* బ్రెజిల్‌లో వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చివరి జట్టుగా ఉరుగ్వే అర్హత సంపాదించింది. దీనితో ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే 32 జట్లు ఖరారయ్యాయ. పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న కారణంగా బ్రెజిల్ అర్హతను పొందగా, మిగతా 31 జట్లు క్వాలిఫయర్స్ ద్వారా క్వాలిఫై అయ్యాయ. గత వారం అమాన్‌ను 5-0 తేడాతో చిత్తుచేసిన ఉరుగ్వే చివరి క్వాలిఫయర్‌లో జోర్డాన్‌ను ఢీకొని మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. పరాజయాన్ని ఎదుర్కోకుండా, కనీసం ఎలాంటి ఫలితం లేకుండా మ్యాచ్‌ని ముగించినప్పటికీ వరల్డ్ కప్ ఫైనల్స్ చేరుకోవడం ఖాయమైన నేపథ్యంలో ఉరుగ్వే ఆరంభం నుంచి చివరి వరకూ రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. సాధ్యమైనంత ఎక్కువ సేపు బంతిని తమ ఆధీనంలో ఉంచుకొని, ఒకరికొకరు పాస్ అందించుకుంటూ ఉరుగ్వే క్రీడాకారులు వ్యూహాత్మకంగా ఆడగా, జోర్డాన్ దాడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ముందుగా అనుకున్న విధంగానే మ్యాచ్‌ని డ్రా చేసుకున్న ఉరుగ్వే 2014 వరల్డ్ కప్ ఫైనల్స్ చేరిన చివరి జట్టుగా జాబితాలోకి చేరింది.
అర్హత సంపాదించిన జట్లు ఇవే..
1. బ్రెజిల్, 2. ఆస్ట్రేలియా, 3. ఇరాన్, 4. దక్షిణ కొరియా, 5. నైజీరియా, 6. కామెరూన్, 7. ఐవరీ కోస్ట్, 8. ఘనా, 9. అల్జీరియా, 10. కోస్టారికా, 11. అమెరికా, 12. మెక్సికో, 13. హోండురాస్, 14. అర్జెంటీనా, 15. కొలంబియా, 16. జపాన్, 17. చిలీ, 18. ఈక్వెడార్, 19. నెదర్లాండ్స్, 20. ఇటలీ, 21. బెల్జియం, 22. జర్మనీ, 23. స్పెయన్, 24. ఇంగ్లాండ్, 25. స్విట్జర్లాండ్, 26. రష్యా, 27. బొస్నియా-హెర్జెగోవియా, 28. గ్రీస్, 29. క్రొయేషియా, 30. పోర్చుగల్, 31. ఫ్రాన్స్, 32. ఉరుగ్వే.
బ్రెజిల్‌లో వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్
english title:
teams
Date:
Sunday, November 24, 2013