పరిగి, నవంబర్ 20: పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంన్నదని చేనేత జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం దోమ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాల కింద మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు అందచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందేలా కృషిచేస్తానని హామీనిచ్చారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధే ధ్యేయంగా ముందడుగు వేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్ కింద మంజూరి అయిన నిధులు ఎస్సీ కాలనీలో తాగునీరు, సిసి రోడ్ల నిర్మాణం, మురుగునీరు తరలింపులాంటి వాటికి ఖర్చు చేయాలన్నారు. పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో పంటనష్టం జరిగిన వారికి ఎకరాకు 10 వేలు ఇస్తుండగా, తెలంగాణలో ఆరువేలు మాత్రమే 6 వేలు ఇస్తున్నారని, ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రిప్రసాద్‌ను కోరారు.
మియాపూర్‌లో మళ్లీ చైన్‌స్నాచింగ్
శేరిలింగంపల్లి, నవంబర్ 20: మంగళవారం నాలుగు చైన్‌స్నాచింగ్‌లు జరిగి 24 గంటలు గడవకముందే బుధవారం చైన్‌స్నాచర్లు మళ్లీ బరితెగించారు. సికింద్రాబాద్‌కు చెందిన అంజమ్మ (60) మియాపూర్- మాధవనగర్‌లో వుంటున్న బంధువుల ఇంటికి వస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బ్లాక్ పల్సర్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని గొలుసును గుంజుకుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. డిఎస్‌ఐ సుధాకర్ దర్యాప్తు చేస్తున్నారు.