అంటే -జాడీ బార్ మాట. చిన్నప్పుడెప్పుడో అమ్మమ్మో, నాయినమ్మో జాడీల్లో పచ్చళ్లు దాచిపెట్టిన దృశ్యం గుర్తుకొస్తుంది కదూ! ఆ జాడీల్లోని పచ్చళ్లు మధురిమలు కూడా నాల్కమీదకు గుర్తుకొస్తున్నాయి కదూ! కరెక్ట్, ఆ కానె్సప్ట్‌తోనే ఉక్రెయిన్‌లోని కీవ్‌లో ఓ జాడీ బార్ వెలిసింది. ఇలాంటిది ప్రపంచంలో ఇదొక్కటే. బార్‌కు వెళ్లడం రొటీన్. ఎప్పుడూ తాగని కాక్‌టెయిల్ టేస్ట్ చేయడమో, ఎప్పుడూ ఆర్డర్ చేయని ఫుడ్ తెప్పించుకోవడమో -కాస్త స్పెషల్. కానీ, ఉక్రెయిన్‌లోని ఈ జార్ బార్‌కు వెళ్లడమంటే సమ్‌థింగ్ స్పెషల్. ఎందుకంటే -అక్కడ కాఫీ.. కాక్‌టెయిల్, సోంప్.. సోడా, ఐస్‌క్రీం.. ఆవకాయ బిర్యానీ అన్నీ జాడీల్లోనే సర్వ్ చేస్తారు. జాడీల్లోనే తినాలి.. తాగాలి. చివరకు జాడీల్లోనే చేతులు వాష్ చేసుకోవాలి. విచిత్రం కదూ! అంతెందుకు బార్‌లోకి అడుగుపెట్టే డోర్ కూడా జాడీ ఆకారంలో ఉంటుందట. బార్‌లోని వాల్‌పేపర్స్ నిండా జాడీ ఆకృతులే ఉంటాయట. ఎటుచూసినా గ్లాస్ జార్‌లే తప్ప, గ్లాసులు, ప్లేట్లు, కప్పులు, స్పూనుల్లాంటి వస్తువులేమీ అక్కడ కనిపించవు. జార్ థీమ్ నచ్చితే ఎంజాయ్ చేయడానికి ఉక్రెయిన్‌కి ఓ ట్రిప్ వేసిరావొచ్చు. మనుషులు, వాళ్ల దుస్తులకు మాత్రం జార్ థీమ్ లేదులెండి.
భలే ప్రపంచం
english title:
bhale
Date:
Tuesday, September 24, 2013