ఇంటర్నెట్ బ్రౌజర్లలో చాలా లేటుగా వచ్చినా అందరినీ అలరించింది గూగుల్ క్రోమ్ బ్రౌజరేనంటే అతిశయోక్తి కాదు. నెట్ బ్రౌజింగ్ సులభంగా వేగంగా చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తం. ఇందులో ఇతర బ్రౌజర్లలో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి. గూగుల్ సేవలు అన్నింటినీ పూర్తిగా, వేగంగా అందిస్తుంది. క్రోమ్ కోసం గూగుల్ ఆప్స్ కూడా చాలానే ఉన్నాయ్. ఇందులో యాడ్ ఫ్రీ సర్ఫింగ్ చేసుకొనే వీలునిచ్చే యాడ్ బ్లాక్ అనే యాప్, మీరు బ్రౌజింగ్ చేసేపుడు అవసరమనుకున్న స్క్రీన్ షాట్స్ తీసి పెట్టేందుకు అవ్ సం స్క్రీన్‌షాట్ అనే యాప్, స్పెలింగ్ చెక్ చేసి పెట్టే జింజర్ స్పెల్ చెకర్ ఆప్, ఫోటో ఎడిటింగ్ కోసం బీ ఫంకీ యాప్- ఇలా చాలానే ఉన్నాయ్. బ్రౌజింగ్ చేసేపుడు కోరుకున్న పేజీని అనువాదం చేసిపెట్టే ట్రాన్స్‌లేట్ యాప్ (మన భారతీయ భాషలకిది మినహాయింపు) కూడా ఉంది. అన్నట్టు యూ ట్యూబులో మనం చూసే వీడియోలను మన సిస్టంలో సేవ్ చేసుకోడానికీ యాప్ ఉంది. ఇవన్నీ వాడాలనుకుంటే సుబ్బరంగా గూగుల్ చేసి వాటిని మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు జోడించుకోవడమే తరువాయి.
తెలుసుకోండి
english title:
google chrome
Date:
Tuesday, September 24, 2013