బ్యాంకాక్, డిసెంబర్ 2: రెండు రోజుల్లో పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను థాయిలాండ్ ప్రధాన మంత్రి ఇంగ్లుక్ షినవత్ర సోమవారం తోసిపుచ్చారు. దేశంలో రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్న హింసాకాండకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఏమి చేసేందుకైనా తాను సిద్ధమేనని, అయితే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రధాని పదవి నుంచి వైదొలిగి ప్రజలు ఎన్నుకోని కౌన్సిల్‌కు అధికారాన్ని అప్పగించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ‘ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను అంగీకరించే ప్రసక్తే లేదు. దేశంలో శాంతిని పునరుద్ధరించేందుకు వీలుగా రాజ్యాంగానికి లోబడి ఏమి చేసేందుకైనా నేను సిద్ధమే’ అని ఆమె విలేఖర్లతో అన్నారు.
రెండు రోజుల్లో పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు చేసిన
english title:
shinavatra
Date:
Tuesday, December 3, 2013