డ్యునెడిన్, డిసెంబర్ 3: వెస్టిండీస్‌తో ఆరంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రాస్ టేలర్, కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ శతకాలు నమోదు చేయడంతో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఈ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 367 పరుగులు చేసింది. టేలర్ 103, మెక్‌కలమ్ 109 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్‌కు పీటర్ ఫల్టన్, హమీష్ రూథర్‌ఫొర్డ్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించిన తర్వాత షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్‌లో నర్సింగ్ దియోనారైన్ క్యాచ్ అందుకోగా అవుటైన రూథర్‌ఫొర్డ్ 62 పరుగులు చేశాడు. ఫల్టన్ 61 పరుగులు సాధించి డారెన్ సమీ బౌలింగ్‌లో ఎడ్వర్డ్స్‌కు చిక్కగా, అంతకు ముందే ఆరన్ రెడ్మండ్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద సామ్యూల్స్ క్యాచ్ పట్టగా టినో బెస్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం టేలర్, మెక్‌కలమ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 182 పరుగులు జోడించే క్రమంలో సెంచరీలు పూర్తి చేశారు.
న్యూజిలాండ్ 3/367 * వెస్టిండీస్‌తో మొదటి టెస్టు
english title:
newzealand
Date:
Wednesday, December 4, 2013