* టూర్ డి ఫ్రాన్స్‌ను ఏడుసార్లు గెల్చుకొని రికార్డు సృష్టించిన లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆతర్వాత డోప్ పరీక్షలో దోషిగా తేలడంతో అతని రికార్డులతోపాటు, టైటిళ్లను కూడా రద్దు చేశారు. 2005 టూర్ డి ఫ్రాన్స్ టైటిల్‌ను ఆర్మ్‌స్ట్రాంగ్ చేజార్చుకుంటే, సహజంగా ద్వితీయ స్థానంలో ఉన్న సైక్లిస్టును విజేతగా ప్రకటించాలి. కానీ, మొదటి 22 స్థానాల్లో ఉన్న వారంతా డోప్ పరీక్షలో విచారణను ఎదుర్కొంటున్నారు. దీనితో 23వ స్థానంలో రేస్‌ను పూర్తి చేసిన సైక్లిస్టును ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మరీ ఇంత తేడా బాగుండదని భావించిన టూర్ డి ఫ్రాన్స్ అధికారులు ఆ రేస్‌లో విజేత పేరును రికార్డు పుస్తకాల్లో చేర్చలేదు. క్రీడాలోకమంతా డోప్ మయమైందని చెప్పడానికి ఇదో ఉదాహరణ.
టూర్ డి ఫ్రాన్స్‌ను ఏడుసార్లు గెల్చుకొని
english title:
dope
Date:
Sunday, November 24, 2013