వికారాబాద్, నవంబర్ 20: వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్‌లో గురువారం ఉదయం 9 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మండల అభివృద్ది అధికారి కె.వినయ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ హాజరవుతారని తెలిపారు.
గడప గడపకు వైకాపాను తీసుకెళ్లండి
చేవెళ్ల, నవంబర్ 20: గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును నమోదు చేసుకునేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని వైకాపా జిల్లా మాజీ అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి కోరారు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు కమిటీలు వేయాలని మండలాల అధ్యక్షులను ఆదేశించారు. గడప గడపకు వైకాపాను తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై వుందని, పార్టీ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు లేని తెలంగాణ ఇవ్వాలని అన్నారు. వైకాపా చేవెళ్ల ఇన్‌చార్జి ఆర్.సిద్ధేశ్వర్, ప్రతాప్‌రెడ్డి, కృష్ణయాదవ్, బల్వంత్‌రెడ్డి, రాజన్న, యాదిరెడ్డి పాల్గొన్నారు.
పెట్టుబడుల ఉపసంహరణపై హెచ్‌ఎఎల్‌లో కార్మికుల నిరసన
బాలానగర్, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వం హెచ్‌ఏఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరించాలని చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా గుర్తింపు యూనియన్ హెచ్‌ఎడబ్ల్యూ యూనియన్ బుధవారం నిరసన ఫ్రదర్శన చేపట్టారు. అనంతరం సంస్థ ప్రధాన గేటు ముందు పెట్టుబడుల ఉపసంహరణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సామ రామిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి 31నాటికి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయాలని డిపార్ట్‌మెంట్ ఆప్ డిజినె్వస్ట్‌మెంట్ కార్యదర్శి రవి మాథుర్ పరిశ్రమలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన నేపథ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఆధునీకరణ కోసం ప్రవేటు పెట్టుబడులు అవసరం లేదని ప్రభుత్వానికి ప్రతియేటా వందలకోట్ల నిధులు హెచ్‌ఏఎల్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వైఎస్‌ఆర్ ప్రసాద్ డిఎన్ సుదర్శన్, గణేష్, విజయప్రసాద్, వెంకటాద్రి, సత్యనారాయణ, విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఓటు ఆయుధంతో మంచి నాయకున్ని ఎన్నుకోవాలి
జీడిమెట్ల, నవంబర్ 20: ఓటు ఆయుధంతో మంచి నాయకున్ని ఎన్నుకోవాలని కూన కృష్ణగౌడ్, మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కూన శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.
బుధవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గాజులరామారం డివిజన్ రావినారాయణ రెడ్డి నగర్‌లో ఓటరు నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన పలువురికి దరఖాస్తులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఇంద్రసేనారెడ్డి, గోపాల్, మల్లేశ్, మొగులయ్య, సుంకప్ప, వర్మ, బాలరాజు, రాజిరెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.