మలయాళంలో నిర్మించిన ‘యుగపురుషన్’ చిత్రాన్ని తెలుగులో నాగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సునీల్ పెల్లెల్లి, కె.పవన్‌కుమార్ అందిస్తున్నారు. విజయరామచంద్ర, ముమ్మట్టి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైలర్లు శనివారం ఉదయం ఫిలిం ఛాంబర్ హాల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన జస్టిస్ వి.ఈశ్వరయ్య మాట్లాడుతూ- ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం అనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చి కేరళలో గొప్ప ఆధ్యాత్మిక సామాజిక విప్లవం తీసుకువచ్చిన శ్రీ నారాయణగురు జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన విజయరామచంద్ర (తలైవాసన్ విజయ్) నారాయణగురుగా నటించారని, ఆయన శిష్యుడిగా సూపర్‌స్టార్ ముమ్మట్టి నటించడం విశేషమని నిర్మాతలు సునీల్, కె.పవన్‌కుమార్ తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు త్వరలో పూర్తిచేసి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. తమ కులగురువు నారాయణగురువు చిత్రం కావడంతో తానీ కార్యక్రమానికి వచ్చానని, తమ ప్రాంతంలో అనేక దేవాలయాలకు, పాఠశాలలను అభివృద్ధి ఆయన చేశారని నటుడు సుమన్ తెలిపారు. కార్యక్రమంలో సత్యాబాయి, రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కళాభవన్ మణి, బాబు ఆంటోనీ, సవ్యనైర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామచంద్రబాబు, సంగీతం: మోహన్ సితార, మాటలు: కాలుకూరి ప్రసాద్, పాటలు: మాస్టర్జీ, కోమర శ్రీమణి, దర్శకత్వం: ఆర్.సుకుమారన్
మలయాళంలో నిర్మించిన ‘యుగపురుషన్’ చిత్రాన్ని
english title:
sri
Date:
Sunday, December 1, 2013