న్యూఢిల్లీ/ముంబయి, డిసెంబర్ 1: గుజరాత్‌లో ఒక మహిళపై అక్రమ నిఘా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించవచ్చని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సహా వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించవచ్చని తెలుస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు మహిళా ఆర్కిటెక్ట్‌పై నిఘా పెట్టడం తెలిసిందే. ఆ మహిళ రాష్ట్రం వెలుపలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తీసుకోవలసిన కేంద్రం అనుమతి లేకుండా జరిపిన ఈ నిఘా ఫోన్ ట్యాపింగ్ నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు నరేంద్ర మోడీ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటారా అని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను విలేఖరులు ముంబయిలో ప్రశ్నించగా, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరుపుతారని, ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని షిండే తెలిపారు. అంతేకాదు స్నూపింగ్‌పై చర్య తీసుకునే అధికారాలు కేంద్ర, రాష్ట్ర హోం కార్యదర్శులకున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రం లోపల ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశించడానికి రాష్ట్ర హోం కార్యదర్శికి అధికారాలున్నాయి. అయితే ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాల్లో నిఘా కొనసాగించేటప్పుడు కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోవాలి. అయితే గుజరాత్‌లోనే కాకుండా ఆ మహిళ మహారాష్ట్ర, కర్నాటకకు వెళ్లినప్పుడు సైతం రాష్ట్ర పోలీసులు నిఘా పెట్టడంతో పాటు ఆమె ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. అయితే ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండడంతో హోం శాఖ దీనిపై దర్యాప్తుకు ఆదేశించ వచ్చని తెలుస్తోంది.
గుజరాత్‌లో ఒక మహిళపై అక్రమ నిఘా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై
english title:
akrama
Date:
Monday, December 2, 2013