షాబాద్, నవంబర్ 29: విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా వుండి బాగా చదువుకోవచ్చని ప్రభుత్వ వైద్యాధికారి శే్వత, విద్యాధికారి అంగూర్‌నాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం- విద్య అంశాలపై శిక్షణ నిర్వహించారు. మారుమూల గ్రామాల విద్యార్థులు తప్పకుండా పరిశుభ్రత పాటించాలి. వర్షాలు ఎక్కువగా కురవడంతో మంచినీరు కాచి వడపోసి తాగాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా వుండేలా చూసుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన వుండాలని అన్నారు.
ఆరోగ్యంగా వుంటే బాగా చదువుకోవడానికి అవకాశం వుంటుందన్నారు. పదవ తరగతి విద్యార్థులు కష్టపడి బాగా చదివి మండలానికి పేరు తేవాలని కోరారు. పిహెచ్‌ఓ మల్లేష్, ప్రధానోపాధ్యాయులు రామారావు, వెంకటేశ్వర్లు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా వుండి బాగా
english title:
cleanliness
Date:
Saturday, November 30, 2013