సోని ఫిలింస్ బ్యానర్‌పై శివ జొన్నలగడ్డ దర్శక, నిర్మాణ సారథ్యంలో గుద్దేటి బసవప్ప మేరు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘శనిదేవుడు’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ- ‘‘శనిదేవుడు చెడ్డవాడు కాదు అనేది ఈ చిత్రంలో ప్రధానంగా చూపిస్తున్నాం. భారతదేశంలో తొలిసారిగా భక్తులే దాతలై నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో శనిదేవుడితో అయ్యప్పకి, ఆంజనేయుడికి సంబంధించిన సన్నివేశాలను ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించాం. ఈ సందర్భంగా శనిదేవుడు, ఆంజనేయుడుల మధ్య జరిగే యుద్ధాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించాం. ముక్కోటి దేవతలను పట్టి పీడించిన శనిదేవుడు, వినాయకుడిని ఎందుకు పీడించలేకపోయాడు, కారణాలేమిటి? అన్నది ఎంతో హైలైట్‌గా తెరకెక్కించాం. అయ్యప్ప స్వాములు నల్లని వస్త్రాలు ఎందుకు ధరిస్తారు, శనివారమే ఆంజనేయస్వామిని ఎందుకు పూజిస్తారు? ఇలాంటి అనేక కథలను ఈ చిత్రం ద్వారా చెబుతున్నాం’’ అని చెప్పారు. చిత్ర సమర్పకులు గుద్దేటి బసవప్ప మేరు మాట్లాడుతూ-‘‘ ఈ చిత్రానికి సంబంధించిన పౌరాణిక గాథలన్నీ ఈ నెలలో పూర్తి చేసి డిసెంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’అని తెలిపారు. సుమన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో వైభవ్, సూర్య, రంగనాథ్, నరసింహరాజు, సుబ్బరాయశర్మ, తెలంగాణ శకుంతల, గుండు హనుమంతరావు, గౌతంరాజు, చిట్టిబాబు, తిరుపతి, గణేష్, జూ.రేలంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్.కుమార్, సంగీతం: అనీల్ నండూరి, పాటలు: సంజయ్‌గాంధీ, సి.ప్రేమలత, నండూరి రామానుజం, ఎడిటింగ్: కె.రమేష్, సమర్పణ: గుద్దేటి బసవప్ప మేరు, కథ, మాటలు, నృత్యాలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ జొన్నలగడ్డ.
సోని ఫిలింస్ బ్యానర్‌పై శివ జొన్నలగడ్డ దర్శక, నిర్మాణ సారథ్యంలో
english title:
senidevudu
Date:
Saturday, November 23, 2013