యమాగుచీ, షిజుకా ఉచిదా తలపడనున్నారు. ఇద్దరూ జపాన్ క్రీడాకారిణులే కవాడం విశేషం. తొలి సెమీ ఫైనల్‌లో ఉచిదా 21-17, 21-14 తేడాతో ఇహాన్ వాంగ్‌ను 45 నిమిషాల్లోనే ఓడించి ఫైనల్ చేరింది. మరో సెమీ ఫైనల్‌లో జు ఇంగ్ తాయ్‌తో తలపడిన అకనె 35 నిమిషాల వ్యవధిలోనే, 26-24, 21-14 స్కోరుతో విజయాన్ని నమోదు చేసింది.
పురుషుల డబుల్స్ విభాగంలో బియావో చయ్, వెయ్ హాంగ్ 21-11, 15-21, 21-19 ఆధిక్యంతో అతి కష్టం మీద మథియాస్ బోయె, కార్‌స్టెన్ మోగెనె్సన్‌ను ఓడించగా, మహమ్మద్ అసన్, హెండ్రా సెతియావాన్ జోడీ 21-12, 28021, 21-18 స్కోరుతో జవన్ కాంగ్, చెంగ్ లియో జోడీపై గెలుపొంది ఫైనల్ చేరింది. మహిళల డబుల్స్ ఫైనల్‌లో జిన్ మా/జిన్‌హువా తాంగ్ జోడీతో క్రిస్టియానా పెడెరస్సెన్/కమిలా రైటర్ జూ తలపడతారు. జిన్ మా, తాంగ్ సెమీ ఫైనల్‌లో పియా జెబడియా బెర్నాడెత్, రిజ్కి అమెలియా ప్రదీప్తా జోడీని 17-21, 21-14, 21-12 తేడాతో ఓడించారు. మరో సెమీ ఫైనల్‌లో పెడెర్సన్, రైటర్ జూ జోడీ మిసాకీ మసుతొమో, అయాకా తకహషి జోడీపై 21-16, 21-14 ఆధిక్యంతో గెలుపొందింది.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో నాన్ జాంగ్, యునె్లయ్ జావో జోడీ 21-9, 21-8 స్కోరుతో చెంగ్ లియో, ఇజిన్ బవో జోడీపై సునాయాసంగా గెలుపొంది ఫైనల్ చేరింది. మరో సెమీ ఫైనల్‌లో చెన్ జూ, జిన్ మా జోడీ 21-17, 23-21 తేడాతో జొచిమ్ ఫిచెర్ నీల్సెన్, క్రిస్టినా పెడెర్సన్ జోడీని ఓడించి ఫైనల్ చేరింది.
జపాన్ ఓపెన్ బాడ్మింటన్
english title:
chang
Date:
Sunday, September 22, 2013