హైదరాబాద్, డిసెంబర్ 2: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 150 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామకృష్ణ రామస్వామి చెప్పారు. ప్రో వైస్ ఛాన్సలర్ ఇ హరిబాబు, , కంట్రోలర్ ప్రొఫెసర్ వేంకటేశ్వరరావు, ప్రొఫెసర్ రాజశేఖరరావులతో కలిసి ఆయన సోమవారం నాడు పాత్రికేయులతో మాట్లాడారు. తొలి విడతగా 67 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు. 130 రకాల కోర్సులను వర్శిటీలో నిర్వహిస్తున్నామని వాటిలో ప్రవేశాలకు 3వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తామని , 4వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలుకల్పిస్తున్నామని అన్నారు. అడ్మిషన్లకు దేశవ్యాప్తంగా 33 రీజనల్ కేంద్రాలను నిర్ణయించామని, ఆంధ్రప్రదేశ్‌లో పది పట్టణాల్లో ప్రవేశపరీక్షలు జరుగుతాయని చెప్పారు. యుజి, పిజి, పరిశోధన స్థాయి వరకూ దాదాపు 2వేలకు పైగా సీట్లు ఉన్నాయని, పిహెచ్.డి 400 సీట్లు, ఎం.్ఫల్ 350 సీట్లు ఉన్నాయని, ఈసారి నూరు శాతం సీట్లు భర్తీ అయ్యేందుకు వీలుగా కటాఫ్ మార్కుల విధానాన్ని తొలగించామని అన్నారు. పరీక్ష రాసిన వారందరికీ ర్యాంకులు ఇస్తామని చెప్పారు. కేంద్రీయ యూనివర్శిటీల్లో ఈ తరహా నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రధమమని అన్నారు. దీనివల్ల ప్రతి ఏటా సీట్లు భర్తీ కాకుండా ఉండిపోయే పరిస్థితి ఇక మీదట ఏర్పడదని అన్నారు. అలాగే బిసి, ఎస్సీ, ఎస్టీల విషయంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ పరిమితి మేరకే తాము ఫీజు నిర్ధారిస్తామని, దానివల్ల ప్రభుత్వం ఇచ్చే రీయంబర్స్‌మెంట్‌తో విద్యార్ధి చదువు పూర్తి చేయవచ్చని అన్నారు. గతంలో ఎక్కువ ఫీజు ఉండటంతో విద్యార్ధి దానిని చెల్లించలేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, ఆ పరిస్థితి ఇక రాదని చెప్పారు.
విద్యాసంస్థల నెట్‌వర్కు
హైదరాబాద్‌లోని విద్యాసంస్థల నెట్‌వర్కును జి-హాన్ పేరిట ఏర్పాటు చేశామని, దీనివల్ల ఆయా విద్యాసంస్థలు పరస్పరం తమ నైపుణ్యతను మార్పిడి చేసుకునే వీలుందని చెప్పారు.
ఎస్‌బిసిఐ సదస్సు
సొసైటీ ఆఫ్ బయోలాజీకల్ కెమిస్ట్స్ అంతర్జాతీయ సదస్సును మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు విసి రామస్వామి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ దయానంద చెప్పారు. జన్యుకణ సంవిధానం, ప్రవర్తన అనే అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలోని నిష్ణాతులైన శాస్తవ్రేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారని, జన్యుకణ విశే్లషణ, రచన కంటే జన్యుపటం నుండి మనం నేర్చుకున్న అంశాలను వినియోగంలోకి తీసుకురావడం పెద్ద సవాలుగా మారిందని , ఆ కోణంలో ఈ సదస్సులో విస్తృతస్థాయి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.
అడ్మిషన్లకు నేడు నోటిఫికేషన్ * కటాఫ్ మార్కుల నిబంధన తొలగింపు : విసి
english title:
central university
Date:
Tuesday, December 3, 2013