ముంబయి, డిసెంబర్ 3: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన వన్డే జట్టులో భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి స్థానం దక్కలేదు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అటు టెస్టు, ఇటు వన్డే జట్లలో చోటు దక్కించుకోవడం విశేషం. వరుసగా ఆరోసారి వన్డే జట్టుకు ఎంపికైన ధోనీనే కెప్టెన్సీ కూడా వరించింది. వనే్డ జట్టులో భారత్ నుంచి ధోనీతోపాటు రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్ కూడా జట్టులో స్థానం సంపాదించారు. అదే విధంగా, ఇంగ్లాండ్ సారథి అలిస్టర్ కుక్ సారథ్యంలోని టెస్టు జట్టులో మన దేశం నుంచి ధోనీతోపాటు చటేశ్వర్ పుజారాకు దక్కింది. 12వ ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. నిజానికి 2012 ఆగస్టు 7 నుంచి 2013 ఆగస్టు 25 మధ్య కాలంలో ఆటగాళ్ల ప్రదర్శనను ప్రాతిపదికగా తీసుకొని వనే్డ, టెస్టు జట్లను ఎంపిక చేశారు. ఆ కాలంలో కోహ్లీ రెండు శతకాల సాయంతో 689 పరుగులు సాధించాడు. సగటున 40.52 పరుగులు చేసినప్పటికీ, అతనికి వనే్డ జట్టు లో స్థానం లభించకపోవడం విచిత్రం. అయతే, వచ్చే ఏడా ది కోహ్లీ పేరు తప్పక ఉంటుందని ఐసిసి అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐసిసి వన్‌డే టీమ్ ఆఫ్ ది ఇయర్
మహేంద్ర సింగ్ ధోనీ (భారత్/కెప్టెన్/వికెట్‌కీపర్), తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక), శిఖర్ ధావన్ (భారత్), హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర (శ్రీలంక), ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), రవీంద్ర జడేజా (భారత్), సరుూద్ అజ్మల్ (పాకిస్తాన్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్), లసిత్ మలింగ (శ్రీలంక).
12వ ఆటగాడు: మిచెల్ మెక్లీనగన్ (న్యూజిలాండ్).
ఐసిసి టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్
అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్/కెప్టెన్), చటేశ్వర్ పుజారా (భారత్), హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా), మైఖేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), మైకేల్ హస్సీ (ఆస్ట్రేలియా), ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), మహేంద్ర సింగ్ ధోనీ (భారత్/వికెట్‌కీపర్), గ్రేమ్ స్వాన్ (ఇంగ్లాండ్), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్), వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా).
12వ ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (భారత్).
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన వన్డే
english title:
one day team
Date:
Wednesday, December 4, 2013