* అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) చేసిన ప్రతిపాదనల ప్రకారం నిబంధనావళిని సవరించడానికి ఇన్నాళ్లూ ససేమిరా అంటూ వచ్చిన భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ఎట్టకేలకు తన మనసు మార్చుకున్నట్టు సమాచారం. డిసెంబర్ 10వ తేదీలోగా నిబంధనలను మార్చకుంటే వేటు తప్పదని ఐఒసి హెచ్చరించిన నేపథ్యంలో, గత్యంతరం లేక పట్టు సడలించిందని తెలుస్తోంది. ఆర్థిక కుంభకోణాల్లో చిక్కుకొని అల్లాడుతున్న వారిని కార్యవర్గానికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధిస్తూ తీర్మానాన్ని ఆమోదించాలన్నది ఐఒసి చేసిన ప్రధాన సూచనల్లో ఒకటి. అయితే, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని, దీనిని ప్రామాణికంగా తీసుకొని నిందితులను దోషులుగా పరిగణించరాదని ఐఒఎ ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చింది. కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఈ నిబంధనను మార్చాల్సిందేనంటూ ఐఒసి స్పష్టం చేయడంతోపాటు, కఠిన చర్యలకు ఉపక్రమించక తప్పదని అల్టిమేటం జారీ చేయడంతో ఐఒఎ తీర్మానాన్ని ఆమోదించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆలస్యం చేస్తే 2016 ఒలిం పిక్స్‌లో భారత్ పాల్గొనడం అనుమానమేనని ఐఒఎకు ఐఒసి సభ్యుడు రణ్‌ధీర్ సింగ్ చేసిన హెచ్చరికను ఈ సం దర్భంగా గుర్తు చేసుకోవాలి. ఐఒసి సూచించిన విధంగా నిబంధనావళిని మార్చాలని ఐఒఎ అధికారులకు అతను స్పష్టం చేశాడు. ఐఒసి సూచనలను అమలు చేయడానికి ఐఒఎ వెనుకాడడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు కార్యవర్గానికి పోటీ చేయకుండా నిరోధించాలన్న ఐఒసి సూచనను ఐఒఎ బేఖాతరు చేసిన విషయం తెలిసిందే. నేరాల్లో నిందితులైనంత మాత్రాన వారిని దోషులుగా పేర్కోలేమని ఐఒసికి ఐఒఎ స్పష్టం చేసింది. నేరం రుజువై, కనీసం రెండు లేదా మూడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని ఇటీవల చేసిన తీర్మానంలో పేర్కొంది. అయితే, ఐఒసి సూచించిన విధంగా, చార్జిషీట్ దాఖలైతేన మరుక్షణమే నిందితులంతా అనర్హులేనని ప్రకటించాల్సిందిగా ఐఒఎకు రణ్‌ధీర్ హితవు పలికాడు. ఇలావుంటే, ఐఒఎ కు గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన సురేష్ కల్మాడీ కామనె్వల్త్ గేమ్స్ నిర్వహణ కమిటీ చీఫ్‌గానూ నియమితుడయ్యాడు. అయతే భారీ కుంభకోణాలకు పాల్పడ్డాడని అతనిపై ఆరోపణలు వెల్లువెత్తాయ. ఫలితంగా నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం అతనిని తప్పిం చింది. కల్మాడీపై ఆరోపణలు వచ్చినప్పుడు అతనికి అత్యంత సన్నిహితుడు, ఐఒఎకు కోశాధికారిగా వ్యవహరించిన లలిత్ భానోత్ హస్తం కూడా ఉందన్న విమర్శలు వచ్చాయ. కల్మాడీతోపాటు అతను కూడా అరెస్టయ్యాడు. ప్రభుత్వం క్రీడా రంగంలో జోక్యం చేసుకుంటున్నదన్న ఆరోపణ లపై ఐఒ ఎపై ఐఒసి నిషేధం విధించింది. సస్పెన్షన్ అమలులో ఉన్నప్పుడే ఐఒఎ కొత్త కార్య వర్గం ఎన్నికైంది. అభే సింగ్ చౌతాలా అధ్యక్షుడిగా, భానోత్ కార్యదర్శిగా ఏర్పడిన కొత్త కమిటీని ఐఒసి గుర్తించలేదు. కళంకితులను పోటీ చేయకుండా నిరోధించడం తోపాటు, కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించాలని ఐఒఎను ఆదేశించింది. మొదట భీష్మించినా ఆతర్వాత మెత్తబడిన ఐఒఎ ఎంత త్వర గా నిబంధనలను మారిస్తే భారత క్రీడా రంగానికి అంత మంచిది.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) చేసిన ప్రతిపాదనల ప్రకారం
english title:
delay
Date:
Sunday, November 24, 2013