మేడ్చల్, నవంబర్ 20: సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఎంపిడివో కార్యాలయంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులు, బంగారుతల్లి పథకం వర్తింపచేస్తున్నామని అన్నారు. నెలరోజుల వ్యవధిలో తెలంగాణకు కొత్త సిఎం వస్తారని జోస్యం చెప్పారు. సీమాంధ్రలో ఆధిపత్యం కోసం సిఎం కిరణ్, చంద్రబాబు, జగన్ ఆరాటపడుతున్నారని అన్నారు. 1256 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 539 మంది పెన్షన్, 491 మందికి రేషన్‌కార్డులు, 45 మందికి బంగారుతల్లి పథకం పత్రాలను అందించారు. కార్యక్రమాన్ని టిడిపి నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి అడ్డుకున్నారు. జైతెలంగాణ నినాదాలు చేశారు. వేదికపై సిఎం ఫ్లెక్సీని తొలగించడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కెఎల్‌ఆర్ ప్రసంగిస్తుండగా టిఆర్‌ఎస్ నాయకులు భాస్కర్ యాదవ్, సత్యనారాయణ, విష్ణుచారి, అజ్రత్‌ఖాన్, లాయక్‌అలీ చొచ్చుకవచ్చి ఫ్లెక్సీని తొలించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు అర్థం కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో వచ్చిన తల్లులు ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు రచ్చబండ కార్యక్రమానికి వస్తే ఊకదంపుడు ఉపన్యాయాలతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఊదరగొట్టారని, ప్రజలకు ఒరిగిందేమి లేదని సిపిఎం మండల కార్యదర్శి ఎర్ర అశోక్ విమర్శించారు.
తాగునీటి ఎద్దడిని పూర్తిగా నివారిస్తా
ఘట్‌కేసర్, నవంబర్ 20: గ్రామంలో తాగునీటి ఎద్దడిని పూర్తిగా నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ అన్నారు. పంచాయతి పరిధిలోని మైసమ్మగుట్ట కాలనీ ప్రజల కోసం ఇటీవల ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో వేసిన బోరు బావిని బుదవారం ఆయన ప్రారంభించారు. గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిని విడతల వారిగా పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంచాయతీ పరిధిలోని అన్ని కాలనీలకు కృష్ణా నీటిని అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడ సమస్యలు నెలకొన్న వెంటనే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు.
మైసమ్మగుట్ట కాలనీ అభివృద్దికి అన్ని రకాల చర్యలు తీసుకుంటానని ఆయన హమీ ఇచ్చారు. వార్టు సభ్యులు వెంకటేశ్, ఉప సర్పంచ్ నాగమణి, లక్ష్మయ్య కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక పరిపుష్టికి రుణాల పంపిణీ
తాండూరు, నవంబర్ 20: మహిళా సాధికారత, కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు బ్యాంకుల కోట్లాది రూపాయలను రుణాలుగా మంజూరు చేస్తోందని దక్కన్ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ సిహెచ్ సుందర్‌రాజ్ అన్నారు. బుధవారం దక్కన్ గ్రామీణ బ్యాంక్ రుణమేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్‌రాజ్ మాట్లాడుతూ మహిళా పొదుపు సంఘాలు, స్వయం సహాయక బృందాలు పొదుపు చేసే ప్రతి పైసా మహిళా సాధికారతకు దోహదపడుతుందని అన్నారు. మండలంలోని పైనెల్లి గ్రామంలో డిజిబి బ్యాంక్ ఖాతాదారుల సమావేశం నిర్వహించారు. కురుమ సంఘం గొర్రెల కాపరులకు రుణాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిఎం సుందర్‌రాజు, రీజినల్ మేనేజర్ బి.రాజారావు, పట్టణ, గ్రామీణ శాఖ మేనేజర్లు కె.శ్యాంసుందర్, వై.్భస్కర్‌రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్లు డి.శ్రవణ్‌కుమార్, కె.వెంకటేశ్ పాల్గొన్నారు. పట్టణంలోని సిసిఐ రోడ్డులోని డిజిబి శాఖలో జరిగిన ఖాతాదారుల సమావేశంలో జిఎం సుందర్‌రాజు, ఆర్‌ఎం బి.రాజారావు పాల్గొన్నారు. డిజిబి బ్యాంక్ సేవలను వివరించారు.
మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి
ఘట్‌కేసర్, నవంబర్ 20: మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటి సెల్ కన్వీనర్‌గా మండల పరిధి కాచివాని సింగారం గ్రామానికి చెందిన ఎస్‌కేఖలీల్, వైస్ చైర్మన్‌గా ఘట్‌కేసర్‌కు చెందిన ఎం ఏ రహమాన్, మండల మైనారిటి సెల్ కన్వీనర్‌గా ఎం డి ఖధీర్‌లను నియమిస్తు మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివాసంలో బుధవారం నియామక పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలు అన్ని రంగాలలో అభివృద్ది చెందేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేస్తు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజలను చైతన్యం చేస్తున్న వారి సేవలు గుర్తించి పదవులను ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటి సెల్ మహమ్మద్ సిరాజుద్దీన్ ఉత్తర్వులను జారి చేయటంతో ఎమ్మెల్యే కెఎల్‌ఆర్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా మైనారిటి సెల్ వైస్ చైర్మన్‌గా నియమితులైన ఎం ఎ రహమాన్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. తమకు పదవులు ఇచ్చేందుకు సహకరించిన రాష్ట్ర మైనారిటి సెల్ చైర్మన్ సిరాజుద్దీన్, మేడ్చల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ ముజీబుద్దీన్, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నందం గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటి సెల్ నాయకులు ఎం డి మగ్బుల్, అమ్జాద్, జాఫర్, గౌడ్, కన్నా, సలీం, వాజీద్ తదితరులు పాల్గొన్నారు.